PUBG డార్కెస్ట్ నైట్ మోడ్ గేమ్ అప్డేట్ వచ్చే వారంలో అందుతుంది : ఇవే పూర్తి విశేషాలు
ఈ టైటిల్ యొక్క స్థిరమైన 0.12.0. వెర్షనుకు అప్డేట్ అవుతుంది.
సర్వైవ్ టిల్ డాన్ ఈవెంట్ కూడా పునరుద్ధరించబడుతుంది
ఈ కొత్త గేమ్ మోడ్ లో RPG 7 రాకెట్ లాంచర్ వంటి కొత్త ఆయుధాలను మీకు పరిచయం చేయడానికి సిద్దమయ్యింది
PUBG మొబైల్ ఇప్పుడు 'డార్కేస్ట్ నైట్' అని పిలువబడే కొత్త గేమ్ మోడుతో అప్డేట్ చేయబడింది. అంతేకాదు, ఇప్పుడు ఈ గేమ్ డెవలపర్లు ఈ కొత్త గేమ్ మోడ్ వచ్చే వారంలో లభ్యమవుతుందని ధృవీకరించారు, ఈ టైటిల్ యొక్క స్థిరమైన 0.12.0. వెర్షనుకు అప్డేట్ అవుతుంది. ఈ కొత్త గేమ్ మోడ్ పాత జోంబీ మోడ్ నుండి కొద్దిగా భిన్నంగా ఉంటుంది: టెన్సేన్ గేమ్స్, PUBG కార్పొరేషన్ మరియు క్యాప్కామ్ల యొక్క మిశ్రమ ఫలితంగా లభిస్తుంది ఈ సర్వైవ్ టిల్ డాన్ ఈవెంట్. ఈ కొత్త గేమ్ మోడ్ ప్లేయర్లకు ప్రత్యేకమైన గేమ్ ప్లే అమలు కారణంగా విభిన్న వ్యూహాలను తీసుకొస్తుంది. ఈ కొత్త గేమ్ మోడుతో పాటు, సర్వైవ్ టిల్ డాన్ ఈవెంట్ కూడా పునరుద్ధరించబడుతుంది మరియు వ్యూవర్ మోడ్ మరియు కొత్త క్రాషైర్ మోడ్ సవరణలు ఉంటాయి.
Surveyడార్కెస్ట్ నైట్ మోడ్
ఈ కొత్త డార్కెస్ట్ నైట్ గేమ్ మోడ్ టిల్ డాన్ ఈవెంట్ను సర్వైవ్ చేయడానికి చాల అసమానంగా ఉంటుంది. ఈ కొత్త గేమ్ మోడ్ లో, ఆటగాళ్ళు ఎరాంగెల్ మ్యాప్ లో యాదృచ్ఛికంగా వుంటారు మరియు 30 నిముషాలు జీవించి ఉండవలసి ఉంటుంది. ప్లేయర్లు ఇందులో పోరాడటానికి, గ్రూప్స్ గా లేదా ఒంటరిగా ఆడవచ్చు. అయితే, సర్వైవ్ టిల్ డాన్ మోడ్ లో లాగ బయటికి వచ్చి జొంబిలతో పోరాడలేరు. ఎందుకంటే, ఒక రాత్రి వేళల్లో బయటి గాలి మొత్తం విషంతో నిండివుంటుంది.
సర్వైవ్ టిల్ డాన్ 2.0
"PUBG MOBILE x రెసిడెంట్ ఈవిల్ 2 సర్వైవల్ గేమ్ మోడ్ మరింత భయానక గేమ్ ప్లే కోసం కొత్త భీకరమైన గన్స్ మరియు ఎప్పుడూ ఎన్నడూ చూడనటువంటి బాలిస్టిక్ ఆయుధాలతో పునరుద్ధరించబడుతుంది," అని PUBG మొబైల్ టీం చెబుతోంది. ఈ కొత్త గేమ్ మోడ్ లో RPG 7 రాకెట్ లాంచర్ వంటి కొత్త ఆయుధాలను మీకు పరిచయం చేయడానికి సిద్దమయ్యింది PUBG, ఇది ఆరు రాకెట్లు మరియు ఐరన్ వ్యూలతో ఉన్న మ్యాప్ లో తీసుకువస్తుంది. అధనంగా, పేల్చగల క్రాస్బౌ బాణాలు ఉంటాయి మరియు లిక్విడ్ నైట్రోజన్ పేల్చవచ్చు, దాని ప్రభావంతో దీని పరిధిలోని ప్రతి ఒక్కరూ వారి వేగాన్ని తగ్గించే ప్రభావాన్ని ఇస్తుంది. అప్డేట్ చేయబడిన 'సర్వైవ్ అంటిల్ డాన్' మోడ్లో ఉన్న జాంబీస్ పైకప్పుపై మరియు తక్కువ ఎత్తు గోడలపై పైకి కూడా ఎక్కుతాయి.
స్పెక్టేటర్ మోడ్ మరియు క్రాస్షైర్ సవరణలు:
రాబోయే అప్డేట్ తో ప్లేయర్స్, వారి ఫ్రెండ్స్ లేదా వారి ఇతర సభ్యుల మ్యాచ్ లను చూడగలరు. అధనంగా, రెడ్ డాట్, హోలోగ్రాఫిక్, 2x స్కోప్ మరియు 3x స్కోప్లు రంగులను మార్చడానికి ఎంపికను పొందుతాయి, రెడ్ కలర్ డాట్ ను పలు ఆకార వైవిధ్యాలతో పొందగవచ్చు.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

