Realme Buds Air 8 with dual drivers and LHDC like premium features launched
Realme Buds Air 8: రియల్‌మీ నిన్న నిర్వహించిన పెద్ద లాంచ్ ఈవెంట్ నుంచి రియల్‌మీ 16 ప్రో సిరీస్ స్మార్ట్ ఫోన్ లతో పాటు రియల్‌మీ బడ్స్ ఎయిర్ 8 ఇయర్ బడ్స్ కూడా విడుదల చేసింది. ఈ బడ్స్ ను బడ్జెట్ ధరలో డ్యూయల్ స్పీకర్ మరియు LHDC వంటి ప్రీమియం ఫీచర్స్ తో లాంచ్ చేసింది. రియల్‌మీ సరికొత్తగా ఇండియన్ మార్కెట్ లో విడుదల చేసిన ఈ ఇయర్ బడ్స్ ధర మరియు ఫీచర్స్ వంటి పూర్తి వివరాలు తెలుసుకోండి.
రియల్‌మీ బడ్స్ ఎయిర్ 8 ఇయర్ బడ్స్ ను కేవలం రూ. 3,999 రూపాయలు ప్రైస్ ట్యాగ్ తో ఇండియాలో విడుదల చేసింది. ఈ కొత్త ఇయర్ బడ్స్ ను రియల్‌మీ 16 సిరీస్ ఫోన్లు అందించిన అదే మూడు రంగుల్లో అందించింది. ఈ బడ్స్ మాస్టర్ గోల్డ్, మాస్టర్ గ్రే మరియు మాస్టర్ పర్పల్ మూడు రంగుల్లో లభిస్తుంది. జనవరి 16వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఈ బడ్స్ ఫస్ట్ సేల్ మొదలువుతుంది.
రియల్‌మీ ఈ కొత్త బడ్స్ ను డ్యూయల్ డ్రైవర్ సెటప్ తో అందించింది. ఇందులో ఉఫర్ మరియు ట్వీటర్ స్పీకర్లు ఉంటాయి. రియల్‌మీ ఈ బడ్స్ లో 11mm హై ప్యూరిటీ డైఫాగ్రామ్ ఉఫర్ మరియు N52 మ్యాగ్నెట్ కలిగిన 6mm ట్వీటర్ ను అందించింది. ఈ సెటప్ తో మంచి బాస్ మరియు అదే సమయంలో గొప్ప ట్రెబుల్ సౌండ్ కూడా ఈ బడ్స్ ఆఫర్ చేస్తాయి. ఈ బడ్స్ ను సరికొత్త డైమండ్ లాంటి డిజైన్ తో అందించింది మరియు ఇది ఆర్గానిక్ సిలికాన్ లాంటి మెటీరియల్ తో కూడా అందించింది.
ఈ బడ్స్ డ్యూయల్ సర్టిఫైడ్ ఆడియో క్వాలిటీ తో వస్తుంది. అంటే, ఇందులో LHDC 5.0 హై ఫెడిలిటీ ట్రాన్సిషన్ మరియు Hi-Res Audio వైర్లెస్ రెండు సర్టిఫికేషన్ తో ఈ బడ్స్ వచ్చింది. ఇది హై క్వాలిటీ సౌండ్ కోసం ట్యూన్ చేయబడింది మరియు గొప్ప సౌండ్ అందిస్తుంది. అంతేకాదు, ఈ బడ్స్ ను సెల్ఫ్ డెవలప్డ్ నెక్స్ట్ అల్గారిథం తో అందించినట్లు రియల్‌మీ తెలిపింది. ఇది థ్రిల్ బాస్ సౌండ్ తో గొప్ప సౌండ్ అందించడానికి తగిన విధంగా ఉంటుందని కూడా రియల్‌మీ తెలిపింది.
ఇక ఈ బడ్స్ కలిగిన ఇతర ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ బడ్స్ 3D స్పేషియల్ ఆడియో మరియు డైనమిక్ ఆడియో సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ బడ్స్ 55dB అల్ట్రా డెప్త్ నోయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ కూడా వుంది. ఈ ఫీచర్ తో ఈ బడ్స్ బయటి శబ్దాలు పూర్తిగా తగ్గించి ప్యూర్ సౌండ్ అందిస్తుంది. అంతేకాదు, ఈ బడ్స్ లో ఉన్న 6 మైక్ డీప్ నోయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ తో గొప్ప కాలింగ్ అందుకోవచ్చని కూడా రియల్‌మీ తెలిపింది. ఇందులో AI ట్రాన్స్లేషన్ మరియు AI ఫేస్ టు ఫేస్ వంటి మరిన్ని గొప్ప AI ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.
Also Read: Price Cut: బోట్ 5.2.4 Dolby Atmos సౌండ్ బార్ ఆల్ టైమ్ చవక ధరలో లభిస్తోంది.!
ఈ ఇయర్ బడ్స్ ఏకంగా 58 గంటల ప్లే బ్యాక్ ఆఫర్ చేస్తుంది. ఇది IP55 రేటింగ్ తో డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ గా కూడా ఉంటుంది. ఇందులో 45 ms అల్ట్రా లో లెటెన్సీ మరియు స్విఫ్ట్ పెయిర్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఈ రియల్‌మీ కొత్త ఇయర్ బడ్స్ 3 డివైజ్ కనెక్షన్ ఫీచర్ తో ఆకట్టుకుంటుంది.