OPPO Enco X3s ఇయర్ బడ్స్ ని Dynaudio వంటి ప్రీమియం ఫీచర్స్ తో లాంచ్ చేసింది.!

Updated on 29-Oct-2025
HIGHLIGHTS

OPPO Enco X3s ఇయర్ బడ్స్ గ్లోబల్ మార్కెట్ లో లాంచ్ అయ్యాయి

నిన్న విడుదల చేసిన ఒప్పో ఫైండ్ X9 సిరీస్ తో ఈ ఇయర్ బడ్స్ ని కూడా విడుదల చేసింది

ఈ కొత్త ఇయర్ బడ్స్ ని Dynaudio సౌండ్ మరియు LHDC 5.0 సపోర్ట్ తో లాంచ్ చేసింది

OPPO Enco X3s ఇయర్ బడ్స్ గ్లోబల్ మార్కెట్ లో లాంచ్ అయ్యాయి. నిన్న విడుదల చేసిన ఒప్పో ఫైండ్ X9 సిరీస్ తో ఈ ఇయర్ బడ్స్ ని కూడా విడుదల చేసింది. ఈ కొత్త ఇయర్ బడ్స్ ని Dynaudio సౌండ్, LHDC 5.0 సపోర్ట్ మరియు 55dB యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్ వంటి మరియు మరిన్ని ప్రీమియం ఫీచర్స్ తో అందించింది.

OPPO Enco X3s : ఫీచర్స్

ఒప్పో ఈ కొత్త బడ్స్ ని చాలా ప్రీమియం డిజైన్ తో అందించింది. ఈ ఇయర్ బడ్స్ ని ఓవెల్ షేప్ డిజైన్ కలిగిన బాక్స్ తో అందించింది మరియు ఈ బడ్స్ కేవలం 4.7 గ్రాముల బరువుతో చాలా కంఫర్ట్ ఫిట్ తో ఉంటాయి. ఈ బడ్స్ లో 11mm ఉఫర్ మరియు 6mm ఫ్లాట్ డైఫా గ్రామ్ ట్వీటర్ కలిగిన డ్యూయల్ స్పీకర్లు ఉంటాయి. ఇది గోల్డెన్ సౌండ్ 2.0 మరియు ఒప్పో అలైవ్ ఆడియో తో గొప్ప సౌండ్ అందిస్తుందని ఒప్పో తెలిపింది.

ఈ కొత్త ఇయర్ బడ్స్ LHDC 5.0 మరియు Hi-Res ఆడియో సర్టిఫికేషన్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫీచర్ తో గొప్ప హై రెజల్యూషన్ ఆడియో ఆఫర్ చేస్తుంది. ఇది 55dB ANC (యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్) సపోర్ట్ తో 5500Hz అల్ట్రా వైడ్ ఫ్రీక్వెన్సీ రేంజ్ తో వస్తుంది. ఇది బయట నుంచి వచ్చే అవసరం లేని శబ్దాలను పూర్తిగా నిలువరిస్తుంది. అంతేకాదు, ఇది రియల్ టైమ్ Dynamic ANC ఆఫర్ చేస్తుంది. అంతేకాదు, ఈ బడ్స్ ని ప్రపంచ ప్రఖ్యాత ఆడియో ప్రొడక్ట్స్ తయారీ దిగ్గజం డైన్ ఆడియో తో ట్యూన్ చేసి అందించింది.

కాలింగ్ కోసం ఈ ఒప్పో లేటెస్ట్ ఇయర్ బడ్స్ లో ఒక్కొక్కదానిలో 3 మైక్స్ చొప్పున మొత్తం ఆరు మైక్స్ ఉంటాయి. ఇది గొప్ప క్లియర్ కాలింగ్ ఆఫర్ చేస్తుందని ఒప్పో తెలిపింది. ఇది మాత్రమే కాదు, ఈ ఇయర్ బడ్స్ AI Clear కాలింగ్ తో సుపీరియర్ క్వాలిటీ కాలింగ్ అందిస్తుంది. అంతేకాదు, ఈ ఒప్పో కొత్త ఇయర్ బడ్స్ AI Translate ఫీచర్ తో కూడా వస్తుంది. ఈ బడ్స్ టోటల్ 45 గంటల ప్లే టైమ్ అందించే బ్యాటరీ కలిగి ఉంటుంది. కనెక్టివిటీ పరంగా, ఈ బడ్స్ లేటెస్ట్ బ్లూటూత్ వెర్షన్ 5.4 సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ బడ్స్ ఒప్పో యొక్క Hey Melody App సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.

Also Read: Moto G67 Power 5G: భారీ బ్యాటరీ మరియు Sony ట్రిపుల్ కెమెరాతో లాంచ్ అవుతోంది.!

OPPO Enco X3s : ప్రైస్

ఒప్పో ఈ కొత్త బడ్స్ ని సింగపూర్ మార్కెట్లో SGD 189 ధరతో లాంచ్ చేసింది. ఇది మనకు సుమారు 13 వేల రూపాయల వరకు ఉంటుంది. ఈ బడ్స్ ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేస్తుందో లేదో ఒప్పో ఇంకా అనౌన్స్ చేయలేదు. అయితే, ఒప్పో ఫైండ్ X9 సిరీస్ ఫోన్లు ఇండియాలో లాంచ్ చేస్తున్నట్లు మాత్రం అనౌన్స్ చేసింది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :