హువావై , Airtel భారత్ లో 5G టెస్ట్ విజయవంతం ….

Updated on 27-Feb-2018

శుక్రవారం చైనా టెక్నాలజీ దిగ్గజం హువాయ్, టెలికాం సర్వీసు ప్రొవైడర్ భారతి ఎయిర్టెల్ విజయవంతంగా భారతదేశంలో 5 జి నెట్వర్క్ ను పరీక్షించింది. ఎయిర్టెల్ మనేసర్ (గురుగ్రామ్ ) వద్ద ఉన్న నెట్వర్క్ ఎక్స్పీరియన్స్ సెంటర్లో ఈ పరీక్ష జరిగింది అని ఒక ప్రకటనలో తెలిపింది.

భారతీయ ఎయిర్టెల్ డైరెక్టర్ (నెట్వర్క్స్) అభయ్  సావర్గోంకర్ మాట్లాడుతూ, '5 జి ఇంటరాప్రిబిలిటీ అండ్ డెవలప్మెంట్ టెస్ట్ (ఐఓడిటి), పార్టనర్షిప్స్ పై  మేము వేగంగా అభివృద్ధి చెందుతున్నాము.మేము భారత్ లో  బలమైన 5 జి జీవావరణవ్యవస్థను అభివృద్ధి చేయడానికి మా భాగస్వాములతో కలిసి పనిచేస్తున్నాం. అని తెలిపారు .

ఈ పరీక్ష సమయంలో, 3 Gbps కన్నా ఎక్కువ స్పీడ్  నమోదు చేయబడిందని కంపెనీ తెలిపింది. ఇది 3.5 GHz బ్యాండ్ పై  100 MHz బ్యాండ్విడ్త్ తో  సాధించిన గరిష్ట స్పీడ్ , దీని ఎండ్-టు-ఎండ్ నెట్వర్క్ జాప్యం ఒక మిల్లీసెకనుకు దగ్గరగా ఉంటుంది.

 

 

 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :