Cloudflare Down another time and know live status
Cloudflare Down: అనేక సైట్స్ కి సర్వీస్ అందించే ఇంటర్నెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు CDN (కంటెంట్ డెలివరీ నెట్వర్క్)డ్ క్లౌడ్ ఫ్లేర్ ఈరోజు మరోసారి డౌన్ అయ్యింది. ఈ సర్వీస్ రీసెంట్ గా గత నెలలో భారీగా డౌన్ అయ్యింది. ఈ సర్వీస్ దెబ్బకు చాలా సైట్స్ రెండు గంట వరకు పని పని చేయలేదు. గత నెల ఈ సర్వీస్ తో డౌన్ అయిన వాటిలో, X ప్లాట్ ఫామ్ మరియు డౌన్ డిక్టేటర్ వంటి మరిన్ని సర్వీస్ లు ఉన్నాయి. ఈ సర్వీస్ ఈరోజు కూడా మరోసారి డౌన్ అయ్యింది.
క్లౌడ్ ఫ్లేర్ ఈరోజు మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ సర్వీస్ డౌన్ అయినట్లు డౌన్ డిక్టేటర్ నుంచి యూజర్లు రిపోర్ట్ చేయడం ప్రారంభించారు. ఈ రిపోర్ట్ మధ్యాహ్నం 2:30 నుంచి మరింత పెరిగి తారాస్థాయికి చేరుకుంది. అయితే, ఇటీవల ఈ సర్వీస్ లో కలిగిన ఇబ్బందితో పోలిస్తే ఈసారి అంత ఎక్కువ ప్రాబ్లం ఉన్నట్లు కనిపించలేదు.
Also Read: Nothing Phone (3): 80 వేల రూపాయల ఫోన్ పై 60 వేల రూపాయల డిస్కౌంట్ అందుకోండి.!
క్లౌడ్ ఫ్లేర్ డౌన్ అయితే ఈ సర్వీస్ ప్రొవైడర్ తో సర్వీస్ అందుకునే చాలా వెబ్సైట్ కూడా డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే, డౌన్ డిక్టేటర్ నుంచి Zerodha, Crunchyroll మరియు Valorant మూడు సైట్స్ డౌన్ అయినట్లు మాత్రం డౌన్ డిక్టేటర్ లో రిపోర్ట్ అందుకుంది.
ఈ విషయం గురించి కంపెనీ ముందుగా నోటిఫికేషన్ అందించింది. క్లౌడ్ ఫ్లేర్ స్టేటస్ నుంచి ఈ నోటిఫికేషన్ అందించింది. డిసెంబర్ 5వ తేదీ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మెయింటెనెన్స్ సర్వీసెస్ జరగుతుందని మరియు ఆ సమయంలో సర్వీస్ లో కొత్త సమయం సమస్యలు ఉండవచ్చు, అని కంపెనీ ముందే ప్రీ నోట్ అందించింది.
ఇది మాత్రమే కాదు, ఈ సర్వీస్ లో వచ్చిన లోపల గురించి రిపోర్ట్ అందుకున్న వెంటనే దానికి స్పందిస్తూ కొత్త నోటిఫికేషన్ కూడా అప్డేట్ చేసింది. ఇప్పుడు ఈ సమస్య మెల్లమెల్లగా తగ్గుతోంది. కాబట్టి, క్లౌడ్ ఫ్లేర్ తో అనుసంధానమైన సైట్స్ లో ఎటువంటి సమస్య ఉండబోదని కంపెనీ చెబుతోంది.