Noise Master Buds: సూపర్ డిజైన్ మరియు Bose Sound తో కొత్త బడ్స్ లాంచ్ కన్ఫర్మ్.!

HIGHLIGHTS

Noise మార్కెట్ లో కొత్త Noise Master Buds బడ్స్ లాంచ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది

ఈ అప్ కమింగ్ బడ్స్ ను Bose Sound తో తీసుకొస్తున్నట్లు నోయిస్ గొప్పగా చెబుతోంది

ఈ అప్ కమింగ్ బడ్స్ Pre-Book కూడా అనౌన్స్ చేసింది

Noise Master Buds: సూపర్ డిజైన్ మరియు Bose Sound తో కొత్త బడ్స్ లాంచ్ కన్ఫర్మ్.!

ప్రముఖ ఇండియన్ బ్రాండ్ Noise మార్కెట్ లో కొత్త Noise Master Buds బడ్స్ లాంచ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. గత వారమే ఈ అప్ కమింగ్ ప్రోడక్ట్ గురించి టీజర్ అందించింది. అయితే, ఇప్పుడు ఈ అప్ కమింగ్ బడ్స్ యొక్క లాంచ్ డేట్ కూడా అనౌన్స్ చేసింది. కంపెనీ చేస్తున్న టీజింగ్ ను చూస్తుంటే ఈ అప్ కమింగ్ బడ్స్ గొప్ప సౌండ్ సపోర్ట్ మరియు గొప్ప డిజైన్ తో అందించబోతున్నట్లు కనిపిస్తుంది. ఎందుకంటే, ఈ అప్ కమింగ్ బడ్స్ ను Bose Sound తో తీసుకొస్తున్నట్లు నోయిస్ గొప్పగా చెబుతోంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఏమిటి ఈ Noise Master Buds?

నోయిస్ Master Buds పేరుతో కొత్త బడ్స్ లాంచ్ చేస్తోంది. ఈ అప్ కమింగ్ బడ్స్ గురించి కంపెనీ టీజింగ్ కూడా మొదలు పెట్టింది. ఈ అప్ కమింగ్ బడ్స్ టీజర్ ఇమేజ్ ద్వారా ఈ బడ్స్ గొప్ప డిజైన్ కలిగి ఉన్నట్లు అనిపిస్తుంది. ఈ అప్ కమింగ్ బడ్స్ బాక్స్ పై పెద్ద నాబ్ కనిపిస్తోంది. ఇది వాల్యూమ్ మరియు ఫీచర్ స్విచ్ బటన్ గా కూడా కావచ్చని అంచనా వేస్తున్నారు.

Also Read: ఈరోజు భారీ డిస్కౌంట్ తో 7 వేల బడ్జెట్ ధరలో లభిస్తున్న Dolby Atmos సౌండ్ బార్.!

Noise Master Buds: లాంచ్

ఈ అప్ కమింగ్ బడ్స్ ను ఫిబ్రవరి 13వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఇండియాలో లాంచ్ చేస్తున్నట్లు డేట్ కన్ఫర్మ్ చేసింది. అంతేకాదు, ఈ అప్ కమింగ్ బడ్స్ Pre-Book కూడా అనౌన్స్ చేసింది. అంటే, ఈ అప్ కమింగ్ నోయిస్ బడ్స్ ను లాంచ్ కంటే ముందుగానే ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చు.

Noise Master Buds

ఈ బడ్స్ యొక్క స్పెషాలిటీ గురించి నోయిస్ టీజింగ్ చేస్తోంది. అదేమిటంటే, ఈ బడ్స్ ను Sound By BOSE సౌండ్ ఫీచర్ తో లాంచ్ చేస్తోంది. అంటే, ప్రపంచ ఆడియో దిగ్గజ కంపెనీ బోస్ సహకారంతో ఈ బడ్స్ ను అందిస్తోంది. ఈ అప్ కమింగ్ బడ్స్ పెద్ద నోటిఫికేషన్ లైట్ మరియు సరికొత్త డిజన్ తో వస్తోంది. ఈ బడ్స్ యొక్క ఇతర కీలకమైన ఫీచర్ లను ఒక్కొక్కటిగా వెల్లడిస్తుందని నోయిస్ తెలిపింది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo