Zebronics Juke Bar 10000: వరల్డ్ క్లాస్ హోమ్ థియేటర్ లాంచ్ చేసిన జెబ్రోనిక్స్.!

Updated on 05-May-2025
HIGHLIGHTS

మార్కెట్ ను షేక్ చేసే కొత్త హై ఎండ్ ఫీచర్స్ తో జెబ్రోనిక్స్ సౌండ్ బార్ లాంచ్

Zebronics Juke Bar 10000 సౌండ్ బార్ ను 7.2.4 ఛానల్ సపోర్ట్ తో అందించింది

ఇది నిజమైన సినిమా థియేటర్ అనుభూతిని అందిస్తుందని జెబ్రోనిక్స్ తెలిపింది

Zebronics Juke Bar 10000: ప్రముఖ దేశీయ ఆడియో ప్రొడక్ట్స్ తయారీ కంపెనీ జెబ్రోనిక్స్ మార్కెట్ ను షేక్ చేసే కొత్త హై ఎండ్ ఫీచర్స్ తో సౌండ్ బార్ లాంచ్ చేసింది. అదే జెబ్రోనిక్స్ జ్యూక్ బార్ 10000 సౌండ్ బార్ మరియు ఈ సౌండ్ బార్ ను 7.2.4 ఛానల్ సపోర్ట్ తో అందించింది. ఈ సౌండ్ బార్ 1100 RMS సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఇది నిజమైన సినిమా థియేటర్ అనుభూతిని మరియు గ్రౌండ్ షేక్ చేసే సౌండ్ ను అందిస్తుందని జెబ్రోనిక్స్ తెలిపింది.

Zebronics Juke Bar 10000 : ఫీచర్స్

జెబ్రోనిక్స్ జ్యూక్ బార్ 10000 సౌండ్ బార్ ను 7.2.4 ఛానల్ సెటప్ తో అందించింది. ఈ సౌండ్ బార్ కంప్లీట్ స్పెకర్ సెటప్ తో వస్తుంది. ఇందులో ముందు మూడు స్పీకర్లు, మూడు ట్వీటర్లు, రెండు సైడ్ సరౌండ్ మరియు రెండు అప్ ఫైరింగ్ స్పీకర్లు కలిగిన పవర్ ఫుల్ బార్ ఉంటుంది. అలాగే, అప్ ఫైరింగ్ మరియు ఫ్రెంట్ ఫైరింగ్ స్పీకర్లు కలిగిన రెండు శాటిలైట్ స్పీకర్లు కూడా కలిగి ఉంటుంది. ఇది కాకుండా ఈ సౌండ్ బార్ లో రెండు పెద్ద స్పీకర్లు మరియు రెండు పాసివ్ రేడియేటర్స్ కలిగిన 300W వైర్లెస్ సబ్ ఉఫర్ కూడా ఉంటుంది.

సింపుల్ గా చెప్పాలంటే, 7 స్పీకర్లు మరియు మూడు ట్వీటర్లు కలిగి 520W సౌండ్ అందించే బార్, రెండేసి స్పీకర్లు కలిగి 280W సౌండ్ అందించే శాటిలైట్ స్పీకర్లు మరియు 300W పవర్ ఫుల్ వైర్లెస్ సబ్ ఉఫర్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ టోటల్ 1100W RMS జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది. అంతేకాదు, ఇది పూర్తిగా వైర్లెస్ సెటప్ తో వస్తుంది.

ఈ జెబ్రోనిక్స్ ప్రీమియం సౌండ్ బార్ HDMI (eARC), ఆప్టికల్, USB, AUX మరియు బ్లూటూత్ 5.3 కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ Dolby Atmos మరియు DTS X సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ ZEB Acousti Max మల్టీ డైమెన్షనల్ ఆడియో ఫీచర్స్ తో రూమ్ ఫిల్లింగ్ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ తో వైర్లెస్ UHF మైక్రోఫోన్ ను కూడా తీసుకు వస్తుంది.

Also Read: అమెజాన్ సేల్ నుంచి రూ. 1,500 బడ్జెట్ లో లభించే బెస్ట్ ANC TWS Buds డీల్స్ ఇవే.!

Zebronics Juke Bar 10000: ధర

జెబ్రోనిక్స్ ఈ ప్రీమియం సౌండ్ బార్ ను రూ. 44,999 ధరతో లాంచ్ చేసింది. ఈ సౌండ్ బార్ పై రూ. 5,000 భారీ లాంచ్ డిస్కౌంట్ బ్యాంక్ ఆఫర్ ను అందించింది. అయితే, ఈ ఆఫర్ మే 5వ తేదీ నుంచి మే 8వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ సౌండ్ బార్ అమెజాన్ ఇండియా, ఫ్లిప్ కార్ట్ మరియు జెబ్రోనిక్స్ అధికారిక వెబ్సైట్ నుంచి సేల్ కి అందుబాటులోకి తెచ్చింది. Buy From Here

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :