Amazon Prime Day Sale big deal revealed ahead of sale
Amazon Prime Day Sale మొదలవడానికి ఇంకా మూడు రోజులు ఉండగానే బిగ్ డీల్ రివీల్ చేసింది. అమెజాన్ తన ప్రైమ్ మెంబర్స్ కోసం ప్రత్యేకంగా అందించే అతిపెద్ద సేల్ ‘ప్రైమ్ డే’ సేల్ జూలై 20 మరియు జూలై 21 తేదీల్లో నిర్వహిస్తుంది. ఈ సేల్ నుండి భారీ ఆఫర్లు, డీల్స్ మరియు ఇతర ప్రయోజనాలను అందిస్తుందని అమెజాన్ తెలిపింది. ఈ సేల్ నుండి అందించనున్న గొప్ప డీల్స్ ను ఒక్కొక్కటిగా ఇప్పుడు రివీల్ చేయడం మొదలు పెట్టింది.
అమెజాన్ ప్రైమ్ డే సేల్ కోసం విడుదల చేసిన కొత్త మైక్రో సైట్ బ్యానర్ టీజర్ ద్వారా ఈ ఆఫర్ విషయాన్ని అమెజాన్ వెల్లడించింది. దీని ప్రకారం, వన్ ప్లస్ 12R స్మార్ట్ ఫోన్ తో రూ. 5,499 రూపాయల విలువైన వన్ ప్లస్ బడ్స్ 3 ఇయర్ బడ్స్ ను ఉచితంగా ఇవ్వనున్నట్టు చెబుతోంది. అయితే, ఈ ఆఫర్ వన్ ప్లస్ బడ్స్ 3 స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే అని కండిషన్ పెట్టింది.
అంతేకాదు, వన్ ప్లస్ 12R స్మార్ట్ ఫోన్ పైన గొప్ప బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను కూడా జత చేస్తుంది. ఎందుకంటే, అమెజాన్ ప్రైమ్ డే సేల్ ను ICICI మరియు SBI బ్యాంక్ భాగస్వామ్యంతో నిర్వహిస్తోంది. కాబట్టి, ఈ సేల్ నుంచి ప్రొడక్ట్స్ ను ఈ రెండు బ్యాంక్ కార్డ్స్ తో కొనే ప్రైమ్ కస్టమర్లు 10% అదనపు డిస్కౌంట్ ను అందుకుంటారు. ఈ ఆఫర్ ఈ వన్ ప్లస్ 12R ఫోన్ పై కూడా వర్తిస్తుంది.
అలాగే, వన్ ప్లస్ 12R ఫోన్ పైన 9 నెలల No Cost EMI ఆఫర్ ను కూడా జత చేసింది. మరొక కండిషన్ కూడా ఈ ఫోన్ పైన వుంది. అదేమిటంటే, వన్ ప్లస్ 12R యొక్క 8GB + 256GB వేరియంట్ పైన మాత్రమే ఈ ఉచిత వన్ ప్లస్ బడ్స్ 3 ఇయర్ బడ్స్ ఆఫర్ వర్తిస్తుంది.
Also Read: Samsung Galaxy M35 5G: శాంసంగ్ కొత్త ఫోన్ గ్రాండ్ ఎంట్రీ..ధర ఎంతంటే.!
వన్ ప్లస్ 12R 5జి స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం అమెజాన్ నుంచి రూ. 42,998 ధరతో లిస్ట్ అయ్యింది. అయితే, ప్రైమ్ డే సేల్ నాటికి ఎటువంటి ధరతో లిస్ట్ అవుతుందో తెలియాల్సి ఉంది. ఈ వన్ ప్లస్ ఫోన్ Snapdragon 8 Gen 2 చిప్ సెట్, 5500mAh బిగ్ బ్యాటరీ, 1.5K LTPO Pro XDR డిస్ప్లే, 50MP Sony IMX890 మెయిన్ సెన్సార్ కలిగిన గొప్ప ట్రిపుల్ కెమెరా మరియు 100W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ వంటి గొప్ప ఫీచర్స్ కలిగి ఉంటుంది.