PUBG కి పోటీగా రానున్న కొత్త భారతీయ గేమ్ FAU-G
ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఈ విషయాన్ని షోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ద్వారా వెల్లడించారు.
ఈ మొబైల్ గేమ్ ని FAU-G అనే పేరుతొ తీసుకురానునట్లు కూడా తన ట్వీట్ లో పేర్కొన్నారు.
ఈ గేమ్ ద్వారా వచ్చే ఆదాయంలో 20% " భారత్ కే వీర్ " ట్రస్ట్ కి ఇవ్వనున్నట్లు బహిరంగంగా ప్రకటించారు.
ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన PUBG మొబైల్ గేమ్ తో సహా మొత్తం 118 యాప్స్ ని భారత ప్రభుత్వం నిషేధించిన కొద్ది రోజుల్లోనే ఈ PUBG మొబైల్ ఆన్లైన్ మల్టి ప్లేయర్ గేమ్ కు ప్రత్యామ్నాయంగా మరియు పోటీ గేమ్ ప్రకటించబడింది. ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఈ విషయాన్ని షోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ద్వారా వెల్లడించారు. అంతేకాదు, ఈ మొబైల్ గేమ్ ని FAU-G అనే పేరుతొ తీసుకురానునట్లు కూడా తన ట్వీట్ లో పేర్కొన్నారు.
Surveyప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పిలిపునిచ్చిన "ఆత్మ నిర్బర్ భారత్" స్పూర్తితో ఈ Fearless And United – Guards షార్ట్ ఫామ్ లో FAU-G ని తీసుకొస్తున్నట్లు చెప్పారు. అధనంగా, ఈ గేమ్ ద్వారా ప్లేయ్సర్ ఎంటర్టైన్మెంట్ తో పాటుగా మన దేశ సైనికుల త్యాగాలను కూడా తెలుసుకునేలా ఈ గేమ్ ఉండనుంది. అన్నింటికన్నా ప్రదమైన విషయం ఏమిటంటే, ఈ గేమ్ ద్వారా వచ్చే ఆదాయంలో 20% " భారత్ కే వీర్ " ట్రస్ట్ కి ఇవ్వనున్నట్లు బహిరంగంగా ప్రకటించారు. ఈ విషయాన్ని తన ట్విటర్ అకౌంట్ ద్వారా ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ క్రింద చూడవచ్చు.
Supporting PM @narendramodi’s AtmaNirbhar movement, proud to present an action game,Fearless And United-Guards FAU-G. Besides entertainment, players will also learn about the sacrifices of our soldiers. 20% of the net revenue generated will be donated to @BharatKeVeer Trust #FAUG pic.twitter.com/Q1HLFB5hPt
— Akshay Kumar (@akshaykumar) September 4, 2020
ప్రస్తుతం, ఇండియాలో PUBG వంటి మరికొన్ని మల్టి ప్లేయర్ మరియు ఆన్లైన్ గేమ్స్ ని నిషేధించిన తరువాత, ఇండియాలో ప్రారంభించనున్న కొత్త గేమింగ్ యాప్స్ కి సరైన సమయం కూడా అవుతుంది. ఈ గేమ్ కనుక మంచి గ్రాఫిక్స్ మరియు ఆకట్టుకునే ఫీచర్స్ తో వచ్చినట్లయితే, PUBG కి సరైన పోటీధారుగా ఎదుగుతుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile