Human Washing Machine: మనిషిని శుభ్రం చేసే వాషింగ్ మిషన్ ను ఆవిష్కరించిన జపాన్ కంపెనీ.!

Updated on 11-Dec-2024
HIGHLIGHTS

జపాన్ ఇప్పుడు ఈ కొత్త ఆవిష్కరణ అందించింది

Human Washing Machine ని జపాన్ కంపెనీ ఆవిష్కరించింది

మీ మెషిన్ AI సహాయంతో పని చేస్తుంది

Human Washing Machine: సాధారణంగా బట్టలు శుభ్రం చేయడానికి వాషింగ్ మిషన్ ను ఉపయోగిస్తుంటాము. అయితే, ఇప్పుడు వినూత్నంగా మనిషిని శుభ్రం చేయడానికి కూడా వాషింగ్ మిషన్ ను అందుబాటులోకి తీసుకు వచ్చారు. కొత్త ఆవిష్కరణలకు నెలవైన జపాన్ ఇప్పుడు ఈ కొత్త ఆవిష్కరణ అందించింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో పని చేసే హ్యూమన్ వాషింగ్ మిషన్ ను జపాన్ కంపెనీ ఆవిష్కరించింది.

Human Washing Machine:

బట్టలు శుభ్రం చేసే వాషింగ్ మెషిన్ చూశాము, కానీ ఈ మనిషిని శుభ్రం చేసే వాషింగ్ మెషిన్ ఏంటి అనుకుంటున్నారా? అవునండి మీరు వింటున్నది నిజమే. జపాన్ బెస్ట్ షవర్ హెడ్ తయారీ కంపెనీ Science Co. ఈ కొత్త ఆవిష్కారానికి నాంది పలికింది. ఈ హ్యుమన్ వాషింగ్ మెషిన్ AI తో పని చేస్తుంది. ఇది మనిషిని శుభ్రం చేయడానికి ముందు AI సహాయంతో అంచనా వేసి స్నానం చేయించి డ్రై కూడా చేస్తుంది.

ఈ కొత్త ఆవిష్కరణ న్యూస్ ను ముందుగా ది ఎకనామిక్ టైమ్స్ (ET) అందించింది. ఇది వాషింగ్ మెషిన్ మాదిరిగా మనిషిని శుభ్రం చేసే పొడిగా చేస్తుందని కూడా చెబుతున్నారు. ఈవాషింగ్ మెషిన్ చూడటానికి ఫైటర్ జెట్ ఫ్లైట్ కాక్పిట్ లేదా క్యాప్సూల్ మాదిరిగా కనిపిస్తుంది.

ఈ కొత్త ఫ్యూచరిస్టిక్ AI పవర్డ్ హ్యూమర్ వాషింగ్ మెషిన్ ను 2024 జపాన్ లో జరగనున్న Osaka Kansai Expo 2025 (Expo 2025, Japan) లో ప్రదర్శించనున్నట్లు కూడా చెబుతున్నారు. అంతేకాదు, ఈ Expo 2025 లో ఈ హ్యూమన్ వాషింగ్ మెషిన్ ను 1,000 మంది గెస్ట్ లు ట్రై చేయడానికి కూడా అనుమతిస్తారని కూడా చెబుతున్నారు.

Also Read: BSNL Unlimited Plan: రూ. 900 కంటే తక్కువ ఖర్చుతో 6 నెలలు లాభాలు అందుకొండి.!

ఈ కొత్త ఆవిష్కరణతో చాలా ఉపయోగాలు వుంటాయని నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా హాస్పిటాలిటీ లో ఈ ఆవిష్కరణ బాగా ఉపయోగపడుతుందని కొందరు వారి అభిప్రాయాలను పంచుకుంటున్నారు. అయితే, ఈ కొత్త ఆవిష్కరణ గురించి కంపెనీ పూర్తి వివరాలు అందించిన తర్వాత మనము ఒక నిర్ణయానికి రావచ్చని నిపుణులు చెబుతున్నారు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :