Realme Buds T500 Pro launching with new stylish look and LHDC like features
Realme Buds T500 Pro ఇయర్ బడ్స్ ను కొత్త స్టైలిష్ లుక్ అండ్ LHDC వంటి ప్రీమియం ఫీచర్స్ తో లాంచ్ చేయబోతున్నట్లు రియల్ మీ అనౌన్స్ చేసింది. ఈ అప్ కమింగ్ ఇయర్ బడ్స్ చాలా స్లీక్ అండ్ అట్రాక్టివ్ క్యాండీ బాక్స్ డిజైన్ తో వస్తుంది. ఈ ఫోన్ 50dB యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్ వంటి మరిన్ని ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. మరి రియల్ మీ లాంచ్ చేయబోతున్న ఈ అప్ కమింగ్ ఇయర్ బడ్స్ లాంచ్ డేట్ అండ్ ఫీచర్స్ ఏమిటో చూద్దామా.
రియల్ మీ బడ్స్ టి 500 ప్రో ఇయర్ బడ్స్ ను ఏప్రిల్ 16వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ అనౌన్స్ చేసింది. ఈ బడ్స్ అమెజాన్ ఇండియా ద్వారా టీజింగ్ చేయబడుతున్నాయి. అంటే, లాంచ్ తర్వాత ఈ ఇయర్ బడ్స్ అమెజాన్ నుంచి సేల్ అవుతాయి.
రియల్ మీ బడ్స్ టి 500 ప్రో ఇయర్ బడ్స్ సరికొత్త క్యాండీ బాక్స్ డిజైన్ తో లాంచ్ అవుతుంది. ఇది చాలా స్లీక్ అండ్ కాంపాక్ట్ డిజైన్ లో చాలా స్టైలిష్ గా ఉంటుంది. ఈ ఇయర్ బడ్స్ 12.4mm హై రిజల్యూషన్ స్పీకర్లు కలిగి ఉంటుంది. ఈ బడ్స్ 50dB ఫ్లాగ్ షిప్ ANC (నోయిస్ క్యాన్సిలేషన్) కలిగి ఉంటుంది. ఇది డీప్ బాస్ సౌండ్ మరియు నోయిస్ క్యాన్సిలేషన్ తో చాలా సైలెంట్ ఫీల్ అందిస్తుందని రియల్ మీ తెలిపింది.
ఈ బడ్స్ ఆడియో ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ ఇయర్ బడ్స్ Hi-Res Audio వైర్లెస్ మరియు LHDC 5.0 సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఇయర్ బడ్స్ 6 మైక్ సిస్టంతో మంచి కాలింగ్ సపోర్ట్ కూడా అందిస్తుందిట. ఈ బడ్స్ Next Ai తో ఫేస్ టు పేస్ ట్రాన్స్ లేషన్ ఫీచర్ కూడా కలిగి ఉంటుంది. ఈ బడ్స్ లేటెస్ట్ బ్లూటూత్ వెర్షన్ 6.1 కనెక్టివిటీ తో వస్తుంది. అంతేకాదు, ఈ బడ్స్ 56 గంటల ప్లే బ్యాక్ అందించే బిగ్ బ్యాటరీ కూడా కలిగి ఉంటుంది.
Also Read: అద్భుతమైన ఆఫర్: కేవలం 20 వేల ధరలోనే 55 ఇంచ్ 4K Smart Tv అందుకోండి.!
ఇక ఈ ఇయర్ బడ్స్ ఇతర ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ బడ్స్ 45 ms చాలా తక్కువ జాప్యం (Low Latency) ఫీచర్ కూడా ఉంది. ఈ బడ్స్ ను లెమన్ కోలా, ఆరెంజ్ మింట్ మరియు చాకొలేట్ వంటి సరికొత్త కలర్ ఆప్షన్స్ లో లాంచ్ అవుతుంది.