Sound Bar: 10 వేల లోపలే Dolby Atmos సౌండ్ బార్ కోసం చూస్తున్నారా..ఒక లుక్కేయండి.!

HIGHLIGHTS

Sound Bar: 10 వేల లోపలే Dolby Atmos సౌండ్ బార్

ZEBRONICS కొత్తగా ఇండియన్ మార్కెట్ లో విడుదల చేసిన Dolby Atmos సౌండ్ బార్

ZEBRONICS Jukebar 1000 10 వేల బడ్జెట్ కేటగిరిలో మంచి అప్షన్ అవుతుంది

Sound Bar: 10 వేల లోపలే Dolby Atmos సౌండ్ బార్ కోసం చూస్తున్నారా? అయితే, 10 వేల బడ్జెట్ కేటగిరిలో ZEBRONICS కొత్తగా ఇండియన్ మార్కెట్ లో విడుదల చేసిన Dolby Atmos సౌండ్ బార్ ZEBRONICS Jukebar 1000 మంచి అప్షన్ అవుతుంది. జీబ్రానిక్స్ కొత్తగా విడుదల చేసిన ఈ Dolby Atmos సౌండ్ బార్ యొక్క ధర, స్పెక్స్ మరియు ఫీచర్లు ఎలా ఉన్నాయో చూద్దామా.

Dolby Atmos Sound Bar offer

ZEBRONICS Jukebar 1000 సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ ఈ సౌండ్ బార్ పైన 56% డిస్కౌంట్ తో అందించడంతో ఈ సౌండ్ బార్ ఈరోజు కేవలం రూ. 9,999 అఫర్ ధరకే లభిస్తోంది. ఈ సౌండ్ బార్ ను SBI Credit Card EMI అఫర్ తో కొనే వారికి 10% అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here

MOTOROLA Edge 40 Neo: చవక ధరలో Curved 5G Phone లాంచ్ చేసిన మోటోరోలా.!

ZEBRONICS Jukebar 1000 features

ZEBRONICS Jukebar 1000 సౌండ్ బార్ టోటల్ 150W RMS సౌండ్ అందిస్తుంది. ఇందులో, 90W సౌండ్ బార్ అందించ గల సబ్ ఉఫర్ మరియు 60W సౌండ్ అందించ గల బార్ తో వస్తుంది. ఈ జీబ్రానిక్స్ సౌండ్ బార్ HDMI (eARC), 3.5mm AUX, optical IN, BTv5.3 మరియు USB వంటి అన్ని కనక్టివిటీ సపోర్ట్ లను కలిగి వుంది.

 

ఈ Jukebar 1000 సౌండ్ బార్ Dolby Atmos సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో గొప్ప సౌండ్ అందిస్తుందని జీబ్రానిక్స్ తెలిపింది. ఈ సౌండ్ బార్ లో 5.5×8.5cm డ్యూయల్ డ్రైవర్స్ మరియు 5.24 ఇంచ్ సబ్ ఉఫర్ కలిగి గొప్ప బాస్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ wall-mounted సపోర్ట్ తో వస్తుంది మరియు చూడటానికి సన్నగా మరియు అందంగా కనిపిస్తుంది.

ఈ Jukebar 1000 కాంపాక్ట్ డిజైన్ కారణంగా ఎక్కడైనా అమర్చుకోవడానికి చాలా వీలుంగా ఉంటుంది. ఈ సౌండ్ బార్ మీడియం సైజు హల్ ను సైతం సౌండ్ తో అదరగొట్ట గలదని మరియు బడ్జెట్ ధరలో మంచి క్వాలిటీ సౌండ్ అందించగలదని ఇప్పటికే కొనుగోలు చేసిన అమేజాన్ యూజర్లు తమ రివ్యూలలో తెలియ చేశారు.

The Big Billion Days: అప్ కమింగ్ సేల్ ప్రకటించిన Flipkart.!

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :