Aadhaar Big News about kids aadhaar update
UIDAI ఇప్పుడు కొత్త పిల్లల ఆధార్ కార్డు కలిగిన వారి కోసం కొత్త న్యూస్ ఒకటి వెల్లడించింది. దేశంలో ప్రధాన ఐడెంటిటీ పత్రంగా చెల్లుబాటు అవుతున్న ఆధార్ కి సంబంధించిన పూర్తి వివరాలు సక్రమంగా ఉండేలా తీసుకున్న చర్యల్లో భాగంగా ఈ కొత్త అప్డేట్ అందించినట్టు తెలుస్తోంది. పిల్లలకు పసి వయసులో ఆధార్ కార్డు తీసుకున్న తల్లిదండ్రులు వారి పిల్లల బయోమెట్రిక్ స్థానంలో వారి బయోమెట్రిక్ వివరాలు అందిస్తారు. అయితే, కొన్నాళ్ల తర్వాత పిల్లల బయోమెట్రిక్ ని అప్డేట్ చేయాల్సి ఉంటుంది. దీని గురించి ఈ కొత్త అప్డేట్ ను అందించింది.
పైన తెలిపిన విధంగా చిన్న పిల్లలకు ఆధార్ కార్డు తీసుకునే అవకాశం అందించిన ప్రభుత్వం, పిల్లలకు ఏడు సంవత్సరాలు వచ్చిన వెంటనే వారి బయోమెట్రిక్ తో అప్డేట్ చేయాల్సిన నియమాన్ని కూడా పెట్టింది. అంటే ఆధార్ కార్డు తీసుకున్న సమయంలో తల్లిదండ్రుల బయోమెట్రిక్స్ ని అందించినా, పిల్లలకు ఏడు సంవత్సరాలు రాగానే పిల్లల వేలిముద్రలు మరియు రెటీనా స్కాన్ తో బయోమెట్రిక్ వివరాలు అప్డేట్ చేయవలసి ఉంటుంది. అలా చేయని పక్షంలో ఆ పిల్లల ఆధార్ కార్డులు డియాక్టివేట్ చేయనున్నట్లు UIDAI ప్రకటించింది.
ఈ కొత్త అప్డేట్ తేవడానికి కారణం ఏమిటి? అని మీకు ముందుగా అనిపించవచ్చు. కానీ అసలు విషయం తెలిస్తే మీరు కూడా ఇదే సరైన నిర్ణయమే అని అంటారు. దేశవ్యాప్తంగా ఏడు సంవత్సరాలు నిండిన తర్వాత కూడా పిల్లల బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోనటువంటి పిల్లల ఆధార్ కార్డు సంఖ్య పెద్ద మొత్తంలో ఉన్నట్టు UIDAI గుర్తించింది. అంటే, పిల్లలకు 7 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా వారి ఆధార్ లో బయోమెట్రిక్ చేయకుండా అలాగే వదిలేసిన వారు ఎక్కువగా ఉన్నారు.
అందుకే, UIDAI పిల్లల ఆధార్ కార్డ్ లో బయోమెట్రిక్ అప్డేట్ చెయ్యని తల్లిదండ్రులకు ఈ సూచన చేసింది. త్వరగా వారి పిల్లల బయోమెట్రిక్ వివరాలు అప్డేట్ చేయవలసిందిగా ఈ సూచన అందించింది ఒకవేళ ఆ విధంగా చేయనట్లయితే పిల్లల ఆధార్ కార్డు డి ఆక్టివేట్ చేయబడుతుందని కూడా సూచించింది.
Also Read: Samsung Galaxy F36 5G: బడ్జెట్ ధరలో 4K AI కెమెరా మరియు గొప్ప డిజైన్ తో వచ్చింది.!
పిల్లల ఆధార్ కార్డు అప్డేట్ కోసం UIDAI రిజిస్టర్ నెంబర్లకు ఎస్ఎంఎస్ ద్వారా వారి పిల్లల ఆధార అప్డేట్ చేయాలని కూడా నోటిఫికేషన్ పంపిస్తుంది. అలాగే ఐదు నుంచి ఏడు సంవత్సరాల లోపు పిల్లలకు బయోమెట్రిక్ అప్డేట్ అనేది ఉచితంగా చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ పిల్లలకు ఏడు సంవత్సరాలు నిండి నట్లయితే బయోమెట్రిక్ అప్డేట్ కోసం వంద రూపాయల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ మీ పిల్లలకి కూడా ఆధార్ అప్డేట్ చేయనట్లయితే త్వరగా చేసుకోవడం మంచిది.