7 Best Ways to Reduce Your AC Electricity Bill explained in telugu
AC Electricity Bill తగ్గించుకోవడానికి ఈ 7 సులభమైన చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. వేసవి కాలం కావడంతో ఇళ్లలో ఎయిర్ కండిషనర్ (AC) వినియోగం బాగా పెరుగుతుంది. అయితే, ఏసీ వాడకం పెరిగే కొద్దీ విద్యుత్ బిల్లు కూడా భారీగా వస్తుంటుంది. చాలా మంది ఏసీ లను ఎక్కువగా వాడకపోయినా బిల్లు మాత్రం జేబుకు చిల్లు పెట్టేలా వస్తుంది. ఇంత ఎక్కువగా కరెంట్ బిల్లు ఎందుకు వస్తుంది అని ఆశ్చర్యపోయే వారు కూడా ఎక్కువగా ఉంటారు. నిజానికి కొన్ని చిన్న మార్పులు చేస్తే ఏసీ కరెంట్ వినియోగాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు. ఏసీ పవర్ బిల్లు తగ్గించడానికి నిపుణులు సూచిస్తున్న 7 ప్రభావవంతమైన చిట్కాలు ఈరోజు తెలుసుకుందాం.
మురికిగా ఉన్న ఫిల్టర్లు గాలి ప్రవాహాన్ని బాగా అడ్డుకుంటాయి. ఫలితంగా ఏసీ ఎక్కువగా శ్రమ చేయాల్సి వస్తుంది. ఫలితంగా కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుంది. అందుకే, నెలకు ఒకసారి ఫిల్టర్లను శుభ్రం చేస్తే ఏసీ పనితీరు మెరుగుపడటంతో పాటు విద్యుత్ ఖర్చు కూడా తగ్గుతుంది.
సంవత్సరానికి కనీసం ఒకటి లేదా రెండు సార్లు ఏసీ సర్వీసింగ్ చేయించడం అవసరం. కండెన్సర్ కాయిల్, ఫిల్టర్, గ్యాస్ స్థాయి సరిగా ఉంటే ఏసీ సమర్థవంతంగా పనిచేస్తుంది. ఈ విషయాలను నిర్లక్ష్యం చేస్తే విద్యుత్ వినియోగం పెరిగే అవకాశం ఉంది. అంతేకాదు, ఏసీ త్వరగా లైఫ్ టైమ్ ను కోల్పోయే అవకాశం ఉంటుంది.
చాలా మంది గదిని త్వరగా చల్లబరచడానికి 16°C లేదా 18°C వద్ద AC ని సెట్ చేస్తారు. కానీ ఇది అధిక విద్యుత్ వినియోగానికి దారితీస్తుంది. నిపుణుల ప్రకారం 24°C నుంచి 26°C మధ్య ఉష్ణోగ్రత అత్యుత్తమం. ఈ సెట్టింగ్ వల్ల మీకు కంఫర్ట్ తో పాటు కరెంట్ బిల్లు కూడా తగ్గుతుంది. ఇది స్టాండర్డ్ టెంపరేచర్ గా కోడోత్ చెప్పబడుతుంది. కాబట్టి, మీ ఏసీ ని ఈ స్టాండర్డ్ రూమ్ టెంపరేచర్ వద్ద రెగ్యులర్ గా కొనసాగిస్తే మీ కరెంట్ బిల్లు తగ్గుతుంది.
ఏసీ ఆన్ లో ఉన్నప్పుడు సీలింగ్ ఫ్యాన్ కూడా ఆన్ చేస్తే చల్లని గాలి గది మొత్తం సమానంగా వ్యాపిస్తుంది. దీంతో ఏసీ పై ఒత్తిడి తగ్గి తక్కువ విద్యుత్ వినియోగంతో గది చల్లబడుతుంది. అయితే, కేవలం సింగిల్ ఫ్లోర్ ఇల్లు అయితే సీలింగ్ ఫ్యాన్ కంటే టేబుల్ ఫ్యాన్ లేదా స్టాండ్ ఫ్యాన్ మంచి ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే, ఇంటి స్లాబ్ నుంచి సీలింగ్ ఫ్యాన్ వేడి గాలిని వెదజల్లుతుంది.
ఏసీ నడుస్తున్న సమయంలో తలుపులు లేదా కిటికీలు తెరిచి ఉంచితే చల్లని గాలి బయటకు వెళ్లిపోతుంది. దీంతో గదిని చల్లబరచడానికి ఏసీ మరింత ఎక్కువ సమయం పనిచేయాల్సి వస్తుంది. కాబట్టి, ఏసీ వాడేటప్పుడు గదిని పూర్తిగా మూసి వేయడం మంచిది.
Also Read: Facebook, ఇంస్టాగ్రామ్ మరియు WhatsApp సేవలు ప్రపంచవ్యాప్తంగా డౌన్.!
రాత్రి సమయంలో చాలా మంది ఏసీ ని నిరంతరం ఒకే ఉష్ణోగ్రత వద్ద నడుపుతుంటారు. అయితే, రాత్రి సమయంలో Sleep Mode ఉపయోగిస్తే AC క్రమంగా ఉష్ణోగ్రతను సర్దుబాటు చేస్తూ విద్యుత్ వినియోగాన్ని తగ్గిస్తుంది. దీంతో రాత్రంతా కంఫర్ట్ తో పాటు మీ కరెంట్ బిల్లు కూడా తగ్గుతుంది.
మీరు కొత్త ఏసీ కొనాలనుకుంటే ఇన్వర్టర్ టెక్నాలజీ ఉన్న మోడళ్లను ఎంచుకోవడం మంచిది. ఇది గది ఉష్ణోగ్రత కు అనుగుణంగా కంప్రెసర్ వేగాన్ని నియంత్రిస్తాయి. ఫలితంగా సాధారణ AC లతో పోలిస్తే 30 నుంచి 40 శాతం వరకు విద్యుత్ ఆదా చేయవచ్చు.