యూజర్ డేటా కలెక్ట్ చేస్తావా? అనే ప్రశ్నకు AI దిమ్మతిరిగే సమాధానం.!

HIGHLIGHTS

ప్రపచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వాడకం నానాటికీ పెరిగిపోతోంది

యూజర్ ఎక్కువగా ఆలోచించే విషయం తమ డేటా సురక్షితంగా ఉంటుందా లేదా అని

ఎఐ ని అడిగిన ప్రశ్నకి దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది

యూజర్ డేటా కలెక్ట్ చేస్తావా? అనే ప్రశ్నకు AI దిమ్మతిరిగే సమాధానం.!

ప్రపచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వాడకం నానాటికీ పెరిగిపోతోంది. కళ్ళు మూసి తెరిచే లోపే క్లిష్టమైన సమస్యలకు సైతం సమాధానాలు అందించడం ఎటువంటి శ్రమ లేకుండా అత్యంత గొప్ప రిజర్వేషన్ కలిగిన ఇమేజ్ మరియు వీడియోలను సైతం అందించడం వలన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి ఎక్కువగా ఆదరణ దొరికింది. వాస్తవానికి, మనం ఇప్పుడు మాట్లాడుతుంది సామాన్య మానవుడు ఎక్కువగా ఎఐ యాప్స్ లో సెర్చ్ చేసే మరియు వినియోగించే విషయాల గురించి మాత్రమే చర్చించాం. అయితే వాస్తవానికి మన ఆలోచనలకు అందని శక్తిని కలిగి ఉండటమే కాకుండా, ఊహకు అందని పనులు సైతం చేయగలదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేతిలో యూజర్ డేటా ఎంతవరకు సురక్షితం గా ఉంటుందో తెలుసుకోవడానికి ఎఐ ని అడిగిన ప్రశ్నకి దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఏమిటా AI ప్రశ్న?

సాధారణంగా ఏఐ యాప్ ఉపయోగించేటప్పుడు యూజర్ ఎక్కువగా ఆలోచించే విషయం తమ డేటా సురక్షితంగా ఉంటుందా లేదా అని. ఇదే ప్రశ్న ఏఐ ఆప్స్ ని అడిగినప్పుడు అవి చెప్పే సమాధానం ఆలోచింపచేసేలా ఉన్నాయి.

ప్రశ్న : AI యూజర్ డేటా కలెక్ట్ చేస్తావా?

ఈ ప్రశ్నకు ఎఐ యాప్స్ లేదా వెబ్సైట్ తడుముకోకుండా ‘అవును’ అనే సమాధానం ఇచ్చాయి. కానీ, దీనికి తగిన కారణాలు ఉపయోగాలు గురించి కూడా పూసగుచ్చినట్లు చెప్పాయి. అవి ఎన్ని చెబుతున్నాయంటే, అవును మేము యూజర్ డేటాని సేకరిస్తాము. కానీ, మేము మా ఎఐ మోడల్ ను మరింత అధివృధి చేసి యూజర్ కు అనుకూలమైన పనితనం కోసం మరియు మరింత గొప్ప పెర్ఫార్మెన్స్ కోసం మాత్రమే యూజర్ డేటాని సేకరిస్తాము అని తెలిపాయి.

AI APPs

మరి యూజర్ డేట్ సెక్యూరిటీ మాటేమిటి?

ఈ విషయం గురించి అన్ని ఎఐ యాప్స్ కూడా ముక్త కంఠంతో యూజర్ డేటా మరియు ప్రైవసీ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉంటాయని చెబుతున్నాయి.

Also Read: Aadhaar Big News: పిల్లల ఆధార్ కార్డు లో ఈ అప్డేట్ చేయకపోతే డీయాక్టివేట్ చేస్తానంటున్న UIDAI

మాన్యువల్ గా డేటా ప్రైవసీ చేసుకోవచ్చా?

అవును, మీరు మాన్యువల్ గా కూడా మీ డేటా ప్రైవసీ ని సెట్ చేసుకోవచ్చు. దీనికోసం మీరు మీ ఎఐ సైట్ లేదా యాప్ లోకి వెళ్ళి మీ పేరు లేదా మూడు చుక్కల మెనూ ఎంచుకోండి. తర్వాత సెట్టింగ్స్ లోకి వెళ్ళి లోపల ఉండే ‘డేటా కంట్రోల్స్’ ఎంచుకోండి. ఇక్కడ చాట్ హిస్టరీ, ఆడియో రికార్డింగ్, వీడియో రికార్డింగ్ లేదా డేట్ సేవ్ వంటి వాటిని ‘డిసేబుల్’ చేయడం ద్వారా మీ ప్రైవసీ మాన్యువల్ గా కంట్రోల్ చేసుకోవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo