SKOAR! College Cup Delhi Edition వాలరెంట్ గ్రాండ్ ఫినాలే: విజయకేతనం ఎగరేసిన Team Rektt

Times Network మరియు Digit సమర్పించిన SKOAR! College Cup Delhi Edition లో వాలరెంట్ గ్రాండ్ ఫినాలే విజేతలు అనౌన్స్ చేయబడింది. హై ప్రెషర్ బెస్ట్ ఆఫ్ 5 ఫైనల్లో టీమ్ రెక్ట్ (Rektt) అద్భుత ప్రదర్శన కనబరిచి హోమ్ టీమ్ గాడ్సిఫై (Godsify) పై అద్భుత విజయం సాధించింది. గ్రేటర్ నోయిడాలోని Bennett University లో ప్రేక్షకుల క్లాప్స్ మరియు ప్రశంసల మధ్య ఈ ప్రతిష్టాత్మక టైటిల్‌ను సొంతం చేసుకుని, విజయ గర్వంతో ట్రోపిని ఎట్టి చూపింది. విజేతగా నిలిచిన ఈ జట్టు 15 లక్షల ప్రైజ్ పూల్‌ ను కూడా అందుకుంది. టోర్నమెంట్ MVP అవార్డు విజేత జట్టుకు చెందిన ‘Mr Psycho కు దక్కింది. మొత్తం 57 కిల్స్ సాధించిన అతను ఫైనల్ లో కీలక పాత్ర పోషించాడు. అతని ప్రదర్శన టీమ్ విజయం సాధించడంలో కీలక పాత్ర వహించింది.

ఆత్మవిశ్వాసంతో సరదాగా మొదలైన ప్రీ-మ్యాచ్ చివరకు ఉత్కంఠభరితమైన వ్యూహాత్మక పోరుగా మారింది. ప్రతి మ్యాప్‌లో మొమెంటమ్ మారుతూ, చివరి ఫలితం తేలే వరకు మ్యాచ్ తీవ్ర ఉత్కంఠ ను సృష్టించింది. టైటిల్ డిసైడర్‌కు తగినట్లుగా, కచ్చితమైన సైట్ ఎగ్జిక్యూషన్స్ నుంచి క్లచ్ రీటేక్స్ వరకు ఈ సిరీస్‌లో అభిమానులు ఆశించే ప్రతి అంశం కనిపించింది. చివరి రౌండ్ ముగిసిన వెంటనే ‘GG’ కాల్ వినిపించగానే, అరేనా మొత్తం ఆనందోత్సాహాలతో మారుమోగింది. రెండు రోజుల పాటు సాగిన అత్యున్నత స్థాయి కాలేజ్ ఈ-స్పోర్ట్స్ పోటీకి ఇది సరైన ముగింపు గా నిలిచింది.

SKOAR! College Cup Delhi Edition విన్నర్ Team Rektt

ఫైనల్‌ లో అడుగుపెట్టే సమయానికే రెండు టీమ్స్ కూస వేదిక పై అపార ఉత్సాహాన్ని నింపాయి. ముఖ్యంగా గ్రేటర్ నోయిడాలో ఉన్న Bennett University లోని ప్రేక్షకులు రెండు వర్గాలుగా చీలిపోయారు. అరేనా ఒక వైపు హోమ్ టీమ్ గాడ్సిఫై (Godsify) కు అండగా స్ఫూర్తి నింపే నినాదాలతో మారు మోగించగా, మరోవైపు రెక్ట్ (Rektt) అభిమానులు ప్రతి రౌండ్ విజయం సందర్భంగా గర్జిస్తూ సంబరాలు చేసుకున్నారు. టోర్నమెంట్ ముగిసే సమయానికి అరేనాలో Rektt అభిమానుల సంబరాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

గ్రాండ్ ఫినాలే ప్రారంభంలోనే Rektt పూర్తి ఆధిపత్యం చూపించింది. బెస్ట్ ఆఫ్ 5 సిరీస్‌ లో తొలి రెండు మ్యాచులను వరుసగా గెలిచి ట్రోఫీకి ఒక అడుగు దూరంలోకి చేరుకుంది.

మొదటి మ్యాచ్ విజయం ఇచ్చిన మూమెంటం ను రెండో గేమ్‌ లో కూడా ఈ టీమ్ అద్భుతంగా కొనసాగించారు. ఆత్మవిశ్వాసం, కచ్చితత్వంతో ఆడిన Rektt ప్రారంభంలోనే లీడ్ సాధించింది. అయితే, మరోపక్క టీమ్ Godsify పూర్తి రిథమ్‌ లోకి రావడానికి కష్టపడింది. మధ్యలో కొన్ని కీలక రౌండ్స్ గెలుచుకుని కంబ్యాక్ ప్రయత్నం చేసినప్పటికీ, Rektt వెంటనే ఆ అవకాశాన్ని మూసి వేసింది. రెండో మ్యాచ్ 13-4 స్కోర్‌ లైన్‌ తో ముగియడం వారి సర్వర్‌పై ఉన్న ఆధిపత్యాన్ని స్పష్టంగా చూపించింది. సిరీస్‌ లో 2-0 ఆధిక్యంలో ఉన్న Rektt కు ఇప్పుడు క్లీన్ స్వీప్ సాధించడానికి ఇంకొక మ్యాప్ విజయం మాత్రమే అవసరమైంది.

మూడో మ్యాచ్ మాత్రం ఉత్కంఠభరితంగా కొనసాగింది. ప్రారంభంలోనే రెండు జట్లు సమానంగా పోరాడి 4-4 స్కోర్‌ తో తీవ్రమైన పోటీని కనబరిచాయి. కానీ మ్యాచ్ ముందుకు సాగే కొద్దీ Rektt మరోసారి ఆధిక్యం సాధించి, చివరికి విజయం వైపు దూసుకెళ్లింది. వారి స్థిరత్వం మరియు సమన్వయం ఈ ఫైనల్‌ను సొంతం చేసుకునేలా చేసింది.

Also Read: Sony 5.1 Dolby సౌండ్ బార్ పై అమెజాన్ బిగ్ డీల్స్ అందుకోండి.!

BGMI గందరగోళం నుంచి వాలరెంట్ ప్రెసిషన్ వరకు: SKOAR యొక్క అతిపెద్ద కాలేజ్ స్టేజ్ కి తగిన ముగింపు.

వాలరెంట్ గ్రాండ్ ఫినాలేతో భారత్‌లోని అతిపెద్ద కాలేజ్ ఈ-స్పోర్ట్స్ టోర్నమెంట్ అయిన SKOAR! కాలేజ్ కప్ ఢిల్లీ ఎడిషన్‌ కు ఘనమైన ముగింపు లభించింది. తొలి రోజు 16 BGMI జట్లు హై-ఇంటెన్సిటీ LAN షోడౌన్‌ లో తలపడగా, స్థిరమైన ప్రదర్శనతో W2R చాంపియన్‌ గా నిలిచింది. ఆ ఎక్స్‌ప్లోజివ్ ఫినిష్ ఉత్సాహం రెండో రోజుకూ కొనసాగింది. అయితే, ఈసారి దృష్టి పూర్తిగా వాలరెంట్ టాక్టికల్ డెప్త్ పై, చివరి రెండు జట్ల మధ్య జరిగిన హోరాహోరీ పోరుపై నిలిచింది.

మొత్తం రూ. 30 లక్షల ప్రైజ్ పూల్‌ తో ఈ టోర్నమెంట్ కాలేజ్ ఈ-స్పోర్ట్స్ ఎంత ప్రొఫెషనల్ మరియు సిస్టమేటిక్‌ గా మారిందో ప్రతిబింబించింది. SKOAR! కాలేజ్ కప్ ఢిల్లీ ఎడిషన్ ప్రొఫెషనల్ స్టేజ్ సెటప్స్, లైవ్ క్యాస్టింగ్, అభిమానులతో నిండిన స్టాండ్స్ ద్వారా ఆటగాళ్లకు దాదాపు ప్రో లెవల్ అనుభవాన్ని అందించింది.

టీమ్ రెక్ట్ ట్రోఫీని ఎత్తి, కన్‌ఫెట్టి వర్షం మధ్య ఫోటోల కోసం పోజులు ఇస్తున్న క్షణంలో ఒక విషయం స్పష్టమైంది, SKOAR! కాలేజ్ కప్ ఇక సాధారణ క్యాంపస్ టోర్నమెంట్ మాత్రమే కాదు, ఇది భారత ఈ-స్పోర్ట్స్ భవిష్యత్ తరం ప్రతిభను నిరూపించే వేదిక అని.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :