OnePlus Buds Pro 3 with leather like texture and premium features launching
OnePlus Buds Pro 3 : వన్ ప్లస్ బ్రాండ్ కొత్త ప్రీమియం ఇయర్ బడ్స్ ను భారత మార్కెట్లో విడుదల చేయడానికి డేట్ ఫిక్స్ చేసింది. ఈ అప్ కమింగ్ ఇయర్ బడ్స్ ను ఆగస్టు 20 న ఇండియాలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఇయర్ బడ్స్ లాంచ్ డేట్ తో పాటు ఈ బడ్స్ డిజైన్ వివరాలను కూడా ప్రకటించింది.
వన్ ప్లస్ బడ్స్ ప్రో 3 ఇయర్ బడ్స్ ను ఆగస్టు 20వ తేదీన విడుదల చేస్తుంది. ఈ బడ్స్ ను కొత్త గిప్పి టెక్స్చర్ తో అందిస్తున్నట్లు వన్ ప్లస్ అనౌన్స్ చేసింది. ఇది ప్రీమియం లెథర్ లాంటి టెక్స్చర్ ను కలిగి ఉంటుంది. ఇది చూడటానికి ప్రీమియం లుక్ ను పట్టుకోవడానికి మంచి గ్రేవ్ ఇస్తుందని వన్ ప్లస్ చెబుతోంది.
ఈ అప్ కమింగ్ బడ్స్ ను గ్రిప్పి సౌండ్ క్వాలిటీ తో తీసుకువస్తున్నట్లు కూడా వన్ ప్లస్ హింట్ ఇచ్చింది. నెట్టింట్లో ఇప్పటికే ఈ బడ్స్ గురించి వచ్చిన లీక్స్ మరియు అంచనా ఫీచర్స్ ను నిజం చేసేలా వన్ ప్లస్ ఇచ్చిన హింట్ కనిపిస్తుంది. వన్ ప్లస్ అప్ కమింగ్ బడ్స్ 11mm ఉఫర్ మరియు 6mm ట్వీటర్ లతో వస్తాయని లీక్స్ చెబుతున్నాయి. ఇప్పుడు వన్ ప్లస్ తెలిపిన ఈ కొత్త విషయం ద్రువీకరించేలా కనిపిస్తున్నాయి.
అంతేకాదు, ఈ బడ్స్ ను DynAudio సపోర్ట్ అందిస్తున్నట్లు కూడా వన్ ప్లస్ తెలిపింది. వన్ ప్లస్ క్లబ్ X అకౌంట్ నుంచి అందించిన ఒక టీజర్ వీడియో లో ఈ బడ్స్ బాక్స్ వివరాలను కూడా బయటపెట్టింది. ఈ వీడియో ప్రకారం, ఈ బడ్స్ లో టైప్ C ఛార్జ్ సపోర్ట్ ఉంది మరియు DynAudio ట్యూన్డ్ సౌండ్ సపోర్ట్ తో ఈ బడ్స్ వస్తాయి.
Also Read: Infinix INBOOK Y3 Max: బడ్జెట్ ధరలో 12th జెన్ ఇంటెల్ కోర్ తో కొత్త ల్యాప్ టాప్ లాంచ్.!
అలాగే, ఈ బడ్స్ LDAC మరియు Hi RES Wireless సపోర్ట్ లను కలిగి ఉంటుందని కూడా అంచనా వేస్తున్నారు. అయితే, లాంచ్ నాటికి ఈ బడ్స్ లో ఎటువంటి స్పెక్స్ ఎటువంటి స్పెక్స్ ఉంటాయో తెలుస్తాయి. కానీ, ఈ బడ్స్ కేసు మాత్రం చూడటానికి విలక్షణం గా కనిపిస్తోంది.