Mega Tablet Premier League సేల్ నుంచి Apple iPad పై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అందుకోండి.!

Updated on 21-May-2025
HIGHLIGHTS

Amazon ఈరోజు నుంచి Mega Tablet Premier League సేల్ ను ప్రారంభించింది

ఈ సేల్ నుంచి ఈరోజు బెస్ట్ టాబ్లెట్ డీల్స్ అందించింది

ఈరోజు బెస్ట్ Apple iPad (2025) డీల్ కూడా ఈ సేల్ నుంచి అందుబాటులో ఉంది

Amazon ఈరోజు నుంచి Mega Tablet Premier League సేల్ ను ప్రారంభించింది. ఈ సేల్ నుంచి ఈరోజు బెస్ట్ టాబ్లెట్ డీల్స్ అందించింది. యాపిల్ యొక్క లేటెస్ట్ టాబ్లెట్ డీల్స్ కోసం చూసే వారికి ఈరోజు బెస్ట్ Apple iPad (2025) డీల్ కూడా ఈ సేల్ నుంచి అందుబాటులో ఉంది. ఈ సేల్ నుంచి ఈ ఐప్యాడ్ ను 32 వేల రూపాయల అతి తక్కువ ధరలో అందుకునే అవకాశం అమెజాన్ ఇండియా అందించింది.

Mega Tablet Premier League : ఆఫర్

అమెజాన్ టాబ్లెట్ ప్రీమియర్ లీగ్ సేల్ నుంచి ఈరోజు యాపిల్ ఐప్యాడ్ (2025) పై గొప్ప డీల్స్ అందించింది. ఈ ఐప్యాడ్ యొక్క 128GB (Wi-Fi) వేరియంట్ యాపిల్ స్టోర్ నుంచి రూ. 34,900 రూపాయల ధరతో సేల్ అవుతుండగా, అమెజాన్ ఈ ఐప్యాడ్ ను ఈరోజు సేల్ నుంచి రూ. 2,000 రూపాయల భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 32,990 రూపాయల ఆఫర్ ధరకే సేల్ చేస్తోంది.

కేవలం డిస్కౌంట్ మాత్రమే కాదు ఈ ఐప్యాడ్ పై గొప్ప బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ యాపిల్ ఐప్యాడ్ ను ఈరోజు అమెజాన్ సేల్ నుంచి ICICI, Axis మరియు HDFC బ్యాంక్ కార్డ్స్ తో కొనుగోలు చేసే వారికి రూ. 2,000 అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ అఫర్ తో ఈ ఐప్యాడ్ ను రూ. 32,900 రూపాయల డిస్కౌంట్ ధరకు అందుకోవచ్చు. Buy From Here

Also Read: Google I/O 2025: గూగుల్ మీట్ లో అద్భుతమైన ఫీచర్ జత చేసిన గూగుల్.!

Apple iPad (2025) : ఫీచర్స్

యాపిల్ ఐప్యాడ్ 11 ఇంచ్ లిక్విడ్ రెటినా స్క్రీన్ కలిగి ఉంటుంది మరియు ఇది (2360 x 1640) రిజల్యూషన్ కలిగి ఉంటుంది. ఈ ఐప్యాడ్ A16 Bionic చిప్ తో పనిచేస్తుంది మరియు iPadOS పై నడుస్తుంది. ఈ యాపిల్ ఐప్యాడ్ Wi-Fi 6 తో ఫాస్ట్ వైఫై అందిస్తుంది మరియు అంతరాయం లేని కనెక్టివిటీ కలిగి ఉంటుంది.

ఈ ఐప్యాడ్ మ్యూజిక్ కీబోర్డ్ ఫోలియో మరియు యాపిల్ పెన్సిల్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. అయితే, ఈ రెండు సపరేట్ గా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ ఐప్యాడ్ 4K వీడియో సపోర్ట్ కలిగిన 12MP రియర్ కెమెరా మరియు ముందు 12MP ల్యాండ్ స్కేప్ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఐప్యాడ్ బ్లూ, పింక్, ఎల్లో మరియు సిల్వర్ నాలుగు రంగుల్లో లభిస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :