Amazon Great Freedom Festival Sale డేట్ అనౌన్స్ చేసిన అమెజాన్.!
Amazon Great Freedom Festival Sale డేట్ ను ఈరోజు అనౌన్స్ చేసింది
12 గంటల ముందే ప్రైమ్ మెంబర్స్ కి ఈ సేల్ యాక్సెస్ అందుతుంది
ఈ సేల్ నుంచి అనేకమైన ప్రొడక్ట్స్ పైన గొప్ప డిస్కౌంట్ మరియు ఆఫర్లు పొందవచ్చు
Amazon Great Freedom Festival Sale డేట్ ను ఈరోజు అనౌన్స్ చేసింది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అమెజాన్ తీసుకు వస్తున్న ఈ సేల్ నుంచి అనేకమైన ప్రొడక్ట్స్ పైన గొప్ప డిస్కౌంట్ మరియు ఆఫర్లు పొందవచ్చు. ఈ అప్ కమింగ్ సేల్ ఆగస్టు 6వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం అవుతుంది. ఎప్పటి మాదిరిగానే 12 గంటల ముందు, అంటే 6వ తేదీ అర్ధరాత్రి 12 గంటల నుంచి ప్రైమ్ మెంబర్స్ కి ఈ సేల్ యాక్సెస్ అందుతుంది.
SurveyAmazon Great Freedom Festival Sale
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ ఆగస్టు 6 వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది అని అమెజాన్ ప్రకటించింది. అయితే, ఈ సేల్ ఎన్ని రోజులు కొనసాగుతుంది మరియు సేల్ ఆఖరి తేదీ ఏమిటి అనే విషయాన్ని మాత్రం ఇంకా వెల్లడించలేదు. ఈ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ ను SBI కార్డ్స్ భాగస్వామ్యంతో తీసుకువస్తోంది. అందుకే, ఈ సేల్ నుంచి SBI కార్డ్స్ తో వస్తువులు కొనుగోలు చేసే కస్టమర్లకు 10% అదనపు డిస్కౌంట్ ను అందిస్తుంది.

ఈ అప్ కమింగ్ సేల్ నుంచి అమెజాన్ అందించనున్న ఆఫర్ల వివరాలు కూడా అమెజాన్ ముందే ప్రకటించింది. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ నుంచి స్మార్ట్ ఫోన్స్ మరియు మొబైల్ ఫోన్ల పైన గరిష్టంగా 40% డిస్కౌంట్ పొందవచ్చని అమెజాన్ చెబుతోంది. అంతేకాదు, మార్కెట్ లో విడుదలైన లేటెస్ట్ 5జి స్మార్ట్ లను సైతం మంచి డిస్కౌంట్ తో పొందవచ్చని అమెజాన్ చెబుతోంది.
Also Read: Honor Magic 6 Pro: ఈరోజు భారత్ లో విడుదలైన హానర్ పవర్ ఫుల్ ఫోన్.!
ముఖ్యంగా, ఈ సేల్ నుంచి అమెజాన్ బ్రాండ్ ప్రొడక్ట్స్ ను మంచి డిస్కౌంట్ తో చాలా చవక ధరకే పొందే అవకాశం ఉందని తెలిపింది. అలాగే, ఎలక్ట్రానిక్స్ మరియు యాక్ససరీస్ పైన గరిష్టంగా 80% డిస్కౌంట్, ల్యాప్ టాప్స్, హెడ్ ఫోన్స్ మరియు TWS ఇయర్ బడ్స్ పైన కూడా భారీ డిస్కౌంట్లు పొందవచ్చని టీజింగ్ చేస్తోంది.
అమెజాన్ ఇప్పటికే విష్ లిస్ట్ పేజీలు కూడా ఓపెన్ చేసింది. ఈ ప్రత్యేకమైన విష్ లిస్ట్ పేజీ నుంచి కొత్త సేల్ ఆఫర్ లతో ప్రోడక్ట్ లను లిస్ట్ చేసింది. ఇక్కడ అందించిన ఆఫర్లలో వారికి తగిన ప్రోడక్ట్ ను కస్టమర్లు ఇప్పటి నుంచే ట్రాక్ చేసే అవకాశం కూడా అందించింది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile