ప్రస్తుతం, ప్రతి ఒక్కరూ కూడా మొబైల్ ఫోన్ వాడుతున్నారు. మన దేశంలో ఉన్న కంప్యూటర్ల కంటే స్మార్ట్ ఫోన్ల సంఖ్య ఎన్నో రేట్లు ఎక్కువగా ఉంటుంది. ఇదే అదునుగా కొంతమంది అనేక రకాలైన మాల్వేర్ లను సృష్టిస్తూ, మొబైల్ వినియోగదారులకు చాలా నష్టం కలిగిస్తున్నారు. కొంత మంది పూర్తి డేటాని దొంగిలించే మాల్వేర్ పంపిస్తే, మరికొందరు పూర్తిగా యాక్సెస్ దొంగిలించే మాల్వేర్ తీసుకొస్తున్నారు.
అయితే, కొత్తగా కనుగొన్న " ఏజెంట్ స్మిత్ " మాల్వేర్ మాత్రం మీకు మరొక విధమైన నష్టాన్ని కలిగిస్తుంది. ఈ ఆప్ ఇప్పటి వరకూ 2.5 కోట్ల స్మార్ట్ ఫోన్ల పైన దాడిచేసిట్లు అంచనావేస్తుండగా, వాటిలో 1.5 కోట్ల స్మార్ట్ ఫోన్లు ఇండియాలోనివి కావడం విశేషం. ఈ మాల్వేర్, చైనా నుండి ఇంజెక్ట్ చేయబడింది మరియు ఇది థర్డ్ పార్టీ ఆప్ స్టోర్ అయినటువంటి '9Apps' నుండి ఎక్కువగా అటాక్ చేసినట్టు ద్రువీకరించబడింది.
హాలీవుడ్ సినిమా అయినటువంటి 'Matrix' గురించిన దాదాపుగా అందరికి తెలిసేవుంటుంది, ఆ సినిమాలో విలన్ క్యారెక్టర్ 'ఏజెంట్ స్మిత్' లాంటిదే ఈ మాల్వేర్ చేసే అటాక్. ఈ విలన్ ఒక్క సారి ముట్టుకోవడంతో ఎదుటివారిని తనలాగా మార్చేస్తాడు, ఆ తరువాత వాళ్ళు తాను చెప్పినట్లు వింటారు. ఈ మాల్వేర్ కూడా మనం ఫోన్ లోకి ప్రవేశించగానే, మిగిలిన అన్ని App లను తనలాగా మార్చేస్తుంది మరియు తన ఆధీనంలోకి తెచ్చుకుంటుంది.
తరువాత, ఇది వారికీ కావాల్సిన యాడ్స్ ఎక్కువగా ఈ మొబైల్ పైన చూపిస్తుంది. ఈ యాడ్స్ ని మీరు వద్దనుకున్నా ఆపలేరు అలా మీఫోన్ను సెట్ చేస్తుంది. దీని ద్వారా ఆ యాడ్ సంస్థల నుండి ఈ మాల్వేర్ యజమానులు డబ్బు సంపాదిస్తారు. మరిన్ని నష్టాల గురించి పరిశీలిస్తే, ఇది ఈ ఆప్స్ నుండి మీ ప్రైవేట్ డేటాని కూడా తస్కరించవచ్చు. అందుకోసమే, థర్డ్ పార్టీ ఆప్ స్టోర్ నుండి ఆప్స్ డౌన్లోడ్ చేసే ముందు కొంచం జాగ్రత్తగా ఉండండి.