కరోనావైరస్ ఎఫెక్ట్ : Android 11 అనౌన్స్ మెంట్ వాయిదా

కరోనావైరస్ ఎఫెక్ట్ : Android 11 అనౌన్స్ మెంట్ వాయిదా
HIGHLIGHTS

ఆన్‌లైన్ ఈవెంట్‌ను హోస్ట్ చేయనున్నట్లు గూగుల్ ప్రకటించింది.

యునైటెడ్ స్టేట్స్ లో వెల్లువెత్తిన నిరసనలు మరియు అశాంతి నేపథ్యంలో ఈ ఆన్‌లైన్ ఈవెంట్‌ను వాయిదా వేసింది.

జూన్ 3 న Google ఆండ్రాయిడ్ 11 లో రాబోయే ఫీచర్లను ప్రకటించాల్సి ఉండగా, యునైటెడ్ స్టేట్స్ లో వెల్లువెత్తిన నిరసనలు మరియు అశాంతి నేపథ్యంలో ఈ ఆన్‌లైన్ ఈవెంట్‌ను వాయిదా వేసింది.

ఆండ్రాయిడ్ 11 యొక్క బీటా వెర్షన్‌ను విడుదల చేయడానికి   ఈ కార్యక్రమం ద్వారా ప్రముఖ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్‌కి జాతకానున్న కొత్త అప్డేట్ యొక్క ఫీచర్లను తెలియజేస్తుంది. కానీ, COVID-19 మహమ్మారి కారణంగా కంపెనీ వార్షిక డెవలపర్ కాన్ఫరెన్స్ I / O రద్దు చేయబడింది.

“ఆండ్రాయిడ్ 11 గురించి మీకు మరింన్ని వివరాలను చెప్పడానికి మేము సంతోషిస్తున్నాము, కానీ ఇది ఇప్పుడు జరుపుకునే సమయం కాదు. మేము జూన్ 3న జరగనున్న ఈవెంట్ మరియు బీటా విడుదలను వాయిదా వేస్తున్నాము. మేము త్వరలో ఆండ్రాయిడ్ 11 తో  తిరిగి వస్తాము ”అని ఆండ్రాయిడ్ డెవలపర్స్ బ్లాగ్‌లోని సందేశంలో గూగుల్ తెలిపింది.

ఆండ్రాయిడ్ డెవలపర్స్ ట్విట్టర్ హ్యాండిల్ కూడా ఈ ఆవిష్కరణకు ఎటువంటి కొత్త తేదీని పేర్కొనకుండా అదే ప్రకటించింది.

గూగుల్ ఫిబ్రవరిలో ఆండ్రాయిడ్ 11 యొక్క మొదటి డెవలపర్ పరిదృశ్యాన్ని పిక్సెల్ 2, పిక్సెల్ 2 ఎక్స్ఎల్, పిక్సెల్ 3 ఎ మరియు పిక్సెల్ 4 తో సహా ఎంపిక చేసిన పిక్సెల్ ఫోన్లలో అందుబాటులోకి తెచ్చింది. తదనంతరం, గూగుల్ మూడవ డెవలపర్ ప్రివ్యూ పిక్సెల్ ఫోన్లను తాకడంతో మరో రెండు ప్రివ్యూలను ఏప్రిల్ లో విడుదల చేసింది.

మీవద్ద ఈ స్మార్ట్ ఫోన్లు ఉంటే, ప్రివ్యూను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు ఇప్పటికే Android 11 ని పొందవచ్చు. ఆయితే, ఇది ఫైనల్ వెర్షన్ కాదని మరియు బగ్స్ తో నడుస్తుందని గమనించండి. ప్రివ్యూను ఇన్‌స్టాల్ చేయడానికి ముందు మీ డేటాను బ్యాకప్ చేయాలని సిఫార్సు చేస్తారు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo