OPPO Enco Buds 3 Pro Plus ని బడ్జెట్ ధరలో ఆకట్టుకునే ఫీచర్స్ తో లాంచ్ చేసింది.!

Updated on 08-Jan-2026
HIGHLIGHTS

OPPO Enco Buds 3 Pro Plus కొత్త ఇయర్ బడ్స్ ను ఈరోజు ఒప్పో విడుదల చేసింది

ఈరోజు ఒప్పో నిర్వహించిన ప్రైమ్ ఈవెంట్ నుంచి విడుదల చేసిన 6 ప్రొడక్ట్స్ లో ఇది కూడా ఒకటి

ఈ బడ్స్ ను మంచి డిజైన్, బెస్ట్ డ్రైవర్స్ మరియు మంచి ఫీచర్స్ తో ఈ బడ్స్ లాంచ్ చేసింది

OPPO Enco Buds 3 Pro Plus కొత్త ఇయర్ బడ్స్ ను ఈరోజు ఒప్పో విడుదల చేసింది. ఈరోజు ఒప్పో నిర్వహించిన ప్రైమ్ ఈవెంట్ నుంచి విడుదల చేసిన 6 ప్రొడక్ట్స్ లో ఇది కూడా ఒకటి. ఈ బడ్స్ ను బడ్జెట్ ధరలో ఆకట్టుకునే ఫీచర్స్ తో లాంచ్ చేసిందని చెప్పవచ్చు. ఎందుకంటే, ఈ బడ్స్ ను మంచి డిజైన్, బెస్ట్ డ్రైవర్స్ మరియు మంచి ఫీచర్స్ తో ఈ బడ్స్ లాంచ్ చేసింది. ఒప్పో ఈరోజు విడుదల చేసిన ఈ లేటెస్ట్ బడ్స్ ప్రైస్ అండ్ ఫీచర్స్ తెలుసుకోండి.

OPPO Enco Buds 3 Pro Plus : ప్రైస్

ఒప్పో ఈ కొత్త బస్సు ని కేవలం రూ. 2,499 రూపాయల ఆఫర్ ధరలో లాంచ్ చేసింది.ఈ బడ్స్ ను సోనిక్ బ్లూ మరియు మిడ్ నైట్ బ్లాక్ రెండు రంగుల్లో లాంచ్ చేసింది. జనవరి 13వ తేదీ నుంచి ఈ బడ్స్ సేల్ మొదలవుతుంది. ఈ బడ్స్ ఒప్పో స్టోర్, ఫ్లిప్ కార్ట్, అమెజాన్ మరియు అన్ని రిటైల్ స్టోర్ లో లభిస్తుంది.

OPPO Enco Buds 3 Pro Plus : ఫీచర్స్

ఒప్పో ఎన్కో బడ్స్ ప్రో ప్లస్ ఇయర్ బడ్స్ ని మినిమం సైజు మరియు మంచి డిజైన్ లో విడుదల చేసింది. ఈ బడ్స్ 12.4mm టైటానైజ్డ్ డైఫాగ్రామ్ స్పీకర్ తో ఉంటుంది. ఈ సెటప్ తో ఈ బడ్స్ మంచి సౌండ్ అందిస్తుంది. ఇందులో డీప్ బాస్ అండ్ పంచి బాస్ తో పాటు గొప్ప హై సౌండ్ కూడా మీరు పొందవచ్చు. ఈ బడ్స్ 32 dB యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫీచర్ తో రద్దీ గా ఉండే ప్రాంతాల్లో కూడా మీ ఆడియో లేదా కాలింగ్ వినే అనుభవం మంచిగా ఉంటుంది.

ఇక కాలింగ్ పరంగా కూడా ఈ బడ్స్ మంచి ఫీచర్స్ కలిగి ఉంది. ఈ బడ్స్ లో డ్యూయల్ మైక్ Ai క్లియర్ కాల్ ఫీచర్ వుంది. ఇది మంచి కాలింగ్ అందించడానికి సహాయం చేస్తుంది. ఈ బడ్స్ తో టోటల్ 43 గంటల ప్లే బ్యాక్ అందుతుంది. అలాగే, కేవలం 10 నిముషాల్లో 4 గంటల ప్లేబ్యాక్ అందించే ఫాస్ట్ ఛార్జ్ ఫీచర్ కూడా అందించింది. ఈ బడ్స్ IP55 రేటింగ్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ సపోర్ట్ కలిగి ఉంటుంది.

Also Read: OPPO Reno 15 Pro మరియు 15 Pro Mini 5G ప్రైస్ అండ్ కంప్లీట్ ఫీచర్స్ తెలుసుకోండి.!

ఈ బడ్స్ ను లేటెస్ట్ బ్లూటూత్ 5.4 కనెక్టివిటీ సపోర్ట్ తో అందించింది. ఇందులో టచ్ కంట్రోల్, గూగుల్ ఫాస్ట్ పెయిర్ మరియు మంచి ఈక్వలైజర్ మోడ్స్ కూడా ఉన్నాయి.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :