noise launching Noise Buds X2 with 140 hours playtime
Noise Buds X2: ప్రముఖ ఇండియన్ కంజ్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ నోయిస్ అప్ కమింగ్ బడ్స్ గురించి టీజింగ్ చేస్తోంది. బడ్జెట్ ధరలో స్మార్ట్ వేరబుల్ మరియు ఆడియో డివైజెస్ అందిస్తూ తనదైన యూజర్ బేస్ కలిగిన నోయిస్ అధిక ప్లే టైమ్ తో కొత్త బడ్స్ లాంచ్ చేస్తోంది. ఈ అప్ కమింగ్ బడ్స్ ను ఏకంగా 140 గంటల ప్లే టైమ్ తో లాంచ్ చేస్తున్నట్లు నోయిస్ గొప్పగా చెబుతోంది.
నోయిస్ ఈ అప్ కమింగ్ బడ్స్ ని జూన్ 5వ తేదీ లాంచ్ చేస్తున్నట్లు డేట్ అనౌన్స్ చేసింది. ఈ బడ్స్ కోసం అమెజాన్ ఇండియా ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజి అందించి టీజింగ్ చేస్తోంది. ఈ పేజీ నుండి ఈ అప్ కమింగ్ బడ్స్ ఫీచర్స్ తో టీజింగ్ చేస్తోంది. డేట్ మాత్రమే కాదు ఈ బడ్స్ ప్రైస్ కూడా ఈ కంపెనీ వెబ్సైట్ నుంచి అందించింది. ఈ బడ్స్ కేవలం రూ. 1,499 రూపాయల బడ్జెట్ ధరలో లాంచ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేసింది.
Also Read: భారీ ఆఫర్స్ తో మొదలైన iQOO Neo 10 స్మార్ట్ ఫోన్ సేల్.!
నోయిస్ ఈ బడ్స్ ను అధిక ప్లే టైమ్ అందించే ఫీచర్ తో అందిస్తున్నట్టు అనౌన్స్ చేసింది. నోయిస్ బడ్స్ ఎక్స్ 2 బడ్స్ ఏకంగా 140 గంటల ప్లే అందిస్తుందట. అయితే, ఈ బడ్స్ ను 60 వాల్యూమ్ తో ఉపయోగించే వారికి మాత్రమే ఈ ప్లే టైమ్ లభిస్తుందట. ఈ బడ్స్ 10mm స్పీకర్లు కలిగి ఉంటాయి మరియు డ్యూయల్ ఈక్వలైజర్ మోడ్ తో వస్తుంది. ఇందులో True BASS మరియు True Balance రెండు మోడ్స్ ఉంటాయి. ఈ బడ్స్ మంచి కాలింగ్ కోసం ENC సపోర్ట్ కలిగిన క్వాడ్ మైక్ సిస్టం కూడా కలిగి ఉంటుంది.
ఈ నోయిస్ అప్ కమింగ్ ఇయర్ బడ్స్ చూడగానే ఆకట్టుకునే రబ్బర్ తో కూడిన ఫినిష్ తో ఉంటుంది. ఈ ఇయర్ బడ్స్ డ్యూయల్ డివైజ్ పైరింగ్ మరియు లో లెటెన్సీ ఫిచర్ తో వస్తుంది. నోయిస్ బడ్స్ ఎక్స్ 2 బడ్స్ హైపర్ సింక్ మరియు ఇన్స్టా ఛార్జ్ సపోర్ట్ తో కూడా వస్తుంది. ఈ బడ్స్ బ్లూటూత్ వెర్షన్ 5.3 సపోర్ట్ తో మంచి కంటివిటీ కలిగి ఉంటుంది. ఈ బడ్స్ IPX5 వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుంది. ముఖ్యంగా, ఈ బడ్స్ 32dB ANC సపోర్ట్ కలిగి మంచి సౌండ్ అందిస్తుందని నోయిస్ తెలిపింది.
ఈ బడ్స్ ను నాలుగు కలర్ ఆప్షన్ లలో లాంచ్ చేస్తుంది. ఈ బడ్స్ పెబుల్ గ్రే, టైడ్ బ్లూ, డ్యూన్ బీగ్ మరియు ఎబొనీ బ్లాక్ నాలుగు రంగులు ఉన్నాయి. ఈ బడ్స్ ను నోయిస్ త్వరలో లాంచ్ చేస్తుందిని టీజింగ్ చేస్తోంది.