Battlegrounds Mobile India: 2 కోట్ల ప్రీ రిజిస్ట్రేషన్స్ సాధించింది

HIGHLIGHTS

గూగుల్ ప్లే స్టోర్ నుండి 2 కోట్ల ప్రీ రిజిస్ట్రేషన్స్ సాధించి రికార్డ్ సృష్టించింది

Battlegrounds Mobile India కోసం భారీ రిజిస్ట్రేషన్స్

అభిమానులకు త్యాంక్స్ చెప్పిన Krafton

Battlegrounds Mobile India ఇండియాలో విడుదలకు ముందుగానే భారీ అంచనాలను నమోదు చేసింది. ఇప్పటికే, గూగుల్ ప్లే స్టోర్ నుండి 2 కోట్ల ప్రీ రిజిస్ట్రేషన్స్ సాధించి రికార్డ్ సృష్టించింది. ఒక వైపు ఈ గేమ్ ను ఇండియాలో రాకుండా చూడాలని కొంత మంది తమ నిరసన వ్యక్తం చేస్తుంటే, Battlegrounds Mobile India గేమ్ అభిమానులు మాత్రం ఈ గేమ్ కోసం భారీగా రిజిస్ట్రేషన్స్ చేసుకోవడం విశేషం.

Krafton ఈరోజు రిలీజ్ చేసిన ప్రెస్ రిలీజ్ లో Battlegrounds Mobile India గేమ్ ను అమితంగా ఆదరించిన అందరికి తాన్ త్యాంక్స్ తెలిపింది. అలాగే, ఈ గేమ్ జూన్ 18 న LIVE అవుతుంది. కాబట్టి, ముందుగానే Pre Registration చేసుకుంటే LIVE అయిన వెంటనే నోటిఫికేషన్ వస్తుందని చెబుతోంది. అయితే, గూగుల్ ప్లే స్టోర్ లో ఇప్పటికే ఈ గేమ్ యొక్క ఇమిటేషన్స్ చాలా ఉన్నాయి కాబట్టి Krafton Inc అని చూపించే యాప్ నే డౌన్ లోడ్ చేసుకోండి.

 Battlegrounds Mobile India గేమ్ పైన వస్తున్న హైప్ చూస్తుంటే ఈ గేమ్ మరొకసారి రికార్డులను నమోదు చెయ్యవచ్చు. అయితే, ఇంతకు ముందు గ్లోబల్ ప్లేయర్ల తో ఈ గేమ్ ఆన్లైన్ లో ఛాలంజ్ చేసే అవకాశం ఉండేది. అయితే, ఎప్పుడు ఇండియా కోసం ప్రత్యేకంగా లాంచ్ చేస్తున్న ఈ గేమ్ లో ఎటువంటి వివరాలను అందిచారో గేమ్ లాంచ్ అయిన తరువాత తెలుస్తుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :