zebronics 200w 5.1 channel soundbar today available at lowest price
7 వేల రూపాయల బడ్జెట్ ధరలో 200W సౌండ్ అందించే బెస్ట్ సౌండ్ బార్ డీల్ కోసం చూస్తున్న వారికి గుడ్ న్యూస్. తక్కువ ధరలో గొప్ప సౌండ్ అందించే 200W 5.1 ఛానల్ బ్రాండెడ్ Soundbar డీల్ ఒకటి ఈరోజు అందుబాటులో ఉంది. ఈ సౌండ్ బార్ కేవలం 6 వేల బడ్జెట్ లోనే వస్తుంది. అయితే, ఈ సౌండ్ బార్ గొప్ప సౌండ్ అందిస్తుంది.
ZEBRONICS యొక్క ZUKE BAR 7450 PRO 5.1 ఛానల్ సౌండ్ బార్ ఈరోజు 66% డిస్కౌంట్ తో కేవలం రూ. 6,999 ధరకే లభిస్తోంది. అంతేకాదు, HDFC క్రెడిట్ తో ఈ సౌండ్ బార్ కొనుగోలు చేసే వారికి రూ. 699 అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ తో కేవలం రూ. 6,300 రూపాయల అతి తక్కువ ధరకే ఈ సౌండ్ బార్ ను చేసుకోవచ్చు. ఈ సౌండ్ ఆఫర్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుండి అందుబాటులో వుంది.
Also Read: భారీ డిస్కౌంట్ తో 16 వేలకే ధరకే లభిస్తున్న పెద్ద 4K QLED Smart Tv
ఈ సౌండ్ బార్ 5.1 ఛానల్ సెటప్ తో వస్తుంది. ఇందులో 75W సౌండ్ అవుట్ పుట్ అందించే మూడు స్పీకర్లు కలిగిన బార్, ఒక్కొక్కటి 30W సౌండ్ అందించే రెండు రియర్ శాటిలైట్ స్పీకర్లు మరియు మంచి BASS సౌండ్ అందించే సబ్ ఉఫర్ ఉంటాయి.
ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ HDMI Arc, AUX, USB మరియు బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ 6 వేల రూపాయల బడ్జెట్ ధరలో కంప్లీట్ సెటప్ తో వస్తుంది. అయితే, ఈ సౌండ్ బార్ Dolby లేదా DTS వంటి సౌండ్ టెక్నాలాజి సపోర్ట్ కలిగి లేకపోవడం పెద్ద లోటుగా చెప్పవచ్చు. అయితే, మంచి మ్యూజిక్ మరియు సరౌండ్ సౌండ్ సినిమా ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది.