కరోనా ఎఫెక్ట్ : లైవ్ వర్చ్యువల్ క్లాసులు ప్రారంభించిన Admission24

HIGHLIGHTS

స్కూల్ టీచర్స్ మరియు విద్యార్థులకు క్లాస్ రూమ్ గా ఉపయీగడుతుంది.

కరోనా ఎఫెక్ట్ : లైవ్ వర్చ్యువల్ క్లాసులు ప్రారంభించిన Admission24

నాణ్యమైన విద్యని అందరికి అందించడానికి కట్టుబడి ఉన్న ఎడ్యుకేషన్ స్టార్టప్ సంస్థ అడ్మిషన్ 24. విద్యార్ధులు మరియు విద్యావంతుల కోసం తన Live Virtual Classes ను ఈ రోజు ప్రకటించింది. Covid -19 మహమ్మారి కారణంగా, అన్ని విద్యాసంస్థలు ప్రస్తుతం  మూసివేయబడ్డాయి, అని మనకు తెలుసు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఈ సంస్థ, మరుసటి రోజు క్లాసుల గురించి విద్యార్థులు మరియు ఉపాధ్యాయులకు తెలియపరిచేలా వారి క్లాస్ టైమ్ టేబుల్ ని  పొందుతారు మరియు తరగతి ప్రారంభానికి 10 నిమిషాల ముందు నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఈ క్లాస్ ముగిసైనా తరువాత, విద్యార్థులు వారి ప్రశ్నలను వాయిస్ మెసేజ్, అటాచ్మెంట్ లేదా టెక్స్ట్ ద్వారా కూడా అడగవచ్చు. భారతదేశంలో ఇంటర్నెట్ యొక్క ప్రాబల్యం దృష్ట్యా, బ్రాండ్ ఇంటర్నెట్ ఉపాధ్యాయులకు తక్కువ ఇంటర్నెట్ బ్యాండ్‌విడ్త్ కారణంగా ఏ విద్యార్థి కూడా క్లాస్ మిస్ కాకుండా ఉండటానికి, 48 గంటలు వరకూ క్లాస్ రికార్డ్ ఈ యాప్ లో ఉండేలా అవకాశాన్ని కల్పించింది.

అడ్మిషన్ 24 యొక్క లైవ్ వర్చువల్ క్లాస్‌తో, ఉపాధ్యాయులు ప్రతి సెషన్‌ లో 1000 మంది విద్యార్థుల వరకు అపరిమిత లైవ్ మరియు ఇంటరాక్టివ్ ఆన్‌లైన్ తరగతులను అమలు చేయగలరు. ప్రత్యక్ష మరియు రికార్డ్ చేసిన తరగతుల ద్వారా సురక్షితమైన వినియోగం మరియు తరగతి గది లాంటి అనుభవాన్ని అందించడం సంస్థ యొక్క ప్రధాన లక్ష్యంగా చెబుతోంది.

అడ్మిషన్ 24 ఈ ప్రకటనపై వ్యాఖ్యానిస్తూ, సంస్థ యొక్క CEO మరియు వ్యవస్థాపకుడు శ్రీ అభినవ్ శేఖరి "కరోనా వైరస్ అంటువ్యాధి కారణంగా పాఠశాలలు మూసివేయడం విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు సవాలుగా మారింది. కొన్ని పాఠశాలలు ఆన్‌లైన్ విద్యను అందిస్తుండగా, కొన్ని దీనివల్ల అయ్యే ఖర్చుల వల్ల చేయలేకపోతున్నారు.

"మా లైవ్ వర్చువల్ క్లాస్‌రూమ్ పరిష్కారంతో, మేము K-12 నుండి ఉన్నత ద్వితీయ స్థాయి వరకు గొప్ప ఇంటరాక్టివ్ తరగతి గది వాతావరణాన్ని అందిస్తాము, అది విద్యార్థులు మరియు ఉపాధ్యాయులకు మంచి అభ్యాస స్థలాన్ని ఇస్తుంది."

లైవ్ సెషన్‌లో ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు ఇద్దరూ కూడా ఆన్‌లైన్ హాజరు, వైట్‌బోర్డ్, సెషన్ తర్వాత ఆడియో ప్రశ్నలు, లైవ్ చాట్‌బాక్స్ ఎంపిక, వర్చువల్ హోంవర్క్ అసైన్‌మెంట్ వంటి వివిధ ఆన్‌లైన్ సాధనాలను ఉపయోగించగలరు. ఉపాధ్యాయులు స్క్రీన్ పైన వైట్‌బోర్డ్ ఎంపికను కూడా పొందుతాడు, తద్వారా ఉపాధ్యాయులు బోర్డులో ఏమి వ్రాస్తున్నాడో విద్యార్థికి తెలుస్తుంది.

గత రెండు వారాల్లో, సంస్థ 200 కి పైగా విద్యా సంస్థలను డిజిటల్‌గా మార్చింది మరియు ఈ క్లిష్ట సమయాల్లో భారతీయ విద్యార్థులకు మరియు విద్యా సంస్థలకు ఉత్తమ సౌకర్యాలను అందించడానికి కట్టుబడి ఉంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo