స్మార్ట్ఫోన్లతో Contact-less ATM నుండి విత్ డ్రా టెస్టింగ్ పూర్తయ్యింది

స్మార్ట్ఫోన్లతో Contact-less ATM నుండి విత్ డ్రా టెస్టింగ్ పూర్తయ్యింది
HIGHLIGHTS

ATM లను ముట్టుకోకుండా చేయకుండా COVID-19 మహమ్మారిని ఎదుర్కోవటానికి సహాయపడుతుంది.

Contact-less ATM తో కేవలం మీ బ్యాంక్ మొబైల్ యాప్ నుండి QR కోడ్ స్కాన్ చేస్తే చాలు మీ ట్రాన్సక్షన్ జరిగిపోతుంది.

Contact-less ATM స్క్రీన్‌ పైన కనిపించే QR కోడ్‌ను స్కాన్ చెయ్యాలి అంతే.

మరింతగా విజృంభిస్తున్న కరోనా వైరస్ (COVID-19) మహమ్మారి విషయంలో ప్రమాదకరమని భావించే అనేక విషయాలలో, ATM ల నుండి నగదు విత్ డ్రా  చేయ్యటం. ఎందుకంటే, ఎటిఎమ్ ‌ను ఉపయోగించెప్పుడు మీరు మెషీన్‌లోని బటన్లను తాకవలసి ఉంటుంది. దీనికి పరిష్కారం ఏమిటంటే కాంటాక్ట్-లేని ఎటిఎమ్ విత్ డ్రా ని అవలంభించడం. అందుకే, ఈ సంస్థ బ్యాంకులకు ఈ టెక్నాలజీతో ATM లను అందించడానికి ప్రయత్నిస్తున్నది.

నగదు మరియు డిజిటల్ చెల్లింపు పరిష్కారాలు మరియు ఆటోమేషన్ టెక్‌తో వ్యవహరించే AGS ట్రాన్సాక్ట్ టెక్నాలజీస్ లిమిటెడ్ (AGSTTL), ATM ల కోసం ఒక పరిష్కారాన్ని విజయవంతంగా అభివృద్ధి చేసింది. ఇది ATM లను ముట్టుకోకుండా చేయకుండా COVID-19 మహమ్మారిని ఎదుర్కోవటానికి సహాయపడుతుంది.

స్మార్ట్ఫోన్లతో Contact-less ATM  విత్ డ్రా

Contact-less ATM  సొల్యూషన్  ప్రస్తుతం ఆసక్తిగల బ్యాంకుల కోసం డెమో చేయబడుతోంది. ఈ సాంకేతిక పరిజ్ఞానం(టెక్నాలజీ) గురించి మంచి విషయం ఏమిటంటే దీనికి ATM మెషీన్ యొక్క ఫిజికల్ అప్డేట్ అవసరం లేదు. బదులుగా, ATM మెషీన్ యొక్క సాఫ్ట్‌వేర్ అప్డేట్  Contact-less లావాదేవీలను ప్రారంభిస్తుంది. అంటే, దీని ద్వారా కేవలం మీ బ్యాంక్ మొబైల్ యాప్ నుండి QR కోడ్ స్కాన్ చేస్తే చాలు మీ ట్రాన్సక్షన్ జరిగిపోతుంది.

ఇది ఎలా పనిచేస్తుందో ఇక్కడ చూడవచ్చు –

1. బ్యాంక్ మొబైల్ యాప్ తెరిచి, QR Code స్కాన్ ను ఎంచుకోండి.

2. మీరు మొబైల్ యాప్ లో ఏటీఎం నుండి విత్ డ్రా చెయ్యాలనుకుంటున్న నగదు మొత్తాన్ని నమోదు చేయండి.

3. ATM స్క్రీన్‌ పైన కనిపించే QR కోడ్‌ను స్కాన్ చెయ్యాలి .

4. తరువాత, ఈ యాప్ లోని ‘proceed’ పై క్లిక్ చేయడం ద్వారా అమౌంట్ నిర్ధారించండి.

5. ట్రాన్సాక్షన్ Confirm చేయడానికి  ATM పిన్ ఎంటర్ చేయండి.

6. మీ అమౌంట్ మరియు రశీదు తీసుకోండి.

కరోనా వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి భారతదేశంలో ప్రజల జీవితంలో ప్రతివిషయంలోనూ Contact-less పద్దతులను అనుసరిస్తున్నారు. ఇటీవల, టెలికాం కంపెనీలు వోడాఫోన్ ఐడియా, రిలయన్స్ జియో మరియు ఎయిర్‌టెల్ కాంటాక్ట్-లెస్  సిమ్ కార్డ్ అమ్మకాలను ప్రారంభించే మార్గాలను పరిశీలిస్తున్నాయని కూడా తెలుస్తోంది. కిరాణా దుకాణాల కౌంటర్ వద్ద రద్దీని తగ్గించడానికి ఆన్‌లైన్ డెలివరీని ప్రారంభించడానికి వీలు కల్పిస్తున్నాయి. అలాగే, జోమాటో మరియు స్విగ్గి వంటి ఫుడ్ డెలివరీ యాప్స్ కూడా తమ వినియోగదారులకు కాంటాక్ట్-లెస్  డెలివరీలను ప్రోత్సహిస్తున్నాయి. సంక్షిప్తంగా, కొరోనావైరస్ మహమ్మారికి  వ్యాక్సిన్ లేకపోవడం వలన నివారణ కోసం కనీస సామాజిక దూరం (సోషల్ డిస్టెన్స్) మాత్రమే పరిష్కారం అనిపిస్తుంది. ఈ న్యూస్ ను ప్రచురించే నాటికి, భారతదేశపు COVID-19 సంఖ్య 276,046 వద్ద ఉంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo