PUBG వ్యామోహంలో హైదరాబాద్ కి చెందిన 10వ తరగతి విద్యార్థి బలవన్మరణం

Updated on 03-Apr-2019
HIGHLIGHTS

PUBG నానాటికి అపఖ్యాతిని మూటగట్టుకుంటోంది.

ఈ ఆటలో చాల విషయాలు ప్రజల్ని దానికి కట్టిపడేసేలా చేసింది.

ఈ గేమ్ ఆడే సమయంలో ఏమి చేస్తున్నారో తెలియని పరిస్థితుల్లోకి వెళ్లిపోతున్నారు.

పరీక్షల సమయంలో ఆడవద్దని, చదువుకొమ్మని చెప్పినందుకు మనస్థాపంతోనే ఈ అఘాయిత్యానికి ఒడిగట్టినట్లు నిర్ధారణ.

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక స్థాయిలో యాక్టివ్ యూజర్లను కలిగినవున్నా PUBG నానాటికి అపఖ్యాతిని మూటగట్టుకుంటోంది. ఈ గేమ్, అత్యధికమైన గ్రాఫిక్స్ మరియు ఫీచర్ల కారణంగా చాల కొద్దీ కాలంలోనే, అత్యంత ప్రాచుర్యాన్ని సంపాదించింది. ఈ ఆటలో చాల విషయాలు ప్రజల్ని దానికి కట్టిపడేసేలా చేసింది. ఇందులో చాల మంది కూడా కేవలం గన్స్ తో షూట్ చెయ్యడం మరియు వారి ప్రావీణ్యాన్ని మిగిలివారికి గొప్పగా చూడం కోసం ఆడుతున్నట్లు చెబుతుంటారు.

అయితే, ఈ గేమ్ ఏదో సరదాకోసం లేదా కాలక్షేపం కోసం ఆడుతున్నట్లైతే ఎటువంటి ఇబ్బంది లేదు, కొంత మంది కేవలం ఈ ఆటను ఆడటం మాత్రంమే పనిగా పెట్టుకుని ఆడుతున్నవారు పూర్తిగా ఈ గేమ్ కి బానిసలవుతున్నారు. ఎంతగా దీని మత్తులో మునిగి పోతున్నారంటే, ఈ గేమ్ ఆడే సమయంలో ఏమి చేస్తున్నారో తెలియని పరిస్థితుల్లోకి వెళ్లిపోతున్నారు. ఈ మధ్యకాలంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకున్న ఒక ఘటన ఇందుకు నిదర్శనంగా చెప్పొచ్చు. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక వ్యక్తి పబ్జి గేమ్ ఆడుతూ మంచినీళ్ళనుకుని యాసిడ్ తాగి ప్రాణాల మీదికి తెచ్చుకున్నారు.

ఇటువంటి ఎన్నో ఘటనలు ఈ ఆట తో ముడిపడ్డాయి, ఇప్పుడు కొత్తగా మరొక విషాద ఘటన కూడా వీటికి తోడయ్యింది. ఈ సోమవారం హైదరాబాద్ నగరంలోని మల్కాజ్ గిరికి చెందిన 10వ తరగతి విద్యార్థి, తన తల్లి తండ్రులు పరీక్షల సమయంలో చదువుకోకుండా పబ్జి గేమ్ ఆడుతున్నందుకు, గేమ్ ఆడకుండా చదువుకొమ్మని మందలించినందుకు బలవన్మరణానికి పాల్పడ్డాడు. మంగళవారం పరీక్ష ఉండగా, దాని కోసం చదువుకోకుండా పబ్జి గేమ్ ఆడుతున్నావెందుకు, ఆటవదిలేసి చదువుకోవాల్సిందిగా, తల్లి తండ్రులు చెప్పడంతో మనస్థాపానికి గురిచేంది, తన బెడ్ రూమ్ లో ఉరివేసుకుని బలవన్మరణాకి పాల్పడ్డాడు.

కేవలం ఈ ఒక్కఘటనే కాదు మరెన్నో ఇటువంటి సంఘటనలు ఈ గేమ్ తో నమోదవుతున్నాయి. అయితే, ఒక్క విషయం మాత్రం అందరూ గుర్తుంచుకోవాలి. అదేమిటంటే, ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది, అన్నం తినడానికి, చదువుకోవడానికి, పనిచేయడాని, ఇంకా అన్నిటికి ఒక సమయాన్ని కేటాయించడం అనేది ఒక మంచి విషయం, అలా గనుక ప్రతి పనికి ఒక టైం సెట్ చేసుకుంటే, ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని పనులు చేసుకోవచ్చు. టెక్నాలజీ గురించి మనం తెలుసుకోవాలి, వాడుకోవాలి అలాగే ప్రతి విషయాన్ని ఎంజాయ్ చేయాలి. అంతేగాని దానికి పూర్తిగా లొంగిపోకూడదు.  

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :