కేవలం ఇయర్ బడ్స్ ధరలోనే Dolby Audio సౌండ్ బార్ పొందండి.!

Updated on 23-Feb-2026
HIGHLIGHTS

సౌండ్ బార్స్ చాలా చవక ధరలో లభిస్తున్నాయి

ఇయర్ బడ్స్ ధరలోనే Dolby Audio సౌండ్ బార్

బెస్ట్ డాల్బీ సౌండ్ బార్ డీల్ ను ఈరోజు ఇక్కడ అందించాను

ఒకప్పుడు ఒక డాల్బీ ఆడియో సౌండ్ బార్ కొనుగోలు చేయాలంటే 10 వేల రూపాయల కంటే ఎక్కువ మొత్తం సమర్పించు కోవలసిన పరిస్థితి ఉండేది. అయితే, ఇప్పుడు రోజులు మారాయి మరియు సౌండ్ బార్స్ చాలా చవక ధరలో లభిస్తున్నాయి. ఎంత చవక ధరకు అంటే కేవలం ఇయర్ బడ్స్ ధరలోనే Dolby Audio సౌండ్ బార్ అందుకునేంత చవక ధరకు సౌండ్ బార్ ధరలు పడిపోయాయి. అటువంటి డీల్స్ లో బెస్ట్ డాల్బీ సౌండ్ బార్ డీల్ ను ఈరోజు ఇక్కడ అందించాను.

Dolby Audio సౌండ్ బార్

బోట్ ఇండియాలో రీసెంట్ గా విడుదల చేసిన 2.1 ఛానల్ డాల్బీ ఆడియో సౌండ్ బార్ Aavante 2.1 1600D లేదా Orion Plus మోడల్ ఈ రోజు బెస్ట్ ధరలో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ ఇండియా నుంచి 73% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 5,999 ఆఫర్ ధరలో సేల్ అవుతోంది. ఇది కాకుండా ఈ సౌండ్ బార్ పై రూ. 599 రూపాయల SBI క్రెడిట్ కార్డు డిస్కౌంట్ ఆఫర్ మరియు రూ. 500 రూపాయల కూపన్ డిస్కౌంట్ ఆఫర్లను కూడా అమెజాన్ అందించింది.

పైన తెలిపిన మూడు డిస్కౌంట్ ఆఫర్స్ తో ఈ బోట్ సౌండ్ బార్ ని కేవలం రూ. 4,900 రూపాయల అతి తక్కువ ధరలో అమెజాన్ నుంచి అందుకునే అవకాశం అమెజాన్ అందించింది. ఒక మంచి ఇయర్ బడ్స్ ను అందుకోవాలంటే కనీసం 5 వేల రూపాయలైనా ఖర్చు చేయాల్సి వస్తుంది. అయితే, అదే ధరలో హెవీ బాస్ మరియు డాల్బీ ఆడియో సపోర్ట్ కలిగిన ఈ బోట్ సౌండ్ బార్ ను పొందవచ్చు. Buy From Here

Also Read: Motorola Edge 70 Fusion ఇండియా లాంచ్ మరియు ఫీచర్స్ అనౌన్స్ చేసిన మోటోరోలా.!

Boat Dolby Audio సౌండ్ బార్: ఫీచర్స్

ఈ బోట్ సౌండ్ బార్ 2.1 ఛానల్ సెటప్ కలిగి ఉంటుంది మరియు ఇది మంచి స్లీక్ డిజైన్ తో ఆకట్టుకుంటుంది. ఈ సౌండ్ బార్ సెటప్ లో రెండు స్పీకర్లు కలిగిన ప్రీమియం బార్ మరియు సబ్ ఉఫర్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ కలిగిన టోటల్ సెటప్ తో 160W జబర్దస్త్ బోట్ సిగ్నేచర్ సౌండ్ ఆఫర్ చేస్తుంది.

ఈ సౌండ్ బార్ డాల్బీ ఆడియో సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి ఉంటుంది.ఈ సౌండ్ బార్ Music, Movies, News, మరియు 3D వంటి నాలుగు సౌండ్ మోడ్స్ తో కూడా వస్తుంది. ఈ బోట్ సౌండ్ బార్ AUX, USB, HDMI Arc, ఆప్టికల్ ఇన్ మరియు బ్లూటూత్ వెర్షన్ 5.4 కనెక్టివిటీ వంటి ఫీచర్లు కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ చవక ధరలో గొప్ప సౌండ్ అందించే సౌండ్ బార్ లలో ఒకటిగా ఉంటుంది. ఇది అమెజాన్ యూజర్ల నుంచి 4 స్టార్ రేటింగ్ మరియు మంచి రివ్యూలు కూడా అందుకుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :