truke launches Buds Infinity earbuds with 16mm titanium drivers
ప్రముఖ జర్మన్ ఆరిజిన్ ఎలక్ట్రానిక్ బ్రాండ్ Truke ఈరోజు ఇండియాలో కొత్త బడ్స్ లాంచ్ చేసింది. సాంప్రదాయ 10mm మరియు 12mm స్పీకర్ల పరిధిని దాటి పెద్ద 16mm టైటానియం స్పీకర్లతో ఈ కొత్త బడ్స్ ను లాంచ్ చేసింది. ట్రూక్ ఈ బడ్స్ ను Buds Infinity పేరుతో లాంచ్ చేసింది. ఈ ట్రూక్ లేటెస్ట్ బడ్స్ సరికొత్త అవుట్ ఫిట్ మరియు డిజైన్ తో కూడా ఉంటాయి. ట్రూక్ ఇండియాలో సరికొత్తగా విడుదల చేసిన ఈ లేటెస్ట్ బడ్స్ ధర మరియు పూర్తి వివరాలు తెలుసుకుందామా.
ట్రూక్ తన పోర్ట్ఫోలియోలో గత సంవత్సరం అందించిన ఓపెన్ వైర్లెస్ స్టీరియో (OWS) సిరీస్ నుంచి ఈ కొత్త బడ్స్ లాంచ్ చేసింది. ఈ బడ్స్ ను 16mm టైటానియం స్పీకర్లతో అందించింది. ఈ బడ్స్ ఈ సిరీస్ లో ముందుగా వచ్చిన బడ్స్ మాదిరిగా అదే అవుట్ ఫిట్ తో వస్తుంది. అంటే, ఈ బడ్స్ చెవుల వెనుక గా తగిలించే విధంగా ఉంటాయి. ఇది చెవుల కెనాల్ లో ఇరికించే బడ్స్ మాదిరిగా కాకుండా ఓపెన్ సౌండ్ అందిస్తుంది.
ఈ ట్రూక్ కొత్త బడ్స్ లో మంచి కాలింగ్ కోసం ENC క్వాడ్ మైక్ MEMS మైక్ సపోర్ట్ ఉంటుంది. ఈ కొత్త బడ్స్ తో మంచి క్వాలిటీ కాలింగ్ ఎక్స్ పీరియన్స్ చూడవచ్చని ట్రూక్ చెబుతోంది. కనెక్టివిటీ కోసం ఇందులో లేటెస్ట్ బ్లూటూత్ వెర్షన్ 5.4 మరియు డ్యూయల్ డివైజ్ పైరింగ్ ఫీచర్ కూడా అందించింది. ఈ ఫీచర్స్ తో అంతరాయం లేని కనెక్టివిటీ మరియు రెండు డివైజెస్ మద్య స్విఫ్ట్ అయ్యే అవకాశం అందించింది.
ట్రూక్ బడ్స్ ఇన్ఫినిటీ టోటల్ 70 గంటలు ప్లే టైమ్ ఆఫర్ చేస్తుందని కంపెనీ తెలిపింది. అంతేకాదు, ఈ బడ్స్ కేవలం 10 నిమిషాల ఛార్జింగ్ తో 10 గంటల ప్లేబ్యాక్ అందించే ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుందిట. ఈ బడ్స్ IPX5 చెమట మరియు వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుంది. ఈ బడ్స్ పూర్తిగా ఒక సంవత్సరం వారంటీ కలిగి ఉంటాయి.
Also Read: అండర్ రూ. 3000 బడ్జెట్ లో బెస్ట్ Soundbar Deal కోసం చెక్ చేస్తున్నారా.!
ట్రూక్ బడ్స్ ఇన్ఫినిటీ ప్రైస్ ఇంకా రివీల్ చేయలేదు. ఈ బడ్స్ ని అమెజాన్ ఇండియా నుంచి లాంచ్ చేసింది మరియు ఈ బడ్స్ యొక్క కంప్లీట్ స్పెసిఫికేషన్స్ మరియు ఫీచర్స్ వెల్లడించింది. అయితే, ఈ పీజీ నుంచి ఈ బడ్స్ ప్రైస్ మాత్రం ఇంకా వెల్లడించలేదు. కానీ, ఈ బడ్స్ జూన్ 12వ తేదీ నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తాయని మరియు వీటి ధర కూడా అదే రోజు ప్రకటిస్తుందని ట్రూక్ తెలిపింది.