Noise Master Buds sale started with best deals
Noise Master Buds ఇప్పుడు సేల్ కి అందుబాటులోకి వచ్చింది. Bose సౌండ్ తో వచ్చిన ఈ కొత్త బడ్స్ ఇప్పుడు మంచి లాంచ్ ఆఫర్స్ తో తక్కువ ధరలో లభిస్తున్నాయి. ఈ బడ్స్ గొప్ప సౌండ్ సపోర్ట్ మరియు ఫీచర్స్ తో పాటు గొప్ప డిజైన్ తో కూడా ఆకట్టుకుంటాయి. నోయిస్ తెచ్చిన ఈ కొత్త బడ్స్ పై అందించిన ఆఫర్లు మరియు ఈ బడ్స్ ఫీచర్స్ ఏమిటో ఈరోజు చూద్దాం.
నోయిస్ ఈ కొత్త బడ్స్ ను రూ. 7,999 రూపాయల ధరతో లాంచ్ చేసింది. అయితే, ఈ బడ్స్ ను తక్కువ ధరలో అందుకునేలా బెస్ట్ డీల్స్ కూడా ఆఫర్ చేస్తోంది. ఈ నోయిస్ కొత్త బడ్స్ ను అమెజాన్ నుంచి BOBCARD EMI ఆప్షన్ తో కొనుగోలు చేసే వారికి రూ. 799 రూపాయల అదనపు డిస్కౌంట్ అందిస్తోంది. అంటే, ఈ బడ్స్ ను కేవలం రూ. 7,200 రూపాయల ఆఫర్ ధరకి పొందవచ్చు.
నోయిస్ ఈ కొత్త బడ్స్ ను BOSE సౌండ్ సపోర్ట్ తో అందించింది. ఈ బడ్స్ లో 12.4mm PEEK మరియు టైటానియం డ్రైవర్స్ జతగా కలిగిన డ్యూయల్ స్పీకర్ సెటప్ ఉంటుంది. ఈ నోయిస్ ఇయర్ బడ్స్ LHDC 5.0 సపోర్ట్ తో గొప్ప లీనమయ్యే సౌండ్ అందిస్తుంది. ఈ బడ్స్ గొప్ప స్పెటియల్ సౌండ్ అందిస్తుందని నోయిస్ తెలిపింది.
ఈ నోయిస్ మాస్టర్ బడ్స్ బై బోస్ ఇయర్ బడ్స్ గొప్ప డిజైన్ తో ఆకట్టుకుంటుంది. ఇది మాత్రమే కాదు నోయిస్ ఆడియో మాస్టర్ బడ్స్ యాప్ సపోర్ట్ తో వస్తుంది మరియు యూజర్ అనుకూలతను బట్టి సౌండ్ ను ట్యూన్ కూడా చేసుకునే వీలుంది. ఇది 44 గంటల టోటల్ ప్లే టైం అందిస్తుంది. ఈ బడ్స్ ఇన్స్టా ఛార్జ్, లో లేటెన్సీ మరియు వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ తో కూడా వస్తుంది.
Also Read: ఈ BSNL Plan తో నెలకు రూ. 200 కంటే తక్కువ ఖర్చుతో అన్లిమిటెడ్ లాభాలు అందుకోవచ్చు.!
ఈ నోయిస్ కొత్త బడ్స్ డ్యూయల్ పెయిరింగ్ సపోర్ట్ ను కూడా కలిగి ఉంటుంది. ఈ బడ్స్ సిల్వర్, టైటానియం మరియు ఓంక్సీ మూడు రంగుల్లో లభిస్తుంది.