todays best budget 5.1.2 Dolby Atmos soundbar deal is here
డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ కొనాలంటే ఒకప్పుడు 30 వేల రూపాయల కంటే ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి వచ్చేది. అయితే, నేడు 20 వేల రూపాయల కంటే తక్కువ ధరలోనే మంచి సౌండ్ బార్ లు లభిస్తున్నాయి. అయితే, ఈ రోజు మరింత గొప్ప డిస్కౌంట్ తో అతి చవక ధరలో లభిస్తున్న 5.1.2 Dolby Atmos సౌండ్ బార్ డీల్ ఒకటి ఉంది. ఈ సౌండ్ పై అందుబాటులో ఉన్న ఆఫర్స్ అన్ని అందుకుంటే, ఈ సౌండ్ బార్ ను కేవలం 9 వేల రూపాయల ఆఫర్ ధరలోనే అందుకోవచ్చు.
Boat ఇటీవల అందించి డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ Aavante Prime 5.1.2 5050DA ఈరోజు మంచి డిస్కౌంట్ ఆఫర్స్ తో ఫ్లిప్ కార్ట్ నుంచి లభిస్తుంది. ఈ సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి 78% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 10,999 రూపాయల ఆఫర్ ధరలో సేల్ అవుతుంది.
ఈ సౌండ్ బార్ పై రూ. 1,100 రూపాయల అదనపు Kotak బ్యాంక్ క్రెడిట్ కార్డు డిస్కౌంట్ ఆఫర్ ను కూడా ఫ్లిప్ కార్ట్ అందించింది. ఈ రెండు ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ ను కేవలం రూ. 9,899 రూపాయల అతి చవక ధరలో మీ సొంతం చేసుకోవచ్చు. ఈ ప్రైస్ లో ఈ బోట్ సౌండ్ బార్ ఆకట్టుకునే ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.
Also Read: APPLE iPhone 17 పై బిగ్ డీల్స్ అనౌన్స్ చేసిన ఫ్లిప్ కార్ట్.. భారీ డిస్కౌంట్ అందుకోండి.!
ఇది బోట్ గత సంవత్సరం అందించిన 5.1.2 ఛానల్ డాల్బీ అట్మాస్ సౌండ్ బార్. ఇందులో ముందు నాలుగు స్పీకర్లు మరియు రెండు ట్వీట్లు మరియు పైన రెండు అప్ ఫైరింగ్ స్పీకర్లు కలిగిన ప్రీమియం బార్ ఉంటుంది. అలాగే, డ్యూయల్ శాటిలైట్ స్పీకర్ మరియు సబ్ ఉఫర్ కూడా ఈ సౌండ్ బార్ సెటప్ లో ఉంటాయి.
ఈ సౌండ్ బార్ డాల్బీ అట్మాస్ సౌండ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ కలిగిన పూర్తి స్పీకర్ సెటప్ తో 550W అందిస్తుంది. టోటల్ గా ఇది మంచి సరౌండ్ సౌండ్ మరియు బాస్ ను అందించింది. ఇందులో HDMI Arc, USB, ఆప్టికల్ AUX మరియు బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ కూడా ఉన్నాయి.
ఈ రోజు ఈ సౌండ్ బార్ లభిస్తున్న ఆఫర్ ధరలో అతి చవక ధరలో లభించే ఏకైక 5.1.2 డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ గా నిలుస్తుంది.