Amazon Great Summer sale ఈరోజు అర్ధరాత్రి నుంచి ప్రైమ్ సభ్యులకు స్టార్ట్ అవుతుంది.!

Updated on 30-Apr-2025
HIGHLIGHTS

సమ్మర్ 2025 కోసం అమెజాన్ ప్రకటించిన అతి పెద్ద సేల్

ఈరోజు అర్ధరాత్రి నుంచి ప్రైమ్ సభ్యులకు ప్రారంభం అవుతుంది

Amazon Great Summer sale నుంచి భారీ డీల్స్ ప్రకటించింది

Amazon Great Summer sale అర్లీ యాక్సెస్ ఈరోజు అర్ధరాత్రి నుంచి ప్రైమ్ సభ్యులకు ప్రారంభం అవుతుంది. సమ్మర్ 2025 కోసం అమెజాన్ ప్రకటించిన అతి పెద్ద సేల్ కోసం ఈరోజు అర్ధరాత్రి 12 గంటల నుంచి ప్రారంభం అవుతుంది. రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ సేల్ అందరికీ అందుబాటులోకి వస్తుంది. ఈ సేల్ నుంచి భారీ డీల్స్ మరియు ఆఫర్లు అమెజాన్ తీసుకొస్తున్నట్లు ప్రకటించింది.

Amazon Great Summer sale

అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ కోసం ఎదురు చూస్తున్న ప్రైమ్ సభ్యులకు గుడ్ న్యూస్. అమెజాన్ సమ్మర్ సేల్ యాక్సెస్ 12 గంటలు ముందుగానే ప్రైమ్ సభ్యులకు అందుతుంది. ఈ రోజు అర్ధరాత్రి 12 గంటల నుంచి ఈ సేల్ ప్రైమ్ సభ్యులకు మొదలవుతుంది. ఈ సేల్ నుంచి భారీ డిస్కౌంట్ ఆఫర్లు మరియు గొప్ప బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందుకోవచ్చని అమెజాన్ తెలిపింది.

ఈ అమెజాన్ సేల్ నుంచి బెస్ట్ డీల్స్ అందుకోవచ్చా?

ఈ అమెజాన్ సేల్ నుంచి బెస్ట్ డీల్స్ అందుకోవచ్చా? అని అడిగితే, అందుకోవచ్చని అమెజాన్ గొప్పగా చెబుతోంది. ఇప్పటికే ఈ సాల్ నుంచి అందించనున్న డీల్స్ గురించి వివరాలు అందించింది. ఈ సేల్ నుంచి మొబైల్స్ మరియు యాక్ససరీస్ పై గరిష్టంగా 40% వరకు డిస్కౌంట్, ల్యాప్ టాప్స్, స్మార్ట్ వాచ్ మరియు హెడ్ ఫోన్స్ పై గరిష్టంగా 75% వరకు డిస్కౌంట్ అందుకునే అవకాశం ఉందని అమెజాన్ చెబుతోంది.

అంతేకాదు, అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ AC లు, రిఫ్రిజిరేటర్లు మరియు వాషింగ్ మెషిన్ వంటి హోమ్ అప్లయెన్సెస్ పై గరిష్టంగా 65% వరకు డిస్కౌంట్ అందుకునే అవకాశం ఉందట. ఇక స్మార్ట్ టీవీ డీల్స్ విషయానికి వస్తే, అమెజాన్ ఈ డీల్స్ గురించి ప్రత్యేకంగా టీజింగ్ చేస్తోంది. ఈ సేల్ నుంచి స్మార్ట్ టీవీలు ఎన్నడూ చూడనంత తక్కువ ధరకే ఆఫర్ చేసే అవకాశం ఉందని కోడోత్ అమెజాన్ టీజింగ్ చేస్తోంది.

Also Read: రూ. 4,999 ధరకే 160W పవర్ ఫుల్ Soundbar అందుకోండి.!

ఇది కాకుండా, ఈ అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ నుంచి అమెజాన్ బ్రాండ్ సొంత ప్రొడక్ట్స్ అయిన Alexa స్మార్ట్ స్పీకర్లు, Eco Show సిరీస్ స్పీకర్లు మరియు Fire tv Stick పైన కూడా గొప్ప ఆఫర్లు అందుకోవచ్చు. మొత్తానికి ఈ సేల్ నుంచి చాలా ప్రొడక్ట్స్ పై గొప్ప డీల్స్ అందుకోవచ్చని టీజింగ్ చేస్తోంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :