Flipkart Big Billion Days: భారీ ఆఫర్లు తీసుకొస్తోంది

HIGHLIGHTS

TV లు మరియు గృహోపకరణాల (హోమ్ అప్లయన్సెస్) పైన గరిష్టంగా 80% వరకు డిస్కౌంట్

No cost EMI, కేవలం 1 రూపాయితో మొబైల్ ప్రొటక్షన్ మరియు బెస్ట్ Exchange

Flipkart Big Billion Days సేల్ భారీ ఆఫర్లతో వచ్చేస్తోంది.

Flipkart Big Billion Days సేల్ భారీ ఆఫర్లతో వచ్చేస్తోంది. భారీ డిస్కౌంట్స్, బ్యాంక్ ఆఫర్స్ మరియు మరిన్ని లాభాలను వినియోగదారులు అందుకునే అవకాశం తీసుకొస్తోంది.  భారతదేశంలో పండుగ సీజన్ మొదలవుతుండగా ఫ్లిప్‌కార్ట్  ఈ సేల్ ని గురించి అనౌన్స్ చేసింది. అంతేకాదు, " ఇండియా యొక్క అతిపెద్ద సేల్ " అని కూడా దీని గురించి పేర్కొంది. ఈ సేల్ ద్వారా ఇవ్వనున్న ఆఫర్లు, డిస్కౌంట్ మరియు బ్యాంక్ ఆఫర్లతో పాటుగా మరిన్ని వివరాలను కూడా చూపిస్తోంది.

ఇక ఈ సేల్ ద్వారా ఇవ్వనున్న ఆఫర్ల విషయానికి వస్తే, Flipakrt ప్రస్తుతం చేస్తున్న టీజింగ్ పరిశీలిస్తే, TV లు మరియు గృహోపకరణాల (హోమ్ అప్లయన్సెస్) పైన గరిష్టంగా 80% వరకు డిస్కౌంట్ అందించే అవకాశం వుంది. ఇక మొబైల్ ఫోన్ల విషయంలో కూడా మంచి ఆఫర్లను ప్రకటించవచ్చు. ఎందుకంటే, మొబైల్ ఫోన్ల పైన అన్ని ప్రధాన బ్యాంక్స్ నుండి No cost EMI, కేవలం 1 రూపాయితో మొబైల్ ప్రొటక్షన్ మరియు బెస్ట్ Exchange వంటి ఆఫర్లను ఇప్పటికే ప్రకటించింది.

అలాగే, ఎప్పటిలాగానే మహా ప్రైస్ డ్రాప్, క్రేజీ డీల్స్ మరియు రష్ అవర్ వంటి స్పెషల్ ఆఫర్లు కూడా ఉంటాయి. ఈ సేల్ ని SBI బ్యాంక్ యొక్క భాగస్వామ్యంతో తీసుకొస్తోంది కాబట్టి, SBI క్రెడిట్ మరియు డెబిట్ కార్డుల ద్వారా వస్తువులను కొనేవారికి 10% తక్షణ డిస్కౌంట్ అందుకోవచ్చు. Paytm ద్వారా కొనేవారికి క్యాష్ బ్యాక్ ని కూడా అఫర్ చేస్తోంది . ఈ సేల్ త్వరలో రానున్నట్లు టీజ్ చేస్తున్న Flipkart, ఇంకా తేదీని మాత్రం ప్రకటించలేదు. అయితే, త్వరలోనే తేదీని కూడా వెల్లడించవచ్చు.                                                     

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :