OMG: ఒక్కమాటతో కొట్టేసిన 4,450 కోట్లు తిరిగిచ్చిన హ్యాకర్

Updated on 17-Aug-2021
HIGHLIGHTS

CryptoCurrency ద్వారా $600 (600 డాలర్లు) చోరీ

కొట్టేసిన డబ్బును అదే హ్యాకర్ తిరిగిచ్చేశాడు

చాలా ఇంట్రస్టింగ్ న్యూస్

ఎవరైనా డబ్బుకొట్టేస్తే ఏమి చేస్తారు? దాచుకుంటారు లేదా ఖర్చుపెడతారు. అయితే, ఒక హ్యాకర్ మనం ఊహించలేనంత డబ్బును కొట్టెయ్యడమేకాకుండా మళ్ళి ఆ డబ్బును తిరిగి ఇచ్చేశాడు. వింటుంటేనే చాలా వింతగా మరియు ఆశ్చర్యంగా కూడా వుంది కదా. ఇది నిజంగా జరిగినదే, ఇటీవల జరిగిన ఈ ఘటన Poly Net Work Hack పేరుతో ఇప్పుడు ప్రపంచమంతా చర్చనీయాంశంగా మారింది. మరి ఈ కథేమిటో దాని విషయం ఏమిటో తెలుసుకుందమా..!

CryptoCurrency గురించి మనందరికి తెలుసు. ఈ హ్యాకర్ కూడా ఈ CryptoCurrency ద్వారానే $600 (600 డాలర్లు) కొట్టేశాడు. ఇది మనదేశ కరెన్సీలో దాదాపుగా 4,450 కోట్ల రూపాయలకు సమానం. ఇంత మొత్తం Crypto కరెన్సీని హ్యాకింగ్ ద్వారా కొట్టెయ్యడం ఇదే మొదటిసారి. ఈ ఆన్లైన్ కరెన్సీని Poly Net Work నుండి కట్టేసాడు. తరువాత, పోలీ నెట్వర్క్ ఈ డబ్బును తీసుకున్న హ్యాకర్ ని ఉద్యేశించి ఆ తిరిగిచ్చేయమని ఒక లేఖను పోస్ట్ చేసింది. దీనికి స్పందించిన హ్యాకర్ కొట్టేసిన డబ్బును తిరిగిచ్చేశాడు.

ఇంతకీ అంతగా ఆ హ్యాకర్ ని ఆలోచింపచేసిన ఆ మాట ఏమిటి అనుకుంటున్నారా? ఈ లేఖలో ప్రధానంగా 'థింక్ ఆఫ్ ది చిల్డ్రన్' అనేమాట కనిపిస్తోంది. అంటే, 'పిల్లల గురించి ఆలోచించండి' అని దీనర్ధం. ఇది మాత్రమే కాదు, దీని పైన ఆధారపడిన వేల మంది ప్రజలు మరియు వారి కుటుంబాలకు తినడానికి తిండి కూడా ఉండదు అని తన లేఖలో వెల్లడించింది.

ఈ లేఖను చుసిన హ్యాకర్ ఆ అమౌంట్ ను తిరిగి ట్రాన్స్ ఫర్ చేశాడు. అంతేకాదు, తనకు డబ్బంటే ఆశలేదని కేవలం ఆన్లైన్లో వున్న లోపాలను బయటపెట్టడానికే ఈ అమౌంట్ హ్యాకింగ్ చేశానని, ఆ హ్యాకర్ తెలిపినట్లు తెలుస్తోంది. అయితే, ఇదంతా చేసిన ఆ హ్యాకర్ గురించి ఎటువంటి సమాచారం లేక పోవడం కొసమెరుపు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :