Realme Buds Air 8 first sale starts from afternoon
Realme Buds Air 8: రియల్‌మీ బడ్జెట్ పవర్ ఫుల్ ఇయర్ బడ్స్ ఫస్ట్ సేల్ రేపు స్టార్ట్ అవుతుంది. రీసెంట్ గా ఈ కొత్త ఇయర్ బడ్స్ ను రియల్‌మీ 16 ప్రో స్మార్ట్ ఫోన్స్ తో పాటు రిలీజ్ చేసింది. డ్యూయల్ డ్రైవర్ సెటప్ మరియు LHDC వంటి ప్రీమియం ఫీచర్స్ తో ఈ బడ్స్ ను ఇండియాలో విడుదల చేసింది. ఈ కొత్త ఇయర్ బడ్స్ లాంచ్ కంటే ముందు ఈ బడ్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి.
రియల్‌మీ బడ్స్ ఎయిర్ 8 ఇయర్ బడ్స్ ను రూ. 3,799 ప్రైస్ ట్యాగ్ తో ఇండియాలో విడుదల చేసింది. ఈ ఇయర్ బడ్స్ మాస్టర్ గ్రే, మాస్టర్ గోల్డ్ మరియు మాస్టర్ పర్పల్ మూడు కలర్ ఆప్షన్స్ లో లభిస్తాయి. రేపు మధ్యాహ్నం, అనగా 2026 జనవరి 16వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ కొత్త ఇయర్ బడ్స్ సేల్ ప్రారంభం అవుతుంది. ఈ బడ్స్ పై రూ. 200 రూపాయల ఇన్స్టాంట్ డిస్కౌంట్ ను కంపెనీ అనౌన్స్ చేసింది. ఈ ఆఫర్ తో రియల్‌మీ బడ్స్ 8 ఇయర్ బడ్స్ కేవలం రూ. 3,599 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తాయి.
రియల్‌మీ బడ్స్ ఎయిర్ 8 ఇయర్ బడ్స్ డ్యూయల్ డ్రైవర్, అంటే రెం రెండు స్పీకర్ సెటప్ కలిగి ఉంటుంది. ఈ చిన్న బడ్స్ లో గొప్ప బాస్ సౌండ్ అందించే 11 mm ఉఫర్ మరియు మంచి ట్రెబుల్ అందించే ట్వీటర్ స్పీకర్ ఉంటాయి. ఈ 11mm ఉఫర్ హై ప్యూరిటీ డైఫాగ్రామ్ కలిగి ఉంటే, 6mm ట్వీటర్ N52 మ్యాగ్నెట్ కలిగి ఉంటుంది. అందుకే ఇందులో రిచ్ బాస్ మరియు ప్యూర్ ట్రెబుల్ సౌండ్ ఆశించవచ్చు. ఇక ఈ బడ్స్ బాక్స్ డిజైన్ విషయానికి వస్తే, ఈ బడ్స్ ను సరికొత్త డైమండ్ షేప్ డిజైన్ తో బాడీతో అందించింది. ఇది ఇయర్ బడ్స్ బాక్స్ ఆర్గానిక్ సిలికాన్ వంటి ప్రీమియం మెటీరియల్ తో ఉంటుంది.
ఈ బడ్స్ డ్యూయల్ స్పీకర్ సెటప్ తో పాటు సర్టిఫైడ్ ఆడియో తో వస్తుంది. ఈ బడ్స్ లో LHDC 5.0 హై ఫెడిలిటీ ట్రాన్సిషన్ తో పాటు Hi-Res Audio వైర్లెస్ రెండు ఆడియో సర్టిఫికేషన్ ఉన్నాయి. ఈ ఫీచర్స్ తో ఈ బడ్స్ గొప్ప సౌండ్ అందిస్తుంది. ఈ బడ్స్ లో సెల్ఫ్ డెవలప్డ్ నెక్స్ట్ అల్గారిథం ఉన్నట్లు కూడా రియల్‌మీ చెప్పింది. బడ్స్ ఎయిర్ 8 ఇయర్ బడ్స్ 3D స్పేషియల్ ఆడియో తో పాటు డైనమిక్ ఆడియో సపోర్ట్ తో కూడా వస్తుంది. ఇది 55dB అల్ట్రా డెప్త్ నోయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ తో కూడా వస్తుంది.
Also Read: Garmin Quatix 8 Pro: శాటిలైట్ SOS వంటి ప్రీమియం ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది.!
ఈ బడ్స్ లో మంచి కాలింగ్ కోసం 6 మైక్ డీప్ నోయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ అందించింది. అంతేకాదు, AI ట్రాన్స్లేషన్ మరియు AI ఫేస్ టు ఫేస్ వంటి మరిన్ని AI ఫీచర్స్ కూడా ఈ బడ్స్ లో ఉన్నాయి. ఈ బడ్స్ 58 గంటల ప్లే బ్యాక్ అందించే బ్యాటరీ సెటప్ మరియు IP55 రేటింగ్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్ ఉన్నాయి.