చంద్రయాన్ -2 ప్రయోగం, ఈ రోజు మధ్యాహ్నం 2:43 గంటలకి మొదలుకావచ్చు.

Updated on 22-Jul-2019
HIGHLIGHTS

ఈ రోజు మధ్యాహ్నం 2:43 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి బయలుదేరుతుంది.

ఒక వారం ఉహించని ఆలస్యం తరువాత, చంద్రయాన్ -2 చివరకు దాని గమ్యస్థానమైన చంద్రుని వైపు ప్రయోగించడానికి సిద్ధంగా ఉంది. ఈ రోజు మధ్యాహ్నం 2:43 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి బయలుదేరుతుంది. మొదటి ప్రయోగ ప్రయత్నం నిలిపివేసిన నాలుగు రోజుల తరువాత, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) గత గురువారం (జూలై 18)న సవరించిన లాంచ్ తేదీని ట్వీట్ చేసింది. ఇస్రో అప్పటి నుండి మిషన్ యొక్క లాంచ్ విధానంలో “టెక్నీకల్ స్నాగ్స్” ను సరిచేసింది.

ప్రయోగానికి ముందు కొన్ని గంటల ముందునుండే, ఇస్రో ఈ రాకెట్ యొక్క ఇంధనం గురించి ట్విట్టర్‌లో క్రమం తప్పకుండా అప్డేట్ లను  పోస్ట్ చేస్తోంది. లిక్విడ్ కోర్ స్టేజ్ (ఎల్ 110) యొక్క ఇంధనం (యుహెచ్ 25) నింపడం గత రాత్రి 10:07 గంటలకు పూర్తయింది. అలాగే, లిక్విడ్ కోర్ స్టేజ్ (ఎల్ 110) కోసం ఇంధనం (ఎన్ 204) నింపడం ఈ రోజు ఉదయం 7:54 గంటలకు పూర్తయింది. “ఈ లాంచ్ కి సమయం ఐదు గంటల కన్నా తక్కువ !!! # GSLVMkIII-M1 యొక్క క్రయోజెనిక్ స్టేజ్ (C25) కోసం లిక్విడ్ ఆక్సిజన్ నింపడం ప్రారంభమైంది ”అని ఇస్రో ట్విట్టర్‌లో ఉదయం 9:58 IST  గంటలకు  రాశారు.

అన్నీ ప్రణాళిక ప్రకారం ప్రకారం జరిగితే, చంద్రయాన్ -2 సెప్టెంబర్ ప్రారంభంలో చంద్రుని వాతావరణానికి చేరుకోవాలి. నీటి మంచు యొక్క ఆనవాళ్లను కలిగి ఉన్నట్లు తెలిసినందున, చంద్ర దక్షిణ ధ్రువం పైన ఈ అంతరిక్ష నౌకను ల్యాండ్ చేయాలని ఇస్రో యోచిస్తోంది. ఈ ప్రాంతంలోని క్రేటర్స్, సౌర వ్యవస్థ యొక్క శిలాజాలను కలిగి ఉన్నట్లు తెలిసింది.

ఈ రోజు చంద్రయాన్ -2 యొక్క ప్రయోగ వాహనం, అంతరిక్ష సంస్థ పరీక్షించిన జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ మార్క్ III (GSLV MK -III ), ఇది పూర్తిగా లోడ్ అయినప్పుడు 3.8 టన్నుల బరువు ఉంటుంది. చంద్రయాన్ -2 లో ల్యాండర్ (విక్రమ్), రోవర్, (ప్రగ్యాన్) మరియు ఆర్బిటర్ మాడ్యూల్స్ ఉంటాయి. ఈ భాగాలన్నీ మిశ్రమ నిర్మాణంలో కలిసి ఉంటాయి మరియు యాంత్రికంగా ఇంటర్‌ఫేస్ చేయబడతాయి. చంద్రయాన్ -2 చంద్రుని కక్ష్యకు చేరుకున్నప్పుడు, ల్యాండర్, దాని లోపల రోవర్‌తో, కక్ష్య నుండి ఆటొమ్యాటిగ్గా విడిబడి, చంద్రుని ఉపరితలం వైపుకు పయనిస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :