ట్రాన్స్పరెంట్ TWS Earbuds ను విడుదల చేసిన Promate బ్రాండ్.!

HIGHLIGHTS

Promate ఈరోజు కొత్త ట్రాన్స్పరెంట్ TWS Earbuds ను విడుదల చేసింది

ఆకర్షించే ట్రాన్స్పరెంట్ డిజైన్ మరియు సరికొత్త కలర్ ఆప్షన్ లతో తీసుకు వచ్చింది

Black, Blue, Pink, మరియు White నాలుగు కలర్ ఆప్షన్ లలో విడుదల

తైవాన్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ Promate ఈరోజు కొత్త ట్రాన్స్పరెంట్ TWS Earbuds ను విడుదల చేసింది. ఈ కొత్త బడ్స్ ను యూత్ ని ఆకర్షించే ట్రాన్స్పరెంట్ డిజైన్ మరియు సరికొత్త కలర్ ఆప్షన్ లతో తీసుకు వచ్చింది. ఈ కొత్త బడ్స్ ను కేవలం డిజైన్ పరంగా మాత్రమే కాకుండా, ఆకట్టుకునే ఫీచర్స్ తో కూడా తీసుకు వచ్చినట్లు తెలిపింది. ఈ కొత్త బడ్స్ ధర మరియు ఫీచర్లు ఎలా ఉన్నాయో చూద్దామా.

Promate TWS Earbuds

ప్రోమేట్ ఈరోజు TransPod పేరుతో సరికొత్త ట్రాన్స్పరెంట్ TWS ఇయర్ బడ్స్ ను ఇండియన్ మార్కెట్ లో విడుదల చేసింది. ఈ ఇయర్ బడ్స్ ను Rs.1,999 ధరతో 24 నెలల వారెంటీతో అందించింది. ఈ కొత్త బడ్స్ ను Black, Blue, Pink, మరియు White మొత్తం నాలుగు కలర్ ఆప్షన్ లలో విడుదల చేసింది. ఈ బడ్స్ ను ఈరోజు నుండి Amazon India ద్వారా సేల్ కి అందుబాటులోకి కూడా తీసుకు వచ్చింది. Buy From Here

Also Read: QLED Smart Tv Deals: భారీ డిస్కౌంట్ తో తక్కువ ధరకే లభిస్తున్న పెద్ద స్మార్ట్ టీవీలు.!

Promate TransPod TWS Earbuds: ఫీచర్స్

ప్రోమేట్ ఈ కొత్త ట్రాన్స్పరెంట్ ట్రూ వైర్లెస్ ఇయర్ బడ్స్ ను IntelliTouch తో అందించింది. ఈ ఇయర్ బడ్స్ కంఫర్టబుల్ డిజైన్ తో స్నగ్ ఫిట్ తో వస్తాయని కంపెనీ తెలిపింది. ఈ ఇయర్ బడ్స్ 13mm dynamic స్పీకర్స్ తో మంచి BASS సౌండ్ తో పాటు క్రిస్టల్ క్లియర్ హై నోట్స్ ను కూడా అందిస్తుందని ప్రోమేట్ గొప్పగా చెబుతోంది.

Promate TWS Earbuds

ఇక ఈ ఇయర్ బడ్స్ బ్యాటరీ మరియు కనెక్టివిటీ విషయానికి వస్తే, ఈ బడ్స్ బ్లూటూత్ 5.3 సపోర్ట్ తో అంతరాయం లేని కనెక్టివిటీని అందిస్తుంది. అలాగే, ఈ బడ్స్ Active Noise Cancellation (ANC) సపోర్ట్ తో గొప్ప మ్యూజిక్ మరియు కాలింగ్ సౌకర్యాన్ని కూడా అందిస్తుంది. ఈ బడ్స్ 350mAh బ్యాటరీతో 50 స్టాండ్ బై మరియు 26 గంటల టోటల్ ప్లే టైమ్ ను అందిస్తుందని కంపెనీ తెలిపింది.

ఈ ప్రోమేట్ ట్రాన్స్ పాడ్ ఇయర్ బడ్స్ స్టైల్ మరియు పెర్ఫార్మెన్స్ కలయికతో సరసమైన ధరలో వస్తుందని కంపెనీ తెలిపింది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :