షావోమి ఫోన్లలోని సున్నితమైన డేటా ఎంతవరకూ సురక్షితం?

షావోమి ఫోన్లలోని సున్నితమైన డేటా ఎంతవరకూ సురక్షితం?
HIGHLIGHTS

ప్రజల సున్నితమైన డేటా చైనాలోని Alibaba సర్వర్‌కు అమ్మబడుతోందని చెబుతోంది.

భారతదేశంలో తన స్మార్ట్ ‌ఫోన్లతో  ఎక్కువగా అభిమానులను సంపాదించుకున్న చైనా స్మార్ట్ ‌ఫోన్ తయారీదారైన  షావోమి, ఇప్పుడు ప్రజల డేటాను అపహరిస్తోంది అనే ఆరోపణలను ఎదుర్కుంటోంది. భారతదేశంలో, షావోమి ప్రస్తుతానికి అతిపెద్ద స్మార్ట్ ‌ఫోన్ బ్రాండ్ మరియు ఇది భారతదేశంలో నిరంతరం కొత్త ప్రణాళికలతో ముందుకు సాగుతోంది. కానీ ప్రజా ప్రైవసి  ఉల్లంఘన మరియు భారతదేశంలో కరోనావైరస్ కారణంగా కంపెనీ తన విజయాన్ని కోల్పోవచ్చు. చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ షావోమి, పైన తెలిపినటువంటి   కొన్ని సమస్యలను వదిలివేసిందని లేదా అలాంటి లోపాలను తన మొబైల్ ఫోన్లలో వదిలివేయగలదని Forbes ఇచ్చిన నివేదిక చూపిస్తోంది. ఈ కారణంగానే,  ప్రజల సున్నితమైన డేటా చైనాలోని Alibaba సర్వర్‌కు అమ్మబడుతోందని చెబుతోంది.

ఇది కాకుండా, Redmi  మరియు Mi ఫోన్లలో ఇప్పటికే ప్రజల ప్రతి కదలికను పర్యవేక్షించే కొన్ని యాప్స్ ఉన్నాయని, అలాగే మీరు Incognito Mode  మోడ్‌లో ఏమి చూస్తున్నారో కూడా తెసులుకోగలవాని Forbes నివేదిక వెల్లడించింది. అలాగే, ఈ మొత్తం  సమాచారం చైనాకు కూడా పంపబడుతోందని తెలిపింది. అయితే, షావోమి సంస్థ తన ప్రకటనలలో ఈ పరిశోధనను ఖండించింది మరియు దానిని తిరస్కరిస్తోంది. కంపెనీ ఏమి చెబుతుందంటే, సంస్థ డేటాను ట్రాక్ చేస్తుందని అంగీకరించినప్పటికీ, వాటిని ఇతరులతో  ఎట్టిపరిస్థితుల్లో భాగస్వామ్యం(షేర్) చేయదని చెబుతుంది.

షావోమి మీ ఇంటర్నెట్ వాడకం గురించి పూర్తిగా తెలుసు

ఫోర్బ్స్ నివేదికలో, ఇంటర్నెట్ ‌ను ఉపయోగిస్తున్నప్పుడు లేదా ఏదైనా యాక్టివిటీలో పాల్గొనేటప్పుడు బ్రౌజర్‌లో మీరు చూసే ఏ యాక్టివిటినైనా సరే కంపెనీ పూర్తి రికార్డు కలిగి ఉందని చెబుతోంది. ఇది కాకుండా, షావోమి పరికరం ద్వారా అందుబాటులోకి వస్తున్న న్యూస్ ఫీడ్, ఆ సమాచారాన్ని మీరు చూసినా, దీనికి సంభందించి కంపెనీ అన్ని రికార్డులు సేకరిస్తుందని కూడా తెలుస్తోంది. అంతేకాదు, మీరు మీ ఫోనులో ఎన్నిసార్లు ఫోల్డర్ ని తెరిచారో, మీకంటే బాగా కంపెనీకే  దాని గురించి పూర్తిగా తెలుసునని చెబుతోంది. మొత్తంమీద, మీరు మీ ఫోన్ యొక్క స్క్రీన్‌ ఎన్నిసార్లు స్వైప్ చేశారో కూడా కంపెనీకి తెలుసు అని చెప్పవచ్చు.

మి బ్రౌజర్ కూడా సురక్షితం కాదు

భారతదేశంలోని షావోమి వినియోగదారుల స్టేటస్ బార్ మరియు సెట్టింగుల పేజీ గురించి సమాచారం కూడా అలీబాబా సర్వర్‌కు పంపబడుతోందని ఈ నివేదికలో పూసగుహసినట్లు చెప్పింది. షావోమి యొక్క వెబ్ డొమైన్ చైనాలోని బీజింగ్లో నమోదు చేయబడిందని ఈ నివేదిక చూపిస్తుంది. కంపెనీ ఇక్కడ ఉపయోగించనప్పటికీ, ఇది ఈ డేటాను సింగపూర్ మరియు రష్యాలోని రిమోట్ సర్వర్లకు పంపుతుంది. ఇది కాకుండా, మీరు మి బ్రౌజర్ లేదా మింట్ బ్రౌజర్ ఉపయోగిస్తే అది భారతీయ వినియోగదారుల డేటాను కూడా సేకరిస్తుంది.

ఈ నివేదికలో ఏమిచెబుతుందంటే, ఇప్పటివరకు కోట్ల మంది భారతీయుల డేటాను షావోమి చైనాకు పంపినట్లు కూడా బయటకు వస్తోంది. షావోమి, పెద్ద ఎత్తున వినియోగదారుల ప్రైవసీతో  ఆడుకున్నట్లు ఈ పరిశోధనలో చూడబడుతోంది మరియు ఇది తీవ్రమైన ప్రైవసి ఉల్లంఘన కేసుగా కూడా ఉద్భవించింది. అయితే, సంస్థ ఈ బార్ ‌ను దానిపై నుండి కొట్టివేస్తున్నప్పటికీ, షావోమి తరపున ఒక సమాధానం కూడా వచ్చింది. మీరు ఇక్కడ చూడవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo