Amazon Great Indian Festival Sale date and offers announced
Amazon Great Indian Festival Sale కోసం ఎదురు చూస్తున్న వారికి ఈరోజు గుడ్ న్యూస్ అనౌన్స్ చేసింది. ఈరోజు అమెజాన్ ఈ అప్ కమింగ్ బిగ్ సేల్ డేట్ తో పాటు ఈ సేల్ నుంచి అందించనున్న ఆఫర్స్ సైతం వెల్లడించింది. దసరా మరియు దీపావళి కోసం అమెజాన్ తీసుకొస్తున్న ఈ అప్ బిగ్ సేల్ గురించి మీరు తెలుసుకోవాల్సిన అన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సెప్టెంబర్ 23వ తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే, అమెజాన్ ప్రైమ్ మెంబర్స్ కి 24 గంటల ముందే ఈ సేల్ యాక్సెస్ లభిస్తుంది. అంటే, ప్రైమ్ మెంబర్స్ కి సెప్టెంబర్ 22వ తేదీ నుండే ఈ సేల్ ప్రారంభం అవుతుంది. SBI బ్యాంక్ అమెజాన్ సేల్ కోసం ప్రత్యేకమైన సేల్ పార్ట్నర్ గా ఉంటుంది. అందుకే, ఈ సేల్ నుంచి వస్తువులను SBI కార్డ్స్ తో కొనుగోలు చేసే వారికి 10% అదనపు డిస్కౌంట్ లభిస్తుంది.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2025 నుంచి గొప్ప డీల్స్ ఆఫర్ చేయనున్నట్లు అమెజాన్ తెలిపింది. ఈ అప్ కమింగ్ సేల్ నుంచి స్మార్ట్ ఫోన్స్ పై 405 వరకు డిస్కౌంట్, కిచెన్ అండ్ అవుట్ డోర్స్ పై 80% వరకు డిస్కౌంట్ మరియు ఎలక్ట్రానిక్స్ అండ్ యాక్ససరీస్ పై గరిష్టంగా 80% వరకు డిస్కౌంట్ ఆఫర్ చేయబోతున్నట్లు అమెజాన్ చెబుతోంది. ఇదే కాదు స్మార్ట్ టీవీలు మరియు ప్రొజెక్టర్ పై ఏకంగా 65% భారీ డిస్కౌంట్ అందుకునే అవకాశం ఉందని అమెజాన్ టీజింగ్ చేస్తోంది.
Also Read: Flipkart The Big Billion Days సేల్ డేట్ అనౌన్స్ చేసింది: Smart Tv లపై భారీ డిస్కౌంట్ కన్ఫర్మ్.!
స్మార్ట్ ఫోన్ ఆఫర్స్ కోసం అమెజాన్ ఇండియా ఇప్పటి నుండే భారీగా టీజింగ్ చేస్తోంది. ఈ సేల్ నుంచి అందించనున్న డీల్స్ తో ప్రత్యేకమైన పేజీ కూడా అందించింది. ఇందులో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ డీల్స్ అందించింది. ఇందులో నుంచి శామ్సంగ్ గెలాక్సీ S24 అల్ట్రా, గెలాక్సీ Z ఫోల్డ్, వన్ ప్లస్ 13s మరియు ఐకూ 13 వంటి ప్రీమియం స్మార్ట్ ఫోన్స్ పై బెస్ట్ డీల్స్ అందుకోవచ్చని అమెజాన్ టీజింగ్ చేస్తోంది.