SKOAR! College Gaming Cup గ్రాండ్ ఫినాలే అట్టహాసంగా ప్రారంభం: మ్యాచ్ షెడ్యూల్, పాయింట్ సిస్టమ్ మరియు అన్ని వివరాలు తెలుసుకోండి.!

Updated on 19-Feb-2026
HIGHLIGHTS

భారతదేశంలో అతిపెద్ద కాలేజ్ ఈ-స్పోర్ట్స్‌ టోర్నమెంట్ SKOAR! College Gaming Cup పూర్తి స్వింగ్ లో జరుగుతోంది మరియు 16 BGMI ఫైనలిస్ట్ టీమ్స్ మొదటి రోజున పోటీ పడటానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ టోర్నమెంట్ చివరి రోజు ఈ మొత్తం టీమ్స్ ఉన్నతమైన ప్రతిభ కనబర్చిన ఒక టీమ్ ఈ ప్రతిష్టాత్మక ట్రోఫీని సొంతం చేసుకుంటుంది. ఈరోజు ఈ వేదిక సిద్ధమైంది, ఈ ప్రతిష్టాత్మకమైన టీమ్స్ మధ్య జరిగే పోరును చూడడానికి ప్రేక్షకులు ఉత్సాహంగా ఉన్నారు మరియు జట్లన్నీ తమ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ మ్యాచ్ యొక్క షెడ్యూల్, పాయింట్ సిస్టమ్ మరియు మరిన్నింటిని తెలుసుకోవడానికి మా అప్డేట్స్ చెక్ చేస్తూ ఉండండి.

SKOAR! College Gaming Cup గ్రాండ్ ఫినాలే ప్రారంభం

గ్రేటర్ నోయిడాలో ఉన్న బెన్నెట్ యూనివర్సిటీ లో SKOAR! కాలేజ్ గేమింగ్ కప్ గ్రాండ్ ఫినాలే జరుగుతోంది.

నేడు, 16 టీమ్స్ BGMI గ్రాండ్ ఫినాలే లో పోటీ పడతాయి. ఫిబ్రవరి 20 న, అంటే రేపు, 2 వాలరెంట్ ఫైనలిస్ట్ టీమ్స్ వేదిక పై కనిపిస్తాయి.

ఈరోజు మ్యాచ్ షెడ్యూల్‌ లో మొత్తం 6 మ్యాచ్‌లు ఉన్నాయి. మొదటి మ్యాచ్ మ్యాప్ Rondo లో ఉంటుంది. అయితే, రెండవ, మూడవ మరియు నాల్గవ మ్యాచ్‌లు మాత్రం Erangel మ్యాప్‌లో ఆడవలసి ఉంటుంది. అదే సమయంలో, ఐదవ మరియు ఆరవ మ్యాచ్‌లు మాత్రం Miramar మ్యాప్‌ లో ఆడాల్సి ఉంటుంది.

ఇక పాయింట్ సిస్టమ్ విషయానికి వస్తే, ఒక మ్యాచ్‌ లో మొదటి స్థానంలో నిలిచిన టీమ్ 10 పాయింట్లు, రెండవ స్థానంలో నిలిచిన టీమ్ 6 పాయింట్లు మరియు మూడవ స్థానం సంపాదించిన టీమ్ 5 పాయింట్లు పొందుతాయి.

పాయింట్ సిస్టమ్ యొక్క వివరాలు ఇమేజ్ లో చూడవచ్చు:

SKOAR! College Gaming Cup ఏమిటి?

బెన్నెట్ యూనివర్సిటీ గత రెండు రోజులుగా హై ఎనర్జీ ఈ-స్పోర్ట్స్ అరేనాగా మారిపోయింది. నేటి స్పాట్‌లైట్ బాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా పై నిలిచింది. ఇక్కడ అర్హత కలిగిన 16 కాలేజ్ టీమ్స్ LAN ఫైనల్స్‌లో పోటీ పడుతున్నాయి. వేదికపై తమ స్థానాన్ని సంపాదించుకోవడానికి ఈ టీమ్స్ అన్ని కూడా వారాల తరబడి క్వాలిఫైయర్స్ తో పోరాడాయి మరియు ఇప్పుడు వారు ప్రొఫెషనల్ టోర్నమెంట్ సెటప్‌ లను ఉపయోగించి ప్రేక్షకుల ముందు ప్రత్యక్షంగా ఆడుతున్నారు.

ప్రత్యక్ష ప్రసారం, బిగ్ స్క్రీన్ మరియు స్టేజ్ ఫియర్ ఒత్తిడితో కూడిన దాదాపు ప్రొఫెషనల్ వాతావరణంలో పోటీ పడటం ఈ ప్లేయర్స్ లో చాలా మందికి ఇదే మొదటి అనుభవం అవుతుంది. వాస్తవ ప్రపంచ టోర్నమెంట్ పరిస్థితుల్లో నైపుణ్యం, టీమ్ ఎఫర్ట్ మరియు ప్రశాంతతను పరీక్షించడానికి ఈ ఫార్మాట్ రూపొందించబడింది.

ఈ టోర్నమెంట్ లో ప్రధాన ఆకర్షణ LAN ఫైనల్ అయితే, SKOAR! కాలేజ్ కప్ ఎక్స్ పీరియన్స్ ఈ వేదికను దాటి విస్తరించి ఉంది. పోటీ గేమింగ్ మరియు క్యాంపస్ సంస్కృతిని ఒకచోట చేర్చడానికి ఒక ప్రత్యేక SKOAR జోన్ ఏర్పాటు చేయబడింది. హాజరైనవారు పెద్ద స్క్రీన్స్ పై ప్రత్యక్ష ప్రసారాన్ని అనుసరించవచ్చు, అలాగే అభిమానులు, హోస్ట్‌లు మరియు కాస్టర్‌లతో సంభాషించవచ్చు మరియు వేదిక అంతటా ఉన్న కార్యకలాపాల్లో పాల్గొనవచ్చు.

పోటీ వాతావరణానికి పాప్ సంస్కృతి జోడిస్తూ, పాల్గొనేవారికి కాస్ప్లే కాంటెస్ట్ కూడా ఉంటుంది.

ఈరోజు ఫైనల్ ప్రారంభం కానుండగా, ట్రోఫీని ఎవరు గెలుచుకుంటారు అని చూడటానికి అందరి దృష్టి ఢిల్లీ NCR లోని అగ్రశ్రేణి కాలేజ్ గేమర్స్ పై ఉంది. మరిన్ని అప్‌డేట్స్ కోసం మా లైవ్ అప్‌డేట్స్ ను చెక్ చేస్తూ ఉండండి.

Also Read: 1.5 TON AC Deals: ఫ్లిప్ కార్ట్ భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో చవక ధరలో లభిస్తున్న బెస్ట్ ఏసీలు.!

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :