కేవలం ఇయర్ బడ్స్ ధరకే Dolby Atmos సౌండ్ బార్ అందుకోండి.!

HIGHLIGHTS

కేవలం ఇయర్ బడ్స్ ధరకే Dolby Atmos సౌండ్ బార్ అందుకోవచ్చు

ఇదేదో చిన్నగా ఉండే సౌండ్ బార్ అనుకుంటే మాత్రం మీరు పొరబడినట్టే

ఇది సబ్ ఉఫర్ మరియు అప్ ఫైరింగ్ స్పీకర్ సమేతంగా వచ్చే డాల్బీ సౌండ్ బార్

కేవలం ఇయర్ బడ్స్ ధరకే Dolby Atmos సౌండ్ బార్ అందుకోవచ్చు. ఇదేదో చిన్నగా ఉండే సౌండ్ బార్ అనుకుంటే మాత్రం మీరు పొరబడినట్టే. ఎందుకంటే, ఈ సౌండ్ బార్ సబ్ ఉఫర్ మరియు అప్ ఫైరింగ్ స్పీకర్ సమేతంగా వచ్చే డాల్బీ సౌండ్ బార్. అంతేకాదు, ఈ సౌండ్ బార్ 400W సౌండ్ అవుట్ పుట్ తో ఇంటిని షేక్ చేసే గొప్ప బాస్ సౌండ్ అందిస్తుంది. ఈరోజు అందుబాటులో ఉన్న ఈ బెస్ట్ సౌండ్ బార్ డీల్ ఏమిటో ఒక లుక్కేద్దామా.

ఏమిటి ఈ Dolby Atmos సౌండ్ బార్ డీల్?

GOVO ఇండియాలో గత సంవత్సరం అందించిన 2.1.2 ఛానల్ సౌండ్ బార్ GOSURROUND 975 ఈరోజు ఈ బడ్జెట్ ధరలో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ ఈరోజు 73% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 7,999 ఆఫర్ ధరలో లిస్ట్ అయ్యింది. ఇది కాకుండా ఈ సౌండ్ బార్ పై BOB VISA డెబిట్ కార్డు 10% అదనపు డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 7,199 రూపాయల డిస్కౌంట్ ధరలో మీకు లభిస్తుంది.

వాస్తవానికి, ఒక ప్రీమియం ఇయర్ బడ్స్ కొనాలంటే ఈ రోజుల్లో కనీసం 6 నుంచి 8 వేల రూపాయలైనా ఖర్చు చేయాల్సి వస్తుంది. అటువంటిది కేవలం రూ. 7,199 రూపాయల ధరలోనే మీరు ఈ సౌండ్ బార్ ను మీ సొంతం చేసుకోవచ్చు. Buy From Here

Also Read: Samsung Galaxy Unpacked 2026: కొత్త స్మార్ట్ ఫోన్స్ లాంచ్ ఈవెంట్ డేట్ అనౌన్స్.!

GOVO Dolby Atmos సౌండ్ బార్ : ఫీచర్స్

ఇది 2.1.1 ఛానల్ తో గోవా అందించిన సౌండ్ బార్ మరియు ఈ సౌండ్ బార్ టోటల్ 400W సౌండ్ అవుట్ పుట్ తో వస్తుంది. ఇందులో ఒక బార్ మరియు ఒక సబ్ ఉఫర్ ఉంటాయి. ఈ సౌండ్ బార్ తో వచ్చే బార్ లో ముందు రెండు స్పీకర్లు మరియు పైన రెండు అప్ ఫైరింగ్ స్పీకర్లు ఉంటాయి. అలాగే, ఈ సౌండ్ బార్ తో వచ్చే సబ్ ఉఫర్ లో 6.5 ఇంచ్ ఉఫర్ ఉంటుంది మరియు ఇది డీప్ బాస్ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ బాస్ మరియు ట్రబుల్ సరి చేసే స్టైలిష్ రిమోట్ కలిగి ఉంటుంది.

ఇక సౌండ్ టెక్నాలజి విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ లో డాల్బీ అట్మాస్ సౌండ్ టెక్నాలజీ ఉంది. ఈ సౌండ్ టెక్నాలజీతో ఈ సౌండ్ బార్ మంచి సరౌండ్ సౌండ్ ఆఫర్ చేస్తుంది. బ్లూటూత్, USB, HDMI Arc మరియు ఆప్టికల్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు ఈ సౌండ్ బార్ లో ఉన్నాయి.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :