మార్కెట్లోకి కొత్తగా వచ్చిన ఫోన్ లతో పాటుగా యూజ్డ్ ఫోన్ లకు కూడా బాగానే డిమాండ్ ఉంది. దేనికి కారణం ఏమిటంటే, కొత్త ఫోన్ కోసం ఖర్చు చేసే డబ్బులో సగం డబ్బుతోనే ఒక యూజ్డ్ ఫోన్ లేదా సెకండ్ హ్యాండ్ ఫోన్ కొనే వీలుంటుంది. అయితే, తక్కువ ధరలో వస్తుందని సెకండ్ హ్యాండ్ ఫోన్ ను ఎటువంటి చెకింగ్ చేయకుండా తీసుకుంటే మాత్రం మీరు అగచాట్ల పాలవుతారు. మీరు తీసుకున్న ఫోన్ ఒరిజినల్ ఓనర్ కాకుండా కొట్టుకొచ్చిందయితే, మీ పరిస్థితి ఏమిటి. అందుకే, మీరు ఒక సెకండ్ హ్యాండ్ ఫోన్ తీసుకునే ముందుగా ఖచ్చితంగా చెక్ చేసి మాత్రమే తీసుకోవడం నూరుకు నూరు శాతం ఉత్తమం.
డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ (DoT) పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన ఫోన్లను ట్రాక్ చెయ్యడానికి సెంట్రల్ ఎక్విప్ మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్(CEIR) ని పోర్టల్ ని లాంచ్ చేసింది. ఈ పోర్టల్ నుండి మీరు కొనదలుచుకున్న ఫోన్ యొక్క వివరాలను చెక్ చెయ్యవచ్చు.
డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ (DoT) పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన ఫోన్లను ట్రాక్ చెయ్యడానికి సెంట్రల్ ఎక్విప్ మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్(CEIR) ని పోర్టల్ నుండి మీరు తీసుకోదలుచుకున్న ఫోన్ IMEI నంబర్ తో ఫోన్ ఒరిజినల్ అవునా లేదా కొట్టుకోచిందా అని ఇక్కడ వెరిఫికేషన్ చెయ్యొచ్చు.