Nothing Ear 3: కొత్త రూపం మరియు కొత్త Talk బటన్ తో టీజింగ్ చేస్తున్న నథింగ్.!
త్వరలోనే అప్ కమింగ్ బడ్స్ లాంచ్ చేయనున్నట్లు వన్ ప్లస్ టీజింగ్ మొదలు పెట్టింది
Nothing Ear 3 కొత్త Talk బటన్ తో లాంచ్ చేయబోతున్నట్లు టీజింగ్ మొదలు పెట్టింది
ఈ ఇయర్ బడ్స్ ను సెప్టెంబర్ 18వ తేదీ లాంచ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది
Nothing Ear 3: త్వరలోనే అప్ కమింగ్ బడ్స్ లాంచ్ చేయనున్నట్లు వన్ ప్లస్ టీజింగ్ మొదలు పెట్టింది. అదే నథింగ్ ఇయర్ 3 ఇయర్ బడ్స్ మరియు ఈ బడ్స్ ను కొత్త రూపం మరియు కొత్త Talk బటన్ తో లాంచ్ చేయబోతున్నట్లు టీజింగ్ మొదలు పెట్టింది. యాపిల్ రీసెంట్ గా విడుదల చేసిన ఆపిల్ ఎయిర్ పోడ్స్ ప్రో 3 కి పోటీగా ఈ కొత్త బడ్స్ తీసుకు వస్తుందని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
SurveyNothing Ear 3: లాంచ్ డేట్ ఏమిటి?
నథింగ్ అప్ కమింగ్ ఇయర్ బడ్స్ ఇయర్ 3 కోసం గత వారం రోజులుగా టీజింగ్ చేస్తోంది. అంతేకాదు, ఈ అప్ కమింగ్ బడ్స్ లాంచ్ డేట్ కూడా అనౌన్స్ చేసింది. ఈ ఇయర్ బడ్స్ ను సెప్టెంబర్ 18వ తేదీ లాంచ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. నథింగ్ అఫీషియల్ x అకౌంట్ నుంచి ఈ బడ్స్ గురించి టీజింగ్ చేస్తోంది.
Nothing Ear 3: ఫీచర్స్ ఏమిటి?
నథింగ్ ఇయర్ 3 బడ్స్ ఫీచర్స్ గురించి ప్రస్తుతానికి పెద్దగా వివరాలు అందించలేదు. అయితే, ఈ బడ్స్ బలమైన సిగ్నల్స్ మరియు గొప్ప మెటీరియల్ తో వస్తాయని మాత్రం తెలిపింది. ఇదే కాదు ఈ బడ్స్ కోసం అందించిన టీజర్ ఇమేజ్ ద్వారా ఈ బడ్స్ సరికొత్త డిజైన్ కలిగి ఉన్నట్లు కూడా వెల్లడించింది. ఈ అప్ కమింగ్ నథింగ్ బడ్స్ లో కొత్తగా ‘Talk’ బటన్ ను చేర్చింది.

ఈ కొత్త టాక్ బటన్ ఎలా పని చేస్తుంది మరియు దీని ఉపయోగాలు ఏమిటో ఇంకా వెల్లడించలేదు. ఈ కొత్త బటన్ ఈ బడ్స్ కి కొత్త అందం తెచ్చింది. ఈ బడ్స్ ట్రాన్స్పరెంట్ కేస్ మరియు మెటల్ బాడీ తో ఉన్నట్లు కనిపిస్తుంది. ఇది మరింత ఆకట్టుకునే స్టైలిష్ డిజైన్ తో పాటు బడ్స్ బాక్స్ లో బిల్ట్ ఇన్ స్పీకర్ కలిగి ఉన్నట్లు అనిపిస్తుంది. అయితే, ఈ విషయంపై కంపెనీ వివరాలు వెల్లడించలేదు.
Also Read: Samsung Galaxy Buds 3 FE: గెలాక్సీ AI మరియు మెరుగైన ANC తో లాంచ్ అయ్యింది.!
ఈ బడ్స్ లో కొత్తగా మరింత ఫీచర్స్ జత చేసినట్లు అనిపిస్తుంది. ఎందుకంటే, ఇది పారదర్శక డిజైన్ తో ఉంటుంది కాబట్టి ఇందులో అందించిన యాంటెన్నా కనిపిస్తుంది. దీని ద్వారా వీటిలో పెద్ద మరియు బలమైన యాంటెన్నా ఉన్నట్లు కనిపిస్తుంది. అంటే, ఈ బడ్స్ మరింత స్ట్రాంగ్ సిగ్నల్ అందుకుంటుంది. ఈ బడ్స్ మరిన్ని అప్డేట్స్ కూడా త్వరలో వెల్లడించే అవకాశం ఉంటుంది.