Nothing Ear (note) AI లాంచ్ డేట్ అనౌన్స్ చేసిన నథింగ్ .. AI వాయిస్ రికార్డింగ్ తో వస్తుంది.!
Nothing Ear (note) AI కొత్త ఇయర్ బడ్స్ లాంచ్ అనౌన్స్
ఈరోజు ఈ అప్ కమింగ్ ఇయర్ బడ్స్ లాంచ్ డేట్ ను కూడా అనౌన్స్ చేసింది
AI వాయిస్ రికార్డింగ్ మరియు మీటింగ్ బ్రీఫ్స్ వంటి పనులు కూడా చేస్తుంది
Nothing Ear (note) AI పేరుతో కొత్త ఇయర్ బడ్స్ ను లాంచ్ చేస్తునట్లు నథింగ్ నిన్నటి వరకు టీజింగ్ చేసింది. అయితే, ఈరోజు ఈ అప్ కమింగ్ ఇయర్ బడ్స్ లాంచ్ డేట్ ను కూడా అనౌన్స్ చేసింది. కంపెనీ అఫిషియల్ X అకౌంట్ నుంచి ఈ అప్ కమింగ్ ఇయర్ బడ్స్ లాంచ్ డేట్ కన్ఫర్మ్ చేసింది. ఇది కేవలం పాటలు వినడానికి మరియు కాలింగ్ కోసం మాత్రమే పనిచేసే ఇయర్ బడ్స్ కాదని కంపెనీ తెలిపింది. ఇది AI వాయిస్ రికార్డింగ్ మరియు మీటింగ్ బ్రీఫ్స్ వంటి పనులు కూడా చేసే సత్తా కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది.
Nothing Ear (note) AI లాంచ్ డేట్
నథింగ్ ఇయర్ నోట్ ఏఐ ఇయర్ బడ్స్ ను డిసెంబర్ 8వ తేదీ గ్లోబల్ మార్కెట్ లో విడుదల చేస్తునట్లు ప్రకటించింది. ఈ బడ్స్ అదే సమయంలో ఇండియాలో కూడా లాంచ్ చేస్తోందో లేదో ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. అయితే, ఈ బడ్స్ కోసం గొప్పగా టీజింగ్ చేస్తోంది. ఈ అప్ కమింగ్ బడ్స్ ఫీచర్స్ గురించి కంపెనీ చాలా గొప్పగా చెబుతోంది.
Nothing Ear (note) AI : ఫీచర్స్
ఈ అప్ కమింగ్ బడ్స్ కోసం కంపెనీ విడుదల చేసిన టీజర్ ద్వారా ఈ బడ్స్ లో ప్రధాన ఆకర్షణ దాని ఛార్జింగ్ కేస్ అని తెలుస్తోంది. ఇందులో ప్రత్యేక మైక్రోఫోన్లు మరియు ఫిజికల్ బటన్లు ఉంటాయి. వీటి సహాయంతో మీటింగ్స్ మరియు వ్యక్తిగత సంభాషణలను రికార్డ్ చేసుకోవచ్చు. ఈ ఇయర్ బడ్స్ ను చెవుల్లో పెట్టుకోకుండానే ఛార్జింగ్ కేస్ ద్వారా సంభాషణలను రికార్డ్ చేయడం దీని ప్రత్యేకత అని తెలుస్తోంది.
Talk బటన్ మరియు AI ఏజెంట్లు ఈ ఇయర్ బడ్స్ లో ఫిజికల్ గా ఉంటాయి. దీని ద్వారా వాయిస్ నోట్స్ రికార్డ్ చేయవచ్చు. అంతేకాకుండా నథింగ్ సొంత వాయిస్ కంట్రోల్ సిస్టమ్ తో పాటు ఇతర AI ఏజెంట్లను ఉపయోగించి కూడా మాట్లాడే సదుపాయం కూడా ఉండనుంది. ఈ బడ్స్ చూడటానికి కూడా చాలా ఆకర్షమైనా సరికొత్త డిజైన్ తో ఉంటుంది. ఈ బడ్స్ కేవలం ఏఐ ఫీచర్స్ మాత్రమే కాదు బెస్ట్ ఇన్ క్లాస్ ఆడియో అనుభూతిని కూడా అందిస్తుందని నథింగ్ చెబుతోంది.
అంచనా ఫీచర్స్
రికార్డ్ చేసిన ఆడియోను స్మార్ట్ ఫోన్ లోని కంపానియన్ యాప్ ద్వారా నిర్వహించుకునే అవకాశం ఈ బడ్స్ ల్లో ఉంటుందని అంచనా వేస్తున్నారు. AI టెక్నాలజీ సహాయంతో సంభాషణలను టెక్స్ట్ రూపంలోకి మార్చడంతో పాటు, ముఖ్యమైన విషయాలు సంక్షిప్తంగా సమ్మరీ రూపంలో కూడా పొందవచ్చు. ఫోన్ లో వచ్చే కాల్స్ ను కూడా ఈ ఇయర్ బడ్స్ ద్వారా రికార్డ్ చేసే సామర్థ్యం ఉండనుంది.
మొత్తానికి మార్కెట్ లో నడుస్తున్న సాధారణ బడ్స్ తో పోలిస్తే ఇది ఒక ప్రత్యేకమైన స్థానాన్ని దక్కించుకునే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.