Dolby Atmos మరియు DTS X సౌండ్ సపోర్ట్ తో కొత్త సౌండ్ బార్ లాంచ్ చేసిన Zebronics

HIGHLIGHTS

కాంపాక్ట్ సైజులో Dolby Atmos మరియు DTS X సౌండ్ సపోర్ట్ తో కొత్త సౌండ్ బార్ లాంచ్

ఇది గొప్ప సరౌండ్ సౌండ్ అందించే 5.1 ఛానల్ సెటప్ తో ఉంటుంది

జెబ్రోనిక్స్ కొత్తగా విడుదల చేసిన ఈ లేటెస్ట్ సౌండ్ బార్ చాలా కాంపాక్ట్ సైజులో ఉంటుంది

బడ్జెట్ ధరలో పవర్ ఫుల్ సౌండ్ బార్స్ ను ఇండియన్ మార్కెట్లో అందించిన Zebronics ఇప్పుడు మరో బడ్జెట్ సౌండ్ అబ్రా ను అందించింది. రీసెంట్ గా కాంపాక్ట్ సైజులో 5.1 ఛానల్ డాల్బీ ఆడియో సౌండ్ బార్ ను విడుదల చేసింది. ఇప్పుడు అదే ఇన్స్పిరేషన్ తో మరింత కాంపాక్ట్ సైజులో Dolby Atmos మరియు DTS X సౌండ్ సపోర్ట్ తో మరో కొత్త సౌండ్ బార్ ని ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది.

Zebronics Dolby Atmos మరియు DTS X సౌండ్ బార్

జెబ్రోనిక్స్ కొత్తగా Juke Bar 9710C సౌండ్ బార్ ను 5.1 ఛానల్ మరియు డాల్బీ అట్మాస్ అండ్ డిటిఎస్: ఎక్స్ సౌండ్ సపోర్ట్ తో అందించింది. ఈ సౌండ్ బార్ ను కేవలం రూ.16,999 రూపాయల ధరతో అందించింది. ఇది అమెజాన్ ఇండియా మరియు కంపెనీ అఫీషియల్ వెబ్సైట్ నుంచి సేల్ కి అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సౌండ్ బార్ ఆకట్టుకునే అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ లను కూడా అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 15,999 రూపాయల ఆఫర్ ధర లభిస్తుంది. Buy From Here

Also Read: మీ Air Cooler నుంచి దుర్వాసన వస్తుందా.. పూర్తిగా నివారించడానికి బెస్ట్ టిప్స్.!

Zebronics Juke Bar 9710C : ఫీచర్స్

జెబ్రోనిక్స్ కొత్తగా విడుదల చేసిన ఈ లేటెస్ట్ సౌండ్ బార్ చాలా కాంపాక్ట్ సైజులో ఉంటుంది. కానీ ఇది గొప్ప సరౌండ్ సౌండ్ అందించే 5.1 ఛానల్ సెటప్ తో ఉంటుంది. ఈ సౌండ్ బార్ సెటప్ లో కాంపాక్ట్ సైజులో మూడు పవర్ ఫుల్ స్పీకర్లు కలిగిన బార్, సరికొత్త సర్కిల్ డిజైన్ డ్యూయల్ శాటిలైట్ స్పీకర్లు మరియు వైర్లెస్ సబ్ ఉఫర్ ఉంటాయి. ఈ లేటెస్ట్ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ 550W RMS జబర్దస్త్ సౌండ్ అవుట్ పుట్ ఆఫర్ చేస్తుంది.

ఈ లేటెస్ట్ 5.1 ఛానల్ సౌండ్ బార్ డాల్బీ అట్మాస్ మరియు డిటిఎస్: ఎక్స్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ కలిగిన 5.1 ఛానల్ సెటప్ మరియు సౌండ్ టెక్నాలజీ సౌండ్ సపోర్ట్ తో గొప్ప సౌండ్ అందిస్తుందని జెబ్రోనిక్స్ తెలిపింది. ఈ సౌండ్ బార్ HDMI eArc, USB, AUX, ఆప్టికల్ ఇన్ మరియు బ్లూటూత్ వెర్షన్ 5.3 వంటి అన్ని లేటెస్ట్ కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :