Oppo Enco Buds 3 Pro price and features is here
Oppo Enco Buds 3 Pro: ఒప్పో నిన్న విడుదల చేసిన K13 టర్బో సిరీస్ స్మార్ట్ ఫోన్ లతో ఈ కొత్త బడ్స్ కూడా లాంచ్ చేసింది. ఈ కొత్త బడ్స్ ను ప్రీమియం డిజైన్ మరియు ఫీచర్స్ తో లాంచ్ చేసింది. ఈ కొత్త బడ్స్ ఎక్కువ సమయం ప్లే టైమ్ అందించే బ్యాటరీ వంటి మరిన్ని ఫీచర్స్ తో వచ్చింది. ఒప్పో సరికొత్తగా విడుదల చేసిన ఈ బడ్స్ ప్రైస్ మరియు ఫీచర్స్ తెలుసుకోండి.
ఒప్పో ఈ కొత్త ఎన్కో బడ్స్ 3 ప్రో ఇయర్ బడ్స్ ని కేవలం రూ. 1,799 ధరతో లాంచ్ చేసింది. ఈ బడ్స్ అండర్ రూ. 2,000 ప్రైస్ సెగ్మెంట్ యూజర్లను టార్గెట్ చేసుకొని అందించబడిన బడ్స్. ఈ బడ్స్ ప్రస్తుతం ప్రీ ఆర్డర్ కోసం అందుబాటులో ఉన్నాయి. ఈ బడ్స్ ఆగస్టు 20వ తేదీ నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.
ఒప్పో ఎన్కో బడ్స్ 3 ప్రో ఇయర్ బడ్స్ ని 12.4mm డైనమిక్ స్పీకర్ తో అందించింది. ఈ స్పీకర్లు 20~20KHz ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ రేట్ కలిగి ఉంటుంది. అంటే, గొప్ప బాస్ మరియు ట్రబుల్ సౌండ్ అందిస్తుంది. ఈ బడ్స్ AAC/SBC కొడెక్ కలిగి మంచి లీనమయ్యే సౌండ్ అందిస్తుంది. ఈ ఒప్పో కొత్త ఇయర్ బడ్స్ బ్లూటూత్ 5.4 కనెక్టివిటీ సపోర్ట్ తో మంచి కనెక్టివిటీ కలిగి ఉంటుంది.
ఈ ఒప్పో కొత్త బడ్స్ ఎక్కువ సమయం నిల్చె బ్యాటరీ మరియు ఆ బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేసే ఫాస్ట్ ఛార్జ్ సెటప్ తో అందించింది. ఈ బడ్స్ టోటల్ 54 గంటల ప్లే టైమ్ అందిస్తుంది. ఇందులో బడ్స్ సింగల్ ఛార్జ్ తో 12 గంటల ప్లే అందించే సత్తా కలిగి ఉంటాయని ఒప్పో తెలిపింది. ఈ బడ్స్ కేవలం 10 నిమిషాల ఛార్జ్ తో 4 గంటల ప్లే టైమ్ అందిస్తాయని ఒప్పో ఈబడ్స్ గురించి గొప్పగా చెబుతోంది. ఇందులో హైపర్ డ్యూరబుల్ బ్యాటరీ ఉన్నట్లు ఒప్పో ప్రకటించింది.
Also Read: Vivo V60 5G: వి సిరీస్ నుండి కొత్త ఫోన్ లాంచ్ చేసిన వివో.. ధర మరియు ఫీచర్స్ తెలుసుకోండి.!
ఇక డిజైన్ విషయానికి వస్తే, ఈ బడ్స్ కూడా ఎన్కో సిరీస్ లో ముందుగా వచ్చిన బడ్స్ మాదిరిగా కాంపాక్ట్ డిజైన్ తో అందించింది. ఈ బడ్స్ జేబులో పెట్టుకోవడానికి వీలుగా మంచి డిజైన్ తో అందించింది. ఈ కొత్త బడ్స్ ను గ్లేజ్ వైట్ మరియు గ్రాఫైట్ గ్రే రెండు రంగుల్లో అందించింది.