Apple event 2025 date time and where to watch live
Apple event 2025: ప్రతి సంవత్సరం కొత్త ప్రొడక్ట్స్ లాంచ్ కోసం యాపిల్ నిర్వహించే అతిపెద్ద ఈవెంట్ డేట్ దగ్గరకు వచ్చింది. ప్రతి సంవత్సరం యాపిల్ నిర్వహించే ఈ అతిపెద్ద ఈవెంట్ నుంచి కొత్త ఐఫోన్లు, యాపిల్ వాచ్ లతో పాటు మరిన్ని కొత్త ప్రొడక్ట్స్ విడుదల చేయడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా కొత్త ఐఫోన్ సిరీస్ మరియు మరిన్ని ప్రొడక్ట్స్ లాంచ్ కోసం సిద్దమయ్యింది.
యాపిల్ ఈవెంట్ 2025 కార్యక్రమం రేపు మధ్యాహ్నం 1:00 PM ET (US ఈస్టర్న్ టైమ్) గంటలకు యాపిల్ పార్క్ లో జరుగుతుంది. ఇది భారత కాలమానం ప్రకారం రేపు రాత్రి 10 గంటల 30 నిమిషాలకు లైవ్ అవుతుంది. యునైటెడ్ స్టేట్స్ కాలిఫోర్నియాలోని కుపెర్టినోలో ఉన్న యాపిల్ పార్క్ లో ఈ కార్యక్రమం జరుగుతుంది. సర్వసాధారణంగా యాపిల్ ఈవెంట్ ఇక్కడే నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమాన్ని ‘Awe Dropping’ పేరుతో యాపిల్ నిర్వహిస్తోంది.
యాపిల్ ఈవెంట్ 2025 కార్యక్రమం యాపిల్ యొక్క అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ @Apple నుంచి మీరు లైవ్ ప్రసారం చూడవచ్చు మరియు ఈ కార్యక్రమం రేపు రాత్రి 10 గంటల 30 నిమిషాలకు ప్రారంభం అవుతుంది. ఇది కాకుండా యాపిల్ అఫీషియల్ వెబ్సైట్ మరియు యాపిల్ టీవీ నుంచి కూడా లైవ్ చూడవచ్చు.
యాపిల్ ఈవెంట్ 2025 నుంచి యాపిల్ ఐఫోన్ 17 సిరీస్ ఫోన్లు, యాపిల్ వాచ్ సిరీస్ 11, మరియు యాపిల్ వాచ్ అల్ట్రా 3 వంటి స్మార్ట్ వాచ్ లు లాంచ్ చేసే అవకాశం ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఇదే కాదు ఈ అతిపెద్ద యాపిల్ లాంచ్ ఈవెంట్ నుంచి ఎయిర్ పోడ్స్ ప్రో 3 కూడా విడుదల చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే, యాపిల్ అఫీషియల్ గా లాంచ్ చేసే ప్రోడక్ట్ వివరాలు కూడా బయటకు వెల్లడించలేదు.
Also Read: OPPO F31 Series 5G ఇండియా లాంచ్ అనౌన్స్ చేసిన ఒప్పో.!
యాపిల్ ఐఫోన్ 17 సిరీస్ నుంచి ఐఫోన్ 17, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మాక్స్ మరియు ఐఫోన్ 17 ఎయిర్ అనే కొత్త ఫోన్ ను ప్రకటించే అవకాశం ఉంటుందని రూమర్లు ఉన్నాయి. ప్రతి సంవత్సరం యాపిల్ అందించే ఫోన్ తో పోల్చి చూస్తే కొత్త సిరీస్ నుంచి ఈ ఫోన్లు లాంచ్ అయ్యే అవకాశం ఉండవచ్చు. అయితే, యాపిల్ అఫీషియల్ గా ఎటువంటి ప్రకటన చేయలేదని గమనించాలి.