ChatGPT Prompts for Study to get smart preparation for examinations
ChatGPT Prompts for Study: ఇప్పటికే పరీక్షల కాలం మొదలయ్యింది మరియు అప్పర్ ప్రైమరీ పిల్లలకు ఎగ్జామ్స్ స్టార్ట్ కానున్నాయి. 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కూడా వారి ఎగ్జామినేషన్ కోసం స్మార్ట్ గా ప్రిపేర్ కావడానికి AI సహాయం చేస్తుంది. ఒకప్పటి చదువులతో పోలిస్తే, ప్రస్తుతం ఎడ్యుకేషన్ మరింత స్మార్ట్ గా మారింది. కాబట్టి, మీరు కూడా ఏఐ తో మరింత స్మార్ట్ గా ప్రిపేర్ కావచ్చు. ఇదే కాదు, కాంపిటీటివ్ ఎగ్జామ్స్, గవర్నమెంట్ సర్వీస్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ కావడానికి కూడా మీకు చాట్ జిపిటి చాలా చక్కగా ఉపయోగపడుతుంది.
నేటి డిజిటల్ యుగంలో చదువు విధానం పూర్తిగా మారుతోంది. ముఖ్యంగా, చాట్ జిపిటి వంటి AI టూల్స్ ద్వారా విద్యార్థులు ఇప్పుడు మరింత స్మార్ట్ గా మరియు వేగంగా నేర్చుకునే అవకాశం ఉంది. అయితే, సరైన ‘Prompt’ ఇవ్వడం ద్వారా మీరు ఏఐ టూల్స్ నుంచి మంచి రిజల్ట్ అందుకోవచ్చు. అందుకే, చాట్ జిపిటి వంటి ఏఐ సాధనాలు ఉపయోగించేటప్పుడు ప్రాంప్ట్ ఎలా రాయాలి అని రోజు తెలుసుకోండి.
ప్రాంప్ట్ రాయడం తెలుసుకునే ముందు అసలు ప్రాంప్ట్ అంటే ఏమిటో తెలుసుకోండి. మీరు చాట్ జిపిటి కి ఇచ్చే ప్రశ్నలు లేదా సూచనలు ప్రాంప్ట్ గా చెబుతారు. ఇందులో సరైన ప్రాంప్ట్ ఇవ్వడం ద్వారా క్లియర్ అండ్ పాయింట్ వైజ్ వివరాలు అందుకుంటారు.
చదువులో చాట్ జిపిటి చాలా బాగా ఉపయోగపడుతుంది. కాన్సెప్ట్ అర్థం చేసుకోవడం, నోట్స్ తయారు చేయడం, చాలా కఠినమైన టాపిక్స్ ను సింప్లిఫై చేసి ఇవ్వడం, ఎటువంటి డౌట్ ఉన్న క్లియర్ గా మరియు విడమరిచి అర్ధం చేసే శక్తి చాట్ జిపిటి కి ఉంది. ఈ పనులు అన్ని కూడా చాలా తక్కువ సమయంలో చేస్తుంది కాబట్టి మీ టైమ్ సేవ్ అవుతుంది.
ప్రాంప్ట్ గురించి మరియు దాని ఉపయోగాల గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు చాట్ జిపిటి లో మంచి ప్రాంప్ట్ రాయడం గురించి తెలుసుకుందాం.
మీరు కోరుకునే టాపిక్ గురించి చక్కగా అర్థం చేసుకోవడానికి “Explain this topic in simple Telugu with examples” అనే ప్రాంప్ట్ ఉపయోగించండి. ఇది సులభంగా అర్థం చేసుకునే మరియు చాలా ఈజీ నోట్ అందిస్తుంది.
ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యేవారు నోట్ తయారు చేయడానికి “Create short notes for this chapter with key points” ప్రాంప్ట్ ఉపయోగించవచ్చు. ఇది క్విక్ రివిజన్ మరియు క్లియర్ అండ్ పాయింట్ టు పాయింట్ నోట్స్ కోసం ఉపయోగపడుతుంది.
ఇది కూడా ఎగ్జామ్ ప్రిపరేషన్ కోసం ఉపయోగపడే ప్రాంప్ట్ “Summarize this topic in 5 important points” ఇది ప్రత్యేకమైన టాపిక్ కోసం ఉపయోగపడుతుంది మరియు మీ సమయం కూడా ఆదా చేస్తుంది.
ఏదైనా విషయం లేదా టాపిక్ పై అనుమానం ఉంటే “Explain why this happens with step-by-step reasoning” ప్రాంప్ట్ ఉపయోగించండి.
Also Read: ఈ రోజు మాత్రమే: Boat 5.2.4 Dolby Atmos సౌండ్ బార్ ను అతి చవక ధరలో అందుకోండి.!
మీరు పరీక్షలకు ప్రిపేర్ అవుతుంటే, మీరు ప్రాక్టీస్ కోసం “Create 10 important questions with answers from this topic” ప్రాంప్ట్ ఉపయోగించి క్వశ్చన్ పేపర్ ను ప్రిపేర్ చేసుకోవచ్చు.
ఒకవేళ మీరు పూర్తి సిలబస్ తో వ్ ఉదాహరణ ప్రశ్న పత్రం ప్రిపేర్ చేయాలనుకుంటే “Create examination question paper with answers from syllabus” ప్రాంప్ట్ ను ఉపయోగించవచ్చు. ఇక్కడ మీ స్టేట్ సిలబస్ మరియు క్లాస్ జత చేయాలి.
మీరు అడిగే ఏదైనా ప్రశ్న లేదా టాపిక్ ను చాలా క్లియర్ గా అడగండి. అంటే, టాపిక్ లాంగ్వేజ్ వంటి వివరాలు ఇవ్వండి. అంతేకాదు, “with examples”, “step-by-step” వంటి పదాలు జత చేయండి.
ప్రతి సమాధానం సరైనది అని చెప్పలేము. అందుకే, మీ టెక్స్ట్ బుక్ లేదా ఇతర బుక్స్ నుండి వెరిఫై చేయండి. ముఖ్యంగా, ప్రతి పనికి AI పై మాత్రమే ఆధారపడొద్దు, మీ సొంత ఆలోచన మరియు బుక్స్ లో ఉండే వివరాలు చదవడం చాలా మంచిది.