noise launching Noise Buds X Ultra with hybrid ANC and LHDC support
Noise Buds X Ultra: నోయిస్ అప్ కమింగ్ ఇయర్ బడ్స్ లాంచ్ గురించి అనౌన్స్ చేసింది. ఈ అప్ కమింగ్ బడ్స్ ను సరికొత్త డిజైన్ తో లాంచ్ చేస్తున్నట్లు టీజింగ్ మొదలు పెట్టిన కంపెనీ ఈ బడ్స్ కీలకమైన ఫీచర్స్ కూడా అనౌన్స్. ఈ అప్ కమింగ్ బడ్స్ ను హైబ్రిడ్ ANC మరియు LHDC సపోర్ట్ తో లాంచ్ చేస్తోంది. ఈ అప్ కమింగ్ నోయిస్ ఇయర్ బడ్స్ డిజైన్ మరియు ఫీచర్స్ పై ఒక లుక్కేద్దామా.
నోయిస్ బడ్స్ X అల్ట్రా ఇయర్ బడ్స్ ను త్వరలో లాంచ్ చేయబోతున్నట్లు నోయిస్ ప్రకటించింది. అయితే, ఈ బడ్స్ యొక్క ఫీచర్స్ తో టీజింగ్ చేస్తోంది. ఈ నోయిస్ బడ్స్ X అల్ట్రా ఇయర్ బడ్స్ దాదాపు అన్ని ఫీచర్స్ కూడా కంపెనీ ముందే అందించింది. ఈ ఇయర్ బడ్స్ కంప్లీట్ ఫీచర్స్ ను ఇప్పుడు చూద్దాం.
నోయిస్ బడ్స్ X అల్ట్రా ఇయర్ బడ్స్ 11mm స్పీకర్స్ కలిగి ఉంటుంది. గొప్ప అందించే విధంగా ఈ బడ్స్ LHDC సపోర్ట్ కలిగి ఉంటుంది. అంటే, ఈ బడ్స్ 24 బిట్ / 96kHz హై క్వాలిటీ ఆడియో ఫీచర్ తో వస్తుంది. సాధారణ SBC సపోర్ట్ కలిగిన ఇయర్ బడ్స్ కన్నా ఈ బడ్స్ 3 రెట్లు అధిక క్వాలిటీ సౌండ్ అందిస్తాయని నోయిస్ తెలిపింది. దీనికి జత ఈ బడ్స్ హైబ్రిడ్ ANC (45dB) ఫీచర్ ను కలిగి ఉంటుంది. అంటే, బయట శబ్దాలు చెవిలో చేరకుండా లీనమయ్యే సంగీతం ఆస్వాదించవచ్చు. అంతేకాదు, ఈ బడ్స్ బిల్ట్ ఈక్వలైజర్ మోడ్స్ కూడా కలిగి ఉంటుంది.
ఇక ఈ బడ్స్ అందించే కాల్ క్వాలిటీ గురించి కూడా నోయిస్ ముందే వెల్లడించింది. ఈ బడ్స్ 6 మైక్ ENC ఫీచర్ తో అల్ట్రా క్లియర్ కాలింగ్ అందిస్తుందని నోయిస్ తెలిపింది. కనెక్టివిటీ పరంగా ఈ బడ్స్ డ్యూయల్ డివైజ్ పెయిరింగ్ మరియు బ్లూటూత్ 5.3 ఫీచర్ తో వస్తుంది. ఈ బడ్స్ హైపర్ సింక్, ఇన్ ఇయర్ డిటెక్షన్ మరియు గూగుల్ ఫాస్ట్ పెయిర్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది.
Also Read: Realme GT 7 మీడియాటెక్ ఫుల్ చిప్ సెట్ Dimensity 9400e తో లాంచ్ అవుతోంది.!
నోయిస్ బడ్స్ X అల్ట్రా ఇయర్ బడ్స్ 50 గంటల వరకు ప్లే టైమ్ అందించే బ్యాటరీ సపోర్ట్ కలిగి ఉంటుంది. మంచి సరౌండ్ సౌండ్ అందించే స్పటియల్ ఆడియో సపోర్ట్ తో కూడా వస్తుంది. 65ms లో లెటెన్సీ మోడ్ మరియు ఇన్స్టా ఛార్జ్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది, అని నోయిస్ టీజింగ్ చేస్తోంది.